అన్వేషించండి

Samantha: 16 ఏళ్ల వయస్సులో సమంత ఇలా ఉండేదట - ఫొటో చూశారా?

స్టార్ హీరోయిన్ సమంత తన మోడలింగ్ డేస్ ను గుర్తు చేసుకున్నారు. సమంత 16ఏళ్ల వయసులో ఉన్నప్పటి ఓ అందమైన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Samantha: నటి సమంతకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఏ విషయాన్ని దాచుకోకుండా బయటకు చెప్పేయడం సామ్‌కు అలవాటు. తనకు అనారోగ్యం ఉందని తెలిస్తే అవకాశాలు రావాని తెలిసినా.. ఆమె విషయాన్ని బయటిపెట్టి పెద్ద రిస్క్ చేసిందనే చెప్పుకోవాలి. అయితే, దాన్ని నెటిజనులు వివిధ రకాలుగా అర్థం చేసుకున్నారు అనుకోండి. తాజాగా సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటోను పోస్టు చేసింది. 16 ఏళ్ల వయస్సులో మోడలింగ్ చేస్తున్న రోజుల్లో తీసిన ఫొటో అది. ఆ ఫొటోను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. భలే క్యూట్‌గా ఉన్నావని కొందరు, అస్సలు పోలికలే లేవని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

'ఏం మాయ చేశావే' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత. మొదటి మూవీతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఇండస్ట్రీ పరంగా, వ్యక్తిగతంగా పలు ప్రశంసలతో పాటు కొన్ని సార్లు విమర్శలను ఎదుర్కొంటూ, వాటిని అధిగమిస్తూ ఆమె సాగిపోతోంది. మూవీకి సంబంధించిన లేదా పర్సనల్ విషయాలైనా .. ఏదైనా సరే సోషల్ మీడియా ద్వారా పంచుకునే సమంత తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను స్టోరీలో పోస్ట్ చేసింది. 16 ఏళ్ల వయసులో ఉన్నప్పటి ఓ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో పూల దుస్తులలో సమంతా కెమెరాకు స్టైలిష్ పోజ్ ఇస్తూ కనిపించింది. ఓపెన్ ట్రెస్‌లు, కోహ్లెడ్ ​​కళ్ళు, స్టైలిష్ జ్యువెల్లరీ ఆమె చాలా కొత్తగా కనిపించింది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టిన ఈ పాత మోనోక్రోమ్ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సామ్ పాత ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఉన్న తేడాలను పోల్చుతూ ఆమెపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

ఆ ఫోటోను చూసిన నెటిజన్లు సమంత అభిమానులు సామ్ అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయారని కామెంట్లు చేస్తున్నారు. సమంత 16 సంవత్సరాల వయస్సులో మరింత క్యూట్ గా ఉన్నారని మరి కొందరు చెబుతున్నారు. కొంతమంది నెటిజన్లు మాత్రం సమంత అప్పుడూ అందగత్తెనే ఇప్పుడూ అందగత్తెనే అని కామెంట్ చేయడంతో పాటు ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.
Samantha: 16 ఏళ్ల వయస్సులో సమంత ఇలా ఉండేదట - ఫొటో చూశారా?
Samantha: 16 ఏళ్ల వయస్సులో సమంత ఇలా ఉండేదట - ఫొటో చూశారా?

అయితే సమంత షేర్ చేసిన ఈ ఫొటో ఆమె అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువుతున్నప్పుడు మోడలింగ్ అసైన్‌మెంట్‌లు తీసుకున్నట్లు సమాచారం. సినిమాల్లోకి రాకముందు సామ్.. ఉపాధి కోసం ఎన్నో ఉద్యోగాలు చేసింది. ఆ తర్వాత మోడలింగ్ లో అడుగుపెట్టిన సమంత. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఈ రోజు చిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటీమణుల్లో ఒకరిగానిలిచారు.

భారీ అంచనాల నడుమ గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శాకుంతలం' సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యంత నిరాశ పర్చింది. సామ్ అంచనాలను కూడా తారు మారు చేసింది. ముందు నుంచీ ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ తో ముందుకెళ్లిన మూవీ టీం.. ఒక్కసారిగా పలు విమర్శలు ఎదుర్కొంది. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండత ఖుషీ సినిమాతో పాటు ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ తన కెరీర్ లోనే స్పెషల్ గా ఉంటాయని ఆమె నమ్ముతోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత... ఇటీవల వచ్చిన నెగెటివ్ కామెంట్స్ కు ఆమె ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.

సమంత ప్రస్తుతం'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది. రాజ్ & డికె దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సమంతతో పాటు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఆమెతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. రీసెంట్ గా ఆమె లండన్‌లో జరిగిన స్పెషల్ ప్రీమియర్ ఈవెంట్‌కు హాజరయ్యారు. 'సిటాడెల్' ఒరిజినల్ వెర్షన్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ నటించారు.

Also Read : ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా - 'మంగళవారం'లో పాయల్ బోల్డ్ లుక్

టాప్ హెడ్ లైన్స్

Idupu Kayitham Srilatha Song Promo : ఇడుపు కాయితం సాంగ్ ప్రోమో - ప్రియదర్శి, నాగదుర్గ మధ్య లవ్ రొమాంటిక్ సింగిల్
ఇడుపు కాయితం సాంగ్ ప్రోమో - ప్రియదర్శి, నాగదుర్గ మధ్య లవ్ రొమాంటిక్ సింగిల్
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
Tollywood Director Arrest : హీరోయిన్‌పై లైంగిక వేధింపులు? - టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అరెస్ట్!?
హీరోయిన్‌పై లైంగిక వేధింపులు? - టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అరెస్ట్!?
Godavari Serial Today August 26th: 'గోదావరి' సీరియల్: సూర్యని వణికించేసిన సింహాద్రి! నిత్యతో పెళ్లికి ఒకే చెప్పేసిన పడవబ్బాయ్!
'గోదావరి' సీరియల్: సూర్యని వణికించేసిన సింహాద్రి! నిత్యతో పెళ్లికి ఒకే చెప్పేసిన పడవబ్బాయ్!

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Fake Korrameenu Fish Identification: మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
Samantha Ruth Prabhu : ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
Kriti Sanon GIVA Ad: కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Embed widget