అన్వేషించండి

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ బర్త్‌డే స్పెషల్ - ‘దేవర’లో ‘భైర’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఎన్టీఆర్!

జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’లో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

‘దేవర’ టీమ్ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. బుధవారం (ఆగస్టు 16వ తేదీ) సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’లో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్ చూసినట్లయితే... జుట్టు ముఖం మీద పడుతూ బ్లాంక్ ఎక్స్‌ప్రెషన్‌తో ఉన్న సైఫ్ అలీ ఖాన్‌ను ఇందులో చూడవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో కొండలు, కిందన సముద్రం, అందులో పడవల్లో వెళ్తున్న కొంతమందిని చూపించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌లో కూడా పడవల్లో ఉన్న కొంతమందిని చంపినట్లు చూపించారు. కాబట్టి ఆ గ్యాంగ్... సైఫ్ అలీ ఖాన్ మనుషులే అని అర్థం చేసుకోవచ్చు.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇదే. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ విడుదల అయిన సంవత్సరం తర్వాత దీని షూటింగ్ ప్రారంభించారు. కొరటాల పూర్తిగా బౌండ్ స్క్రిప్టు లాక్ చేశాకనే సెట్స్ పైకి వెళ్లారని సమాచారం.

కానీ ఒక్కసారి సెట్స్ మీదకు వెళ్లాక షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఆరేడు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. కథానుసారం ఈ సినిమాలో బోలెడంత వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. అందుకే ముందుగా యాక్షన్ సన్నివేశాలన్నీ చిత్రీకరించి వీఎఫ్ఎక్స్ కంపెనీలకు అందించనున్నారు. ‘ఆక్వామ్యాన్’ లాంటి హాలీవుడ్ సినిమాలకు వీఎఫ్ఎక్స్ విభాగంలో పని చేసిన బ్రాడ్ మిన్నిచ్ ‘దేవర’కు వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్‌గా ఉన్నారు.

ట్రాన్స్‌ఫార్మర్స్, మిషన్ ఇంపాజిబుల్ లాంటి హాలీవుడ్ సినిమాలకు స్టంట్ కోఆర్డినేటర్‌గా పని చేసిన కెన్నీ బేట్స్ ‘దేవర’ కోసం పని చేస్తున్నారు. దీంతో యాక్షన్ పరంగా కూడా ఈ సినిమా కొత్తగా ఉండనుందని అనుకోవచ్చు. ఈ సినిమాతో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. తమిళ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ‘దేవర’కు మ్యూజిక్‌ను అందించనున్నాడు.

ఇప్పటికే దసరా లాంటి కమర్షియల్ సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన షైన్ టామ్ చాకో కూడా దేవరలో కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, కలై అరసన్, చైత్ర రాయ్, మురళీ శర్మ, ‘విక్రమ్’ ఫేమ్ నరేన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2024 ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘దేవర’ విడుదల కానుంది.

ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘దేవరకు’ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలు శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్‌ను సాబు సిరిల్ చూసుకుంటున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Read Also : Akshay Kumar: అక్షయ్ కుమార్ ఎట్టకేలకు ఇండియన్ అయ్యాడు - ‘రిపబ్లిక్ డే’ రోజు భారత పౌరసత్వం!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Husharu 2: ట్రక్కులో బీరుతో కల్ట్ బాయ్స్ ఈజ్ బ్యాక్... డబుల్ ఫన్ అండ్ మ్యాడ్‌నెస్‌తో 'హుషారు 2'
ట్రక్కులో బీరుతో కల్ట్ బాయ్స్ ఈజ్ బ్యాక్... డబుల్ ఫన్ అండ్ మ్యాడ్‌నెస్‌తో 'హుషారు 2'
Comedy Thriller OTT : కోమా తర్వాత ఊహించని పవర్... హీరో ఏం చేశాడు? - ఓటీటీలోకి ప్రేమలు ఫేమ్ సూపర్ నేచరల్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
కోమా తర్వాత ఊహించని పవర్... హీరో ఏం చేశాడు? - ఓటీటీలోకి ప్రేమలు ఫేమ్ సూపర్ నేచరల్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Brahmamudi Serial Today October 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీని తిట్టిన ఐశ్వర్య – రాజు, ఇందుల మీదకు లక్కీని రెచ్చగొట్టిన రేఖ  
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీని తిట్టిన ఐశ్వర్య – రాజు, ఇందుల మీదకు లక్కీని రెచ్చగొట్టిన రేఖ  
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 6: రాధపై ప్రేమ పుట్టిందని రామలింగానికి చెప్పిన విక్కీ..బర్త్‌డే గిఫ్ట్‌గా శీనయ్యను తీసుకొస్తానని హామీ
నువ్వులేక నేను లేను: రాధపై ప్రేమ పుట్టిందని రామలింగానికి చెప్పిన విక్కీ..బర్త్‌డే గిఫ్ట్‌గా శీనయ్యను తీసుకొస్తానని హామీ

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Telangana Governor Quota MLC: తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
SIR Astrological Analysis: ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
Rice Flour For Skin : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
BC Reservations In AP: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
Embed widget