అన్వేషించండి

SalmanKhan: తమ్ముడి రెండో పెళ్లిపై సల్మాన్‌ఖాన్‌ సెటైర్లు - అందరి ముందు పరువు తీసేశాడుగా!

SalmanKhan: బిగ్‌బాస్‌ - 17 గ్రాండ్‌ఫినాలే స్టేజ్‌పై నవ్వులే నవ్వులే.. సల్మాన్‌ఖాన్‌, అర్బాజ్‌ఖాన్‌, సొహైల్‌ఖాన్‌ ముగ్గురు ఖాన్లు పెళ్లిల గురించి జోకులు వేసి నవ్వించారు.

Bigg Boss 17: హిందీ సీజన్‌ బిగ్‌బాస్‌ - 17 గ్రాండ్‌ ఫినాలే ధూమ్‌ధామ్‌గా జరిగింది. ఆదివారం సాయంత్రం ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. మున్నావర్‌ ఫరూఖీ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఇక ఈ సీజన్‌కి హోస్ట్‌గా సల్మాన్‌ ఖాన్‌ వ్యవహరిస్తుండగా.. ఫినాలేకి ఆయన తమ్ముళ్లు అర్బాజ్‌ఖాన్‌, సోహైల్‌ ఖాన్‌ వచ్చారు. దీంతో ఖాన్‌ ట్రయోతో స్టేజ్‌ కలకళ్లాడింది. ఇక వాళ్లు వేసిన జోకులతో ఆడియన్స్‌ తెగ ఎంటర్‌టైన్‌ అయ్యారు. అర్బాజ్‌ఖాన్‌ పెళ్లిపై సెటైర్లు వేసి నవ్వించారు సల్మాన్‌ఖాన్‌. 

అర్బాజ్‌ పెళ్లిపై జోకులు.. 

ప్రముఖ విలన్‌, నటుడు, సల్మాఖాన్‌ తమ్ముడు అర్బాజ్‌ ఈ మధ్యే రెండో పెళ్లి చేసుకున్నాడు. సెలబ్రిటీ మేకప్‌ ఆర్టిస్ట్‌ షురాఖాన్‌ను ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. దీంతో ఈ విషయమై స్టేజ్‌పై జోకులు పేలాయి. క్వీన్‌ ఆఫ్‌ కామెడీగా పేరుపొందిన భారతి అర్బాజ్‌ను టీజ్‌ చేశారు. తనను పెళ్లికి పిలవలేదని, తను చేసుకోబోయే తరువాతి పెళ్లికి తన పేరు గెస్ట్‌ లిస్ట్‌లో ఉంటుందని ఆశిస్తున్నానని అనేశారు. దీంతో ఆడియెన్స్‌ అంతా ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు.

ఆ వెంటనే టాపిక్‌ మార్చేసిన భారతి.. తెలివిగా సల్మాన్‌ ఖాన్‌ని కదిలిస్తూ అర్బాజ్‌ రెండోపెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగింది. దానికి సల్మాన్‌ అందరినీ నవ్విస్తూ.. "అర్బాజ్‌ ఎవ్వరి మాట వినడు" అంటూ పరోక్షంగా అతని మొదటి పెళ్లిపై సెటైర్లు వేశాడు. దానికి వెంటనే అర్బాజ్‌ సమాధానం ఇస్తూ.. "అర్బాజ్‌ ఎవ్వరి మాట వినడు.. ఒకవేళ వింటే.." అంటూ తన సమాధానం చెప్పడంతో.. ఆడియన్స్ అంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వారు. అలా స్టేజ్‌ మొత్తం సందడిగా మారిపోయింది. 

ఇక భారతి మరో గెస్ట్‌ సోహైల్‌నీ వదిలిపెట్టలేదు. ఆయన ఫ్యాషన్‌ సెన్స్‌పై సెటైర్లు వేసి, టీజ్‌ చేసింది. దీంతో బిగ్‌బాస్‌ స్టేజ్‌ మొత్తం ఖాన్‌ బ్రదర్స్‌ ఫన్‌తో కలకలాడింది. కొంచెంసేపు ప్రేక్షకులు, హౌస్‌మెట్స్‌ బాగా నవ్వుకున్నారు. ఖాన్‌ బ్రదర్స్‌ అలా తమ మార్క్‌ చూపించారు బిగ్‌బాస్‌ ఫినాలే స్టేజ్‌పైన.

ఇక ఫినాలేలో మున్నావర్‌ ఫరూఖీ అనే స్టాండప్‌ కమెడియన్‌ ట్రోఫీ అందుకున్నారు. ఆయనకు గిఫ్ట్‌గా రూ.50 లక్షల ప్రైజ్‌మనీ, బ్రాండ్‌ న్యూ హుందాయ్‌ క్రెటా కారును అందించారు సల్మాన్‌ఖాన్‌. ఇక అభిషేక్‌కుమార్‌ రన్నరప్‌గా నిలిచారు. ఇక స్టాండప్‌ కమెడియన్‌ ఫరూఖీ స్టాండప్‌ కమెడియన్‌, ర్యాపర్‌ కూడా. ఆయనకు సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఉంది. అయితే, హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు చేసినందుకు గాను ఫరూఖీ నెల పాటు జైల్లో కూడా ఉన్నారు. ఇక ఆ తర్వాత ఆయనకు సంబంధించి షోలు 12 వరుసగా క్యాన్సిల్‌ కావడంతో.. తను కామెడీని వదిలేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 2022లో రీఎంట్రీ ఇచ్చారు.  

సల్మాన్‌ఖాన్‌ తమ్ముడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అర్బాజ్‌ఖాన్‌ 1998లో నటి మలైకా అరోరాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2017లో ఆమెకు విడాకులు ఇచ్చి.. ఈ మధ్యే రెండో పెళ్లి చేసుకున్నారు. సల్మాన్‌ఖాన్‌ తమ్ముడిగా బాలీవడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అర్బాజ్‌ 'దరార్‌'తొ అరంగేట్రం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత 'హలో బ్రదర్‌', 'సోచ్‌', 'కుచ్‌ నా కహో', 'హల్‌చల్‌', 'జై చిరంజీవ', 'ఓంశాంతి', 'గాడ్‌ఫాదర్‌', 'ఫ్యాషన్‌' 'దబాంగ్‌' తదితర చిత్రాల్లో నటించారు.

Also read: బిగ్ బాస్ సీజన్ 17 విజేత అతడే, మన్నారాకు షాక్ - విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 26th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పద్మాక్షి, సహస్రల్ని ఐస్ చేసి ఇంట్లో చోటు దక్కించుకున్న మహా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పద్మాక్షి, సహస్రల్ని ఐస్ చేసి ఇంట్లో చోటు దక్కించుకున్న మహా!
Romantic Drama OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి A రేటెడ్ రొమాంటిక్ మూవీ - తెలుగులోనూ చూడొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి A రేటెడ్ రొమాంటిక్ మూవీ - తెలుగులోనూ చూడొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Fake Korrameenu Fish Identification: మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
Samantha Ruth Prabhu : ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
Embed widget