అన్వేషించండి

Samantha Kajal Aggarwal: కాజల్ గర్భంపై ట్రోల్స్, స్పందించిన సమంత, హన్సిక

కాజల్ అగర్వాల్ బాడీ షేమింగ్‌పై సమంత, హన్సిక, మంచు లక్ష్మీ స్పందించారు. ఆమె అందాన్ని అద్భుతంగా వర్ణించారు.

నటి కాజల్ అగర్వాల్ గర్భంపై కొందరు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. బాగా లావయ్యావంటూ ఆమెను బాడీ షేమింగ్ చేస్తున్నారు. దీంతో కాజల్ మౌనంగా ఉండలేకపోయింది. తనని ట్రోల్ చేస్తున్న నెటిజనులకు ఇచ్చి పడేసింది. అయితే, కోపంతో కాకుండా.. మహిళలపై గౌరవం కలిగేంత చక్కగా సమాధానం ఇచ్చింది. గర్భధారణ సమయంలో మహిళల్లో వచ్చే మార్పులను వివరిస్తూ మూర్ఖుల కళ్లు తెరిపించింది. కాజల్ చేసిన ఈ పోస్టుకు ఇప్పుడు యావత్ మహిళాలోకం మద్దతు తెలుపుతున్నారు. కాజల్ సోదరి నిషా అగర్వాల్‌‌తోపాటు నటి సమంత, మంచు లక్ష్మీ, రాశీ ఖాన్న సైతం స్పందించారు. 

ఇటీవల కాజల్ తన చెల్లెలు నిషా అగర్వాల్ కుమారుడితో ఓ ప్రకటనలో నటించింది. బేబీ బంప్‌తో ఉన్న ఆమెను చూసి కొంతమంది నెటిజనులు హేళన చేశారు. వారి కామెంట్లు బాధ కలిగించాయో ఏమిటో.. సోషల్ మీడియా వేదికగా తన మనసులో మాటను చెప్పేసింది. 

‘‘నా జీవితంలో, నా శరీరంలో, నా ఇంటిలో... ముఖ్యంగా వృత్తిపరమైన జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మార్పులతో ముందుకు వెళ్తున్నాను. ఈ సమయంలో కామెంట్లు, బాడీ షేమింగ్ మెసేజ్‌లు, మీమ్‌లు నాకు  నిజంగా సహాయం చేయవు. అందరం దయతో ఉండడం నేర్చుకుందాం. ఇతరుల పట్ల దయతో ఉండటం కష్టం అయితే... మీరు జీవించండి. ఇతరుల్ని జీవించనివ్వండి. గర్భవతులు పరిస్థితి గురించి విమర్శలు చేసేవాళ్లు మూర్ఖులు. జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న మహిళలకు, ముఖ్యంగా అర్థం చేసుకోలేని మూర్ఖులు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. గర్భధారణ సమయంలో మనం బరువు పెరుగుతాం. మనలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్ల మార్పులు ఉంటాయి. కడుపులో బిడ్డ పెరిగే కొద్దీ పొట్ట పెద్దది అవుతుంది. శిశువుకు తగినట్టుగా శరీరం సిద్ధమవుతుంది. కొందరికి శరీరం పెద్దదైన చోట స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడవచ్చు. కొన్నిసార్లు చర్మం చిట్లవచ్చు’’ అంటూ గర్బిణీలు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులను వివరించింది.
Samantha Kajal Aggarwal: కాజల్ గర్భంపై ట్రోల్స్, స్పందించిన సమంత, హన్సిక

కాజల్ పోస్ట్‌పై సమంతా కూడా స్పందించింది. అయితే, కాజల్‌ను కూల్ చేస్తూ.. ‘‘నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావ్’’ అని తెలిపింది. హన్సిక స్పందిస్తూ.. ‘‘నువ్వు అద్భుతంగా ఉంటావు కాజ్. ఏ కామెంట్లు దాన్ని మార్చలేవు. నువ్వే కాదు, నీ మనసు కూడా అందమైనదే’’ అని తెలిపింది. మంచు లక్ష్మి స్పందిస్తూ.. ‘‘ఎటు నుంచి చూసినా నువ్వు పర్‌ఫెక్ట్‌గా ఉంటావు. నీ చుట్టూ చాలా ప్రేమ ఉంది. హేటర్స్ ఎప్పుడూ హేటర్స్‌లాగేనే ఉంటారనేది గుర్తుంచుకో’’ అని పేర్కొంది. ప్రస్తుతం కాజల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: కాజల్‌కు కోపం వచ్చింది... తన గర్భంపై వస్తున్న ట్రోల్స్‌కు దిమ్మతిరిగే సమాధానం!
Samantha Kajal Aggarwal: కాజల్ గర్భంపై ట్రోల్స్, స్పందించిన సమంత, హన్సిక

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 15: చనిపోయినట్లు నటించి తప్పించుకున్న మురళి...కౌషికి వీడియో పంపి రూ.5కోట్లు డిమాండ్ చేసిన దివ్యాంక
జగద్ధాత్రి సీరియల్: చనిపోయినట్లు నటించి తప్పించుకున్న మురళి...కౌషికి వీడియో పంపి రూ.5కోట్లు డిమాండ్ చేసిన దివ్యాంక
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్, షాలినిల ఎడబాటు..! చివరిలో ట్విస్ట్! పాపం వంశీ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్, షాలినిల ఎడబాటు..! చివరిలో ట్విస్ట్! పాపం వంశీ!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ హారర్ థ్రిల్లర్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ హారర్ థ్రిల్లర్ డోంట్ మిస్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కిడ్నాప్‌లో లీడ్ కనిపెట్టిన మహా! జల్లెడ పడుతున్న విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కిడ్నాప్‌లో లీడ్ కనిపెట్టిన మహా! జల్లెడ పడుతున్న విహారి!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget