అన్వేషించండి
Advertisement
Sarkaru Vaari Paata: మహేష్ సినిమా టైటిల్ సాంగ్ ట్యూన్ ప్లే చేసిన తమన్.. ఫ్యాన్స్ ఖుషీ..
త్వరలోనే మహేష్ బాబు టైటిల్ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ రాబోతుందనే విషయాన్ని తమన్ హింట్ ఇచ్చారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పోస్టర్స్ విడుదల కాగా.. అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నిజానికి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ 'ఆర్ఆర్ఆర్' కోసం వాయిదా వేసుకున్నారు. ఏప్రిల్ 1న విడుదలవుతుందని కొత్త డేట్ ఇచ్చారు కానీ ఇప్పుడు అది కూడా వాయిదా పడే ఛాన్స్ ఉంది.
ఇక ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చి చాలా కాలమవుతుంది. దీంతో ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 'సర్కారు వారి పాట' సినిమా నుంచి అప్డేట్ ఇవ్వలేకపోతున్నామని.. చిత్రబృందం క్షమాపణలు కూడా చెప్పింది. ఇదిలా ఉండగా.. చిత్ర సంగీత దర్శకుడు తమన్ 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ ట్యూన్ ను కాసేపు ప్లే చేసి వినిపించారు.
అంతేకాదు.. త్వరలోనే మహేష్ బాబు టైటిల్ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ రాబోతుందనే విషయాన్ని తమన్ హింట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
And We Started it for Our S⭐️🎵🎹 pic.twitter.com/Ihnlc0MHMD
— thaman S (@MusicThaman) January 22, 2022
View this post on Instagram
Also Read: చై-సామ్ విడాకులు.. ఆ చెత్త వార్తలు బాధపెట్టాయంటున్న నాగ్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion