అన్వేషించండి

SS Rajamouli in Tamil Nadu: తమిళనాడులో వెకేషన్ ఎంజాయ్ చేసిన జక్కన్న, కుటుంబంతో కలిసి ఆలయాల సందర్శన

దర్శకుడు రాజమౌళి తమిళనాడులో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడి ఆలయాలను సందర్శిస్తున్నారు. గొప్ప ఆలయాలను చూసి రీఫ్రెష్ అవుతున్నట్లు ఆయన వెల్లడించారు.

సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు తీరిక దొరికితే విదేశాల్లో వెకేషన్ కు వెళ్తుంటారు. ఫ్యామిలతో కలిసి అక్కడి అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. మహేష్ బాబు, చిరంజీవి లాంటి టాలీవుడ్ స్టార్స్ తరచుగా కుటుంబ సభ్యులతో కలిసి ఫారిన్ వెకేషన్ లో సరదగా గడుపుతుంటారు. ఫ్యామిలీతో కలిసి అక్కడి వీధుల్లో తిరుగుతుంటారు. కానీ, దర్శకుడు రాజమౌళి తీరే సఫరేటు. ఆయన విదేశాలకు బదులుగా స్వదేశంలోనే హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.

తమిళనాడు వెకేషన్ లో జక్కన ఫ్యామిలీ

దిగ్గజ దర్శకుడు రాజమౌళి గత కొద్ది రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్నారు. అక్కడి ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పూర్తిగా దైవ చింతనలో మునిగిపోయారు. ఇటీవల తన కుటుంబంతో విహారయాత్రకు రాజమౌళి వెళ్లారు. అందమైన పర్యాటక ప్రాంతాల్లో  సేద తీరారు. తాజాగా తమిళనాడు పర్యటనను ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు టూర్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

“నేను చాలా కాలంగా సెంట్రల్ తమిళనాడులో  రోడ్ ట్రిప్ వేయాలనుకున్నాను. నా కూతురుకు దేవాలయాలను సందర్శించే అలవాటు, ఇష్టం ఉన్నాయి. ఆమె కూడా మాకు తోడుగా వచ్చింది. కుటుంబ సభ్యులం అందరం కలిసి ఇటీవలే దేవాలయాలను సందర్శించడం ప్రారంభించాం. జూన్ చివరి వారంలో శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వర కోయిల్, రామేశ్వరం, కణాదుకథాన్, తూత్తుకుడి, మదురైకి వెళ్ళాను. అద్భుతమైన వాస్తుశిల్పం, అద్భుతమైన ఇంజనీరింగ్, పాండ్యులు, చోళ రాజులు, అనేక ఇతర పాలకుల లోతైన ఆధ్యాత్మిక కట్టడాలు నిజంగా మంత్రముగ్ధులను చేశాయి. మంత్రకూడం, కుంభకోణంలో చక్కటి భోజనం చేశాం. రామేశ్వరంలోని కాకా హోటల్ మురుగన్ మెస్‌లో భోజనం చేశాం. అన్ని చోట్లా భోజనం అద్భుతంగా ఉంటుంది. నేను వారంలో 2-3 కిలోలు పెరిగాను. 3 నెలల విదేశీ ప్రయాణం, ఫుడ్ హాబిట్స్ తర్వాత.. హోమ్ ల్యాండ్ టూర్ చేయడంతో ఎంతో రిఫ్రెష్‌గా, ఉత్సాహంగా ఉంది” అని రాజమౌళి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన తమిళ ఆలయాలకు సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు.  

మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న జక్కన్న

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో  ఆస్కార్ అవార్డులను సాధించిన రాజమౌళి, ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నారు. పాన్ వరల్డ్ మూవీగా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా జక్కన్న ఈ చిత్రాన్ని తీర్చి దిద్దుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ఉండబోతుందని వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ 2024లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.  ఇక మహేష్ బాబుతో సినిమా అయ్యాక మహాభారతం సినిమాను రాజమౌళి తీసే చాన్స్ ఉందని కూడా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు దర్శకధీరుడు తీయబోయే ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద అందరి దృష్టి పడింది.  

Read Also: ముఖ్య నేతలతో వరుస భేటీలు- పొలిటికల్ ఎంట్రీపై విజయ్ కీలక చర్చలు!

ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Aamir Khan Wedding : ఆమిర్ ఖాన్ మూడో వివాహం - ముంబయిలోనే సింపుల్‌గా వేడుక... చీఫ్ గెస్టులు ఎవరంటే?
ఆమిర్ ఖాన్ మూడో వివాహం - ముంబయిలోనే సింపుల్‌గా వేడుక... చీఫ్ గెస్టులు ఎవరంటే?
Rao Bahadur OTT : రావు బహదూర్ ఓటీటీ ప్లాట్ ‌ఫామ్ ఫిక్స్ - సత్యదేవ్ సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
రావు బహదూర్ ఓటీటీ ప్లాట్ ‌ఫామ్ ఫిక్స్ - సత్యదేవ్ సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Star Maa Serials : స్టార్ మాలో సరికొత్త సీరియల్ 'ఏ దేవి వరమో నువ్వు' - ఆ టాప్ సీరియల్స్ టైమింగ్స్ మారాయ్!
స్టార్ మాలో సరికొత్త సీరియల్ 'ఏ దేవి వరమో నువ్వు' - ఆ టాప్ సీరియల్స్ టైమింగ్స్ మారాయ్!
Veerabhadruni Rahasyam OTT : ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్ సిరీస్ - మర్మదేశం To వీరభద్రుని రహస్యం ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్ సిరీస్ - మర్మదేశం To వీరభద్రుని రహస్యం ఎందుకు చూడాలంటే?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!
Tata Sierra EV వర్సెస్‌ 5 ప్రత్యర్థి మోడళ్లు - ఈ టేబుల్స్‌ చూస్తే బెస్ట్ EV ఏదో ఈజీగా అర్ధమవుతుంది!
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Tata Sierra EV vs Curvv EV: ఎక్కువ రేంజ్‌, కంఫర్ట్, మంచి స్పేస్‌ కోసం ఏ EV కొనాలి?
రూ.20 లక్షల బడ్జెట్‌లో Tata Sierra EV లేదా Curvv EV - ఏది బెస్ట్ ఛాయిస్?
Embed widget