Actress Deepa: యువ నటి ఆత్మహత్య - సూసైడ్ లెటర్ లో ఏముందంటే?
యువనటి దీప అలియాస్ పౌలిన్ శనివారం నాడు చెన్నైలో తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
తమిళ ఇండస్ట్రీకి చెందిన యువనటి దీప(Deepa) అలియాస్ పౌలిన్ శనివారం నాడు చెన్నైలో విరుగంబాక్కంలోని మల్లికై అవెన్యూలో తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత కొద్దిరోజులుగా ఒంటరిగా నివసిస్తున్న దీప సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. అయితే కొన్నాళ్లుగా ఆయన ఒత్తిడికి గురవుతుందని స్నేహితులు వెల్లడించారు.
మరోవైపు ప్రేమ ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీప ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
నిన్నటి నుంచి దీపను సంప్రదించడానికి ఆమె కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దీంతో తన స్నేహితుడు ప్రభాకరన్ ఇంటికి వెళ్లి చూడగా.. దీప ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించింది. తన దగ్గర దొరికిన సూసైడ్ నోట్ లో.. తన చావుకి ఎవరూ కారణం కాదని.. తను జీవితాంతం ఒకరిని ప్రేమిస్తానంటూ రాసుకొచ్చింది. ఎవరిని ప్రేమిస్తుందనేది మాత్రం వెల్లడించలేదు. దీంతో ఇప్పుడు పోలీసులు ఆమె ఫోన్ రికార్డ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు.
Also Read : సమంతకు జోడీ - దుష్యంత మహారాజు - దేవ్ మోహన్ ఫస్ట్ లుక్
Also Read : భర్తకు నయనతార సర్‌ప్రైజ్... అక్కడికి తీసుకువెళ్ళి మరీ
View this post on Instagram
View this post on Instagram