Pathaan Besharam Rang : 'పఠాన్'లో బేషరమ్ రంగ్ - బికినీలో దీపిక గ్లామర్ పసంద్
షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ జంటగా నటిస్తున్న సినిమా 'పఠాన్'. ఇందులో బేషరమ్ రంగ్ పాటను ఈ నెల 12న విడుదల చేయనున్నారు.

షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కథానాయకుడిగా నటించిన సినిమా 'పఠాన్' (Pathan Movie). ఇదొక యాక్షన్ థ్రిల్లర్. స్పై ఫిల్మ్ అని చెప్పవచ్చు. షారుఖ్ గూఢచారిగా కనిపించనున్నారు. ఇందులో దీపికా పదుకోన్ (Deepika Padukone) కథానాయిక. 'ఓం శాంతి ఓం', 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రాల్లో వీళ్ళిద్దరి జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు... వాళ్ళ కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది. 'పఠాన్' నుంచి విడుదలైన లేటెస్ట్ స్టిల్స్ చూస్తే... ఇందులోనూ షారుఖ్, దీపిక ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా ఉన్నారు.
బేషరమ్ రంగ్...
బికినీలో దీపిక!
Pathaan Besharam Rang : 'పఠాన్' సినిమాలో తొలి పాట 'బేషరమ్ రంగ్'ను ఈ నెల 12న ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నారు. అందులో దీపికా పదుకోన్ గ్లామర్ హైలైట్ కానుంది. సాంగ్ రిలీజ్ విషయాన్ని చెబుతూ గోల్డెన్ కలర్ మోనికినీలో దిగిన ఫోటో పోస్ట్ చేశారు. లేటెస్టుగా ఎల్లో కలర్ బికినీలో పిక్ పోస్ట్ చేశారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... 'పఠాన్' స్టిల్స్‌లో దీపికా పదుకోన్ హాట్ హాట్‌గా ఉన్నారని ఫ్యాన్స్ అంటున్నారు. సాంగ్ విడుదలకు ముందు అంచనాలు పెంచేస్తున్నారు. సినిమాలో రెండు పాటలు ఉన్నాయి. ఆ రెండిటినీ ట్రైలర్ కంటే ముందు విడుదల చేయనున్నారు.
View this post on Instagram
తెలుగులోనూ జనవరి 25న 'పఠాన్'
Pathaan Movie Telugu Release : 'పఠాన్'ను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కంటే ఒక్క రోజు ముందు జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. 'వార్' వంటి సూపర్ డూపర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తీసిన సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ 'పఠాన్'ను నిర్మించింది. షారుఖ్, యశ్ రాజ్ ఫిల్మ్స్ కాంబినేషన్‌లో పలు విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. పైగా, ఆదిత్య చోప్రా నిర్మాణంలో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్స్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేశాయి. దానికి తోడు 'పఠాన్' ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. థియేటర్లలో ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
'పఠాన్'కు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్!
'జాక్ రీచర్', 'మిషన్ ఇంపాజిబుల్', 'టాప్ గన్ మార్వెరిక్' చిత్రాలతో పాటు మార్వెల్ స్టూడియో, స్టీవెన్ స్పీల్‌బర్గ్ చిత్రాలకు వర్క్ చేసిన యాక్షన్ డైరెక్టర్ కాసీ ఓ నీల్. 'పఠాన్' సినిమాలో యాక్షన్ దృశ్యాలకు ఆయన దర్శకత్వం వహించారు. హాలీవుడ్‌లో ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లకు ఏ మాత్రం తగ్గకుండా 'పఠాన్'లో యాక్షన్ సీన్స్ తీశారని చిత్ర బృందం చెబుతోంది.
Also Read : నటి వీణా కపూర్ దారుణ హత్య - తల్లిని చంపి నదిలో పడేసిన కుమారుడు
దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ స్టంట్స్, యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుతూ ''షారుఖ్ ఖాన్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌తో ఇలాంటి ఓ విజువల్ వండర్, యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నపుడు... దానికి తగ్గ విజన్ ఉన్న టీమ్ అవసరం అవుతుంది. మాకు సరిగ్గా అటువంటి ఓ టీమ్ కుదిరింది. టామ్ క్రూజ్ కోసం పని చేసిన కాసీ ఓ నీల్ మాతో పని చేశారు'' అని చెప్పారు.
View this post on Instagram
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















