News
News
X

Fahadh Nazriya Love Story: ఫహాద్, నజ్రియా క్యూట్ లవ్ స్టోరీ - ప్రేమ ఒకే, పెళ్లిపై ఊహించని విమర్శలు, అసలు ఏమైంది?

తొలుత వెండితెరపై భార్య భర్తలుగా నటించిన ఫహద్ ఫాసిల్, నజ్రియా నజీమ్ ఆ తర్వాత నిజ జీవితంలోనూ భార్య భర్తలుగా మారారు. ‘బెంగుళూరు డేస్’లో కలిసి నటించిన ఈ జంట ప్రేమలోపడి పెళ్లితో ఒక్కటైంది.

FOLLOW US: 
Share:

లయాళ క్యూట్ కపుల్ ఫహద్ ఫాజిల్, నజ్రియా నజీమ్గు రించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ‘రాజా రాణి’, ఇటీవల ‘అంటే సుందరానికి’ మూవీతో నజ్రియా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. అలాగే, ఫహాద్ ‘పుష్ప’ మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే ఫహద్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది నజ్రియా. ఆ తర్వాత భార్యభర్తలు ఇద్దరు కలిసి ‘ట్రాన్స్’ అనే సినిమాలో నటించారు. ఇంతకీ వీరు ఎలా కలిశారు? ప్రేమ కథ ఎలా మొదలయ్యింది? పెళ్లి వెనుకున్నట్విస్టులు ఏంటి?

ఫహద్ ఫాసిల్, నజ్రియా నజీమ్ ‘బెంగుళూరు డేస్‌’ మూవీలో భార్యాభర్తలుగా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. అదే సినిమా సెట్స్‌పై వీరి ప్రేమ కథకు పునాది పడింది. ఈ సినిమాలో కపుల్స్ గా నటించిన ఈ జంట, మూవీ విడుదలకు ముందే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. జనవరి 2014లో అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 21న  వివాహం చేసుకున్నారు.  

పెళ్లి చేసుకుందామని ముందు ఎవరు చెప్పారు?

ఫహద్ తో ప్రేమ, పెళ్లి గురించి ముందుగా ప్రస్తావించింది నజ్రియా. సినిమా సెట్ లోనే ఫహద్ దగ్గరికి వెళ్లి తనను పెళ్లి చేసుకోమని అడిగిందట. ఈ విషయాన్ని స్వయంగా ఫహద్ చెప్పారు. “జీవితాంతం ఆమె నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పింది. నాతో ఎవరూ కూడా ఇలాంటి మాట చెప్పలేదు. అలాంటి అమ్మాయి ప్రేమను ఎవరు కోరుకోరు?” అని ఆయన చెప్పుకొచ్చారు. 

పెళ్లి తర్వాత నాలుగేళ్లు సినిమాలకు దూరం

వివాహం తర్వాత నజ్రియా నటనకు దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకుంది. తన వివాహ జీవితంపై దృష్టి పెట్టింది. ఆ సమయంలో ఫహద్ ఫాసిల్‌ ను వెనకుండి నడిపించింది. ఆ సమయంలో తన కెరీర్ లో వచ్చిన సక్సెస్ లో ఆమె శ్రమ చాలా ఉందని చెప్పారు ఫహద్. "నేను నజ్రియాను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా విజయాలు సాధించాను. వాటిని ఒంటరిగా నేను సాధించలేనని తెలుసు” అని చెప్పుకొచ్చారు.

ఎన్నో.. విమర్శలు

ఫహద్, నజ్రియా పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఇద్దరి మధ్య వయసులు భారీ తేడా ఉండటంతో బాగా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి.  పెళ్లి నాటికి నజ్రియా వయసు 19 ఏళ్లు కాగా, ఫహద్‌కు 32 ఏళ్లు. అంతేకాదు, పెళ్లి తర్వాత నజ్రియాను నటించకుండా అడ్డుకున్నారని విమర్శలు వచ్చాయి. వాటన్నింటినీ ఈ జంట ఎదుర్కొని నిలబడింది.   

పెళ్లి తర్వాత నాలుగేళ్లకు నజ్రియా, అంజలి మీనన్ దర్శకత్వం వహించిన ‘కూడే’ (2018)లో నటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్,  పార్వతి తిరువోతు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అనంతరం  నజ్రియా, ఫహద్ ఫాసిల్ కలిసి ‘ట్రాన్స్’ (2020)లో కూడా నటించింది. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా ఇద్దరూ కెరీర్ కొనసాగిస్తున్నారు. నజ్రియా తెలుగులో నటించిన ‘అంటే సుందరానికి..’ సినిమా మంచి టాక్ వచ్చినా, హిట్ మాత్రం కొట్టలేదు. అయితే, ఫహాద్ మాత్రం ‘పుష్ప’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ‘పుష్ప-2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 

View this post on Instagram
 
A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh)

Read Also: యూట్యూబ్ నుంచి ‘భీడ్‘ ట్రైలర్ తొలగింపు, ప్రజాస్వామ్య హత్య అంటూ నెటిజన్ల ఆగ్రహం

Published at : 16 Mar 2023 07:44 PM (IST) Tags: Fahadh Faasil Nazriya Nazim Romance Tales Fahadh Faasil Nazriya Nazim love story

సంబంధిత కథనాలు

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Rashmi Gautam Lifestyle : రష్మి వెనుక ఇంత తలనొప్పి ఉందా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ యాంకర్

Rashmi Gautam Lifestyle : రష్మి వెనుక ఇంత తలనొప్పి ఉందా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ యాంకర్

టాప్ స్టోరీస్

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!

KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!