By: ABP Desam | Updated at : 07 Feb 2022 01:49 PM (IST)
సింగర్ రేవంత్ పెళ్లి
ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ రేవంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సింగర్ గా ఎన్నో పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇండియన్ ఐడల్ 9 టైటిల్ విజేతగా కూడా నిలిచాడు. బాహుబలి లాంటి సినిమాలో పాటలు పాడి తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 24న అన్విత అనే అమ్మాయితో రేవంత్ కి ఎంగేజ్మెంట్ జరిగింది.
ఇప్పుడు ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఆదివారం నాడు జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్ లో వీరి పెళ్లి నిరాడంబరంగా జరిగింది. కొందరు సెలబ్రిటీలు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు.
ప్రస్తుతం రేవంత్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక కెరీర్ విషయానికొస్తే.. పాటలు, టీవీ షోలతో బిజీగా ఉన్నాడు రేవంత్. ఇండియన్ ఐడల్ తెలుగు వెర్షన్ కి ముందుగా రేవంత్ ను హోస్ట్ గా తీసుకున్నారు. ఈ మేరకు అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఆ తరువాత శ్రీరామచంద్ర పేరు అనౌన్స్ చేశారు. ఇద్దరూ కలిపి ఈ షోని హోస్ట్ చేస్తారో లేక రేవంత్ తప్పుకున్నాడో తెలియాల్సివుంది!
Salaar Release Date: ఫ్లాప్ ఇచ్చిన రోజు హిట్ కొట్టడానికి వస్తున్న ప్రభాస్ - ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్
Urfi Javed: ఉర్ఫీ జావెద్‌కు లైంగిక వేదింపులు - అతడి ఫొటో, వాట్సాప్ చాట్ బయటపెట్టిన బ్యూటీ
Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?
Anjali Arora On Leaked MMS: అదంతా ఫేక్, అసభ్యకర వీడియోపై కంటతడి పెట్టిన అంజలి
Vijay Devarakonda : పూరి నాన్న, ఛార్మి అమ్మ - 'లైగర్' ఈవెంట్లో విజయ్ దేవరకొండ
Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్
TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం
Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది: ఏపీ సీఎం జగన్
India Independence Day 2022: కూతురుని, కొడుకుని ఒకేలా చూడకపోతే ఎలా? నారీశక్తికి అండగా నిలవండి - ప్రధాని మోదీ