అన్వేషించండి

Chandra Mohan Daughter : వాళ్లు ఆయనపై జోక్స్ వేసుకున్నా అభిమానంగానే భావిస్తాం: చంద్రమోహన్ కూతురు షాకింగ్ కామెంట్స్

Chadra Mohan : సీనియర్ నటుడు చంద్రమోహన్ 11వ రోజు సంతాప సభ సందర్భంగా ఆయన కుమార్తె మాధవి తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

Senior Actor Chandra Mohan Daughter : టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇటీవల అనారోగ్య కారణాలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన నవంబర్ 11న హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణంతో సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన అకాల మరణంపై అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా గురువారం (నవంబర్ 23) కుటుంబ సభ్యులు ఆయన 11వ రోజు సంతాప సభను నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు, పాత్రికేయులు ఈ సంతాప సభకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చంద్రమోహన్ కూతురు మాధవి తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. "నాన్న కర్మయోగి. మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే అందులో మీకు చంద్రమోహన్ కనిపిస్తారు. అంతేకానీ అన్ని పనులు ఆపేసి నాకోసం రమ్మని ఏ రోజు చెప్పరు. ఈరోజు మీ పనులన్నిటిని వదిలిపెట్టుకొని కుటుంబ సభ్యుల్లాగా నాన్నగారి సంతాప సభకి వచ్చినందుకు అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఎవరు రాలేదో వాళ్ళు ఆయన గురించి జోక్స్ వేసుకుంటూ, ఆయన గురించి ఒక్క మాట మాట్లాడినా అది ఆయనకు చూపించిన అభిమానం గానే మేము భావిస్తాం. నాన్నగారు నిర్మాతల ఆర్టిస్ట్ అని మీరందరూ ముందే మాట్లాడుకున్నారు. నిర్మాతకి ఇబ్బంది కలిగించి అన్ని ఆపేసి రమ్మని మా నాన్నగారు ఏరోజు చెప్పరు. ఈరోజు ఈ సంతాప సభకి వచ్చిన వాళ్లతో పాటు నాన్నగారిని తలుచుకున్న ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులే. జీవితంలో ఎలా బ్రతకాలో నాన్నగారు మాకు చాలా నేర్పించారు. ఆయన లెగసి, ప్రిన్సిపుల్స్ ని నెక్స్ట్ తరానికి తీసుకెళ్లడం మా బాధ్యతగా భావిస్తున్నాం" అంటూ చెప్పుకొచ్చారు చంద్రమోహన్ కూతురు మాధవి.

కాగా చంద్రమోహన్ కి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు. ఇక చంద్రమోహన్ విషయానికొస్తే..1942 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌. బాపట్లలో బీఎస్సీ పూర్తి చేసి సినిమాల్లో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు వెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలా 1966లో రంగులరాట్నం అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీఇచ్చారు.

తన సినీ కెరియర్లో సుమారు 900కు పైగా సినిమాల్లో నటించారు. కెరియర్ ఆరంభంలో శ్రీదేవి జయసుధ జయప్రద లాంటి స్టార్ హీరోయిన్స్ తోనే నటించారు  చంద్రమోహన్, సుధ కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. నటుడిగా, సహాయనటుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్‌ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. సుమారు 175 సినిమాల్లో హీరోగా నటించిన ఆయన నటుడిగా రెండు ఫిలిం ఫేర్, ఆరు నంది అవార్డులు గెలుచుకున్నారు.

Also Read : కొన్నేళ్ల వరకు అలాంటి పాత్రలు చేయను, మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది - విజయ్ సేతుపతి

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget