అన్వేషించండి

Sid Sriram New Telugu Song : దాచి దాచి ఆ ఊసులేవో గొంతు లోపల - సిద్ శ్రీరామ్ కొత్త పాట!

సిద్ శ్రీరామ్ మరో కొత్త పాటతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సంగీత, తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్ నటించిన 'మసూద'లో ఆయన ఓ పాట పాడారు.

సీనియర్ హీరోయిన్, ఇప్పుడు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న సంగీత (Sangeetha) ఓ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మసూద' (Masooda Movie). 'జార్జ్ రెడ్డి'లో లలన్ సింగ్ పాత్రలో నటించిన తిరువీర్ (Thiruveer) ఈ సినిమాలో కథానాయకుడు. 'ఆహా' వెబ్ సిరీస్ 'సిన్'లో కూడా ఆయన హీరోగా చేశారు. ఆయన జోడీగా కావ్యా కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) నటించారు. కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిది. ఇంతకు ముందు 'గంగోత్రి'లో బాల నటిగా కనిపించిన అమ్మాయి ఈ అమ్మాయే.

నవంబర్ మూడో వారంలో 'మసూద'! 
నవంబర్ మూడో వారంలో 'మసూద' సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలుత 11న విడుదల చేయాలని అనుకున్నా... ఇప్పుడు 18కి వెళ్ళినట్టు తెలిసింది (Masooda Movie New Release Date). ఇంకా అధికారికంగా విడుదల తేదీని వెల్లడించలేదు. కానీ, ప్రచారం ప్రారంభించారు.  సినిమాలో తొలి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 

'మసూద'లో సిద్ శ్రీరామ్ పాట!
'మసూద'లో సిద్ శ్రీరామ్ ఓ పాట పాడారు. 'దాచి దాచి ఓసి కోయిలా... ఆ ఊసులేవో గొంతు లోపల' అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో నేడు విడుదల చేశారు. బుధవారం సాయంత్రం ఫుల్ సాంగ్, లిరికల్ వీడియో విడుదల చేస్తున్నారు. ఈ పాటకు చైతన్య పింగళి సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీత దర్శకుడు.

హారర్ డ్రామాగా 'మసూద' రూపొందింది. 'మ‌ళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ' వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థలో రూపొందుతోన్న మూడో చిత్రమిది. రాహుల్ యాదవ్ నక్కా (Rahul Yadav Nakka) నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళంలో విడుద‌ల చేయ‌డానికి  ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించిందని, మంచి హారర్ డ్రామాల్లో ఇదీ ఒకటిగా నిలుస్తుందనే నమ్మకం ఉందని రాహుల్ యాదవ్ నక్కా తెలిపారు. 

Also Read : 'పుష్ప 2' - ఖర్చులో అస్సలు తగ్గేదే లే

Masooda Teaser Review : 'మసూద' టీజర్ చూస్తే... ఇదొక హారర్ డ్రామా సినిమా అనే విషయం అర్థం అవుతోంది. 'టాబ్లెట్స్‌తో తనకు నయం అవుతుందని నాకు అనిపించడం లేదు గోపీ! అప్పుడప్పుడూ తాను చేసేది చూస్తే ఎవరైనా పీర్ బాబాకు చూపిస్తే మంచిదేమో! ఏమంటావ్' అని సంగీత చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. 'ఏమో అండీ. నాకు అస్సలు ఐడియా లేదు' అని తిరువీర్ చెబుతారు. ఆ తర్వాత స్క్రీన్ మీద చాలా విజువల్స్ కనిపిస్తాయి. కథేంటి? అనేది క్లారిటీగా చెప్పలేదు. కానీ, ముస్లిం ఫ్యామిలీ నేపథ్యంలో సినిమా తెరకెక్కించినట్టు అర్థం అవుతోంది.

మతం, మూఢ నమ్మకాలు, సైన్స్ నేపథ్యంలో సినిమా రూపొందించారు. ఇందులో గోపిగా తిరువీర్ నటించారు. సైన్స్ టీచర్ పాత్రలో సంగీత నటించారు.  శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్ తదితరులనూ చూపించారు. తిరువీర్ దేని కోసమో వెతకడం, ఆయన్ను ఎవరో కత్తితో పొడిచినట్టు చూపించడం... మొత్తం మీద సినిమాపై ఈ టీజర్ ఆసక్తి కలిగించింది.

'మళ్ళీ రావా'తో గౌతమ్ తిన్ననూరిని, 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'తో స్వరూప్ ఆర్ఎస్‌జేను దర్శకులుగా పరిచయం చేసిన రాహుల్ యాదవ్ నక్కా.. . ఈ సినిమాతో సాయికిరణ్ అనే యువకుడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. అఖిల రామ్, బాంధవి శ్రీధర్, 'సత్యం' రాజేష్ తదితరులు నటించారు. 

టాప్ హెడ్ లైన్స్

Swathi Wedding: దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 8th:కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కత్తి పట్టి శకుంతలని చంపడానికి వెళ్లిన లక్ష్మీ! విహారి ఆఫీస్ కాంట్రాక్ట్ బరిలో లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కత్తి పట్టి శకుంతలని చంపడానికి వెళ్లిన లక్ష్మీ! విహారి ఆఫీస్ కాంట్రాక్ట్ బరిలో లక్ష్మీ!
Anasuya: చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
Ravi Mohan: అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?
అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget