By: ABP Desam | Updated at : 16 Jul 2023 06:06 PM (IST)
షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్(Photo Credit: Social Media)
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ చెప్పడంతో అమీర్ ఖాన్ ఓ ల్యాప్‌టాప్ కొన్నారు. కానీ, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో అమీర్ కాస్త వెనుకబడి ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయనకు అప్పటి వరకు ల్యాప్ టాప్ ఎలా ఉపయోగించాలో తెలియదు. ఈ కారణంగా ఆయన ఆ ల్యాప్ టాప్ ను 5 ఏండ్ల పాటు ఓపెన్ చేయలేదు. చివరకు దాన్ని ఓపెన్ చేయడంతో అది పని చేయలేదని తెలిపారు. తాజాగా జరిగిన NASSCOM ఆన్యువల్ టెక్నాలజీ అండ్ లీడర్ షిప్ సమ్మిట్ లో అమీర్ ఖాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాస్కామ్ సమ్మిట్ లో గెస్టుగా పాల్గొన్న అమీర్ ఖాన్, షారుఖ్ కొనిచ్చిన ల్యాప్ టాప్ గురించి వివరించారు. “1996లో ఓ లేటెస్ట్ ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలని షారుఖ్ చెప్పారు. దాని అవసరం తనకు లేదని భావించినా, షారుఖ్ చెప్పాడని కొనుగోలు చేశాను. కానీ, దానిని ఎలా ఉపయోగించాలో తెలియక సుమారు 5 ఏండ్ల పాటు దాన్ని ఓపెన్ చేయలేదు. ఆ తర్వాత ఓ రోజు దాన్ని ఓపెన్ చేశాను. కానీ, చాలా కాలం ఉపయోగించకపోవడంతో ఆ ల్యాప్ టాప్ ఓపెన్ కాలేదు” అని చెప్పారు. ఇదే కార్యక్రమంలో టెక్నాలజీకి తాను చాలా దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తానని అమీర్ ఖాన్ వెల్లడించారు. “టెక్నాలజీకి నేను ఇప్పటి వరకు చాలా దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. షారుఖ్ ఖాన్ తో పోల్చితే నేను టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నాను” అని చెప్పారు.
బాలీవుడ్ లో టాప్ హీరోలుగా కొనసాగుతున్న షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఇంత వరకూ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన ‘పెహ్లా నాషా’లో మాత్రమే అతిధి పాత్రలో కనిపించారు. 1993లో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ లో దీపక్ తిజోరి, పూజా భట్, రవీనా టాండన్, పరేష్ రావల్ నటించారు. ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో చివరిగా కనిపించిన అమీర్ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. బాయ్ కాట్ బాలీవుడ్ క్యాంపెయిన్ తో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఘోర పరాభవం కారణంగా అమీర్ ఖాన్ కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా ‘పఠాన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు షారుఖ్ ఖాన్. ఆయన కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఆయన ‘జవాన్’ సినిమాలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 7న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
Read Also: ‘సలార్’ లీక్ - ఆసక్తికర విషయాన్ని చెప్పిన జగపతిబాబు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
Bigg Boss Season 7 Telugu: తేజకు జైలు శిక్ష - కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్ణయం, నామినేషన్స్ విషయంలో కూడా ఎదురుదెబ్బ
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!
Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1
/body>