అన్వేషించండి

Renu Desai: మహేష్ మూవీలో ఛాన్స్ వచ్చినా చేయలేదు, ఎందుకో చెప్పి కాంట్రవర్సీ చేయలేను

రేణు దేశాయ్ నటించిన తాజా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, మహేష్ బాబు చిత్రంలో నటించే అవకాశం వచ్చినా వదులుకోవడంపై స్పందించారు.

నటి రేణు దేశాయ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే కాకుండా నటిగానూ అందరికీ సుపరిచితం. ఇద్దరు పిల్లలకు తల్లిగా కొనసాగుతూనే అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాలు చేస్తోంది.  తాజాగా రవితేజ హీరోగా వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో రేణు దేశాయ్ కీలక పాత్ర పోషించింది. ఇందులో సంఘ సంస్కర్త హేమలత లవణం క్యారెక్టర్ చేసింది. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా రేణు దేశాయ్ పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తోంది.  

మహేష్ సినిమాలో అవకాశం వచ్చినా చేయలేదు- రేణు దేశాయ్

తాజాగా ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం రావడంపై స్పందించారు. మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రంలో తనకు అవకాశం వచ్చిందని ఆమె వెల్లడించారు. అయితే, కొన్ని కారణాలతో ఆ సినిమాను చేయలేకపోయానని చెప్పారు. ఆ కారణాలు ఏంటి అనేది చెప్పి కాంట్రవర్సీ చేయాలి అనుకోవడం లేదని రేణు దేశాయ్ తెలిపారు. “‘సర్కారు వారి పాట’ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. బ్యాంక్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్ కోసం నన్ను అడిగారు. ఆ రోల్‌ నాకు నచ్చింది. ఆ సినిమాలో నటించాలి అనుకున్నాను. కానీ, కొన్ని కారణాలతో చేయలేకపోయాను. ఆ కారణాలు ఏంటి? అనేది ఇప్పుడు చెప్పలేను.  అనవసరంగా కాంట్రవర్సీకి దారితీసే అవకాశం ఉంది. నిజం చెప్పాలని ఉన్నా, ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండటమే మంచిది” అని రేణు దేశాయ్ వెల్లడించారు.   

హేమలత పాత్ర చేయడం నా అదృష్టం- రేణు దేశాయ్

ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో హేమలత లవణం పాత్ర చేయడం నిజంగా తన అదృష్టం అని చెప్పారు రేణు దేశాయ్. ఆ రోజుల్లోనే హేమలత బుందేల్‌ఖండ్‌ కు వెళ్లి అనేక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. జోగిని వ్యవస్థ , అంటరానితనానికి వ్యతిరేకంగా కొట్లాడారని వెల్లడించారు. హేమలత పాత్ర కచ్చితంగా యువతకు మంచి స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు. ఇంత గొప్ప పాత్రలో నటించే అవకాశం రావడం తన అదృష్టం అన్నారు. హేమలత పాత్రను చేయడానికి ముందు ఆమె గురించి చాలా విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. అందులో భాగంగానే ఆమె మేనకోడలు కీర్తిని కలిసి పలు విషయాలు తెలుసుకున్నట్లు వివరించారు. ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడినట్లు చెప్పారు. చివరకు తను అనుకున్నట్లుగా నటించినట్లు రేణుదేశాయ్ తెలిపారు.    

రేణు దేశాయ్ 2003లో వచ్చిన ‘జానీ’ సినిమా తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ‘టైగర్ నాగేశర్వరరావు’ సినిమాలో కనిపించింది. స్టువర్టుపురం గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా  దర్శకుడు వంశీ కృష్ణ ఈ సినిమాను తెరకెక్కించారు.  నుపుర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గుర్రం జాషువా కుమార్తె హేమలత లవణం పాత్రను రేణు దేశాయ్ చేశారు. 

Read Also: నేచురల్ స్టార్ మూవీలో ప్రియాంక ఫిక్స్! ‘గ్యాంగ్ లీడర్’ తర్వాత మళ్లీ జోడీ!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget