అన్వేషించండి

Renu Desai: నా మనసు ఉద్వేగానికి గురైంది - రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్

తన కొడుకు అకిరా నందన్ ప్రధాని మోదీని కలవడం పట్ల రేణూ దేశాయ్ ఎమోషనల్ అయ్యింది. తన సంతోషాన్ని పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టింది.

Renu Desai Emotional Post About Akira: చాలా కాలంగా లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేసిన పవన్ కల్యాణ్-రేణూ దేశాయ్ ముద్దుల కొడుకు అకిరా నందన్, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మహా కూటమి విజయం సాధించిన తర్వాత బయటకు వచ్చాడు. తన తండ్రి వెంటే ఉంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కల్యాణ్ తో కలిసి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత పార్టీ కార్యాలయానికి వెళ్లాడు. జనసేన ఆఫీస్ కు వచ్చిన చంద్రబాబును కలిసి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. అటు నుంచి తండ్రితో పాటు ఢిల్లీకి వెళ్లాడు. పవన్ కల్యాణ్ తన కొడుకును ప్రధాని మోదీకి పరిచయం చేశారు. అందరూ కలిసి ఫోటో తీసుకున్నారు.

నా హృదయం నిండిపోయింది- రేణూ దేశాయ్

అటు అకిరా నందన్ ప్రధాని మోదీని కలవడం పట్ల ఎమోషనల్ అయ్యింది తల్లి రేణూ దేశాయ్. కొడుకు ప్రధానితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టింది. అకిరా ప్రధాని మోదీని కలవడం తనకు ఒక తల్లిగా ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని చెప్పింది. “ఒక తల్లిగా నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిన సందర్భం, కల్యాణ్ గారితో వెళ్లి అకిరా నరేంద్ర మోదీ గారికి కలిసి వారితో ఫోటో దిగడం. వ్యక్తిగతంగా నాకు బీజేపీ, మోడీ గారు అంటే నాకు చాలా అభిమానం. అలాంటిది ఈ రోజు ఈ ఫోటో చూస్తుంటే నా మనసు ఉద్వేగానికి గురైంది. నా కళ్లు ఆనందంతో  మెరిసిపోతున్నాయి. నా హృదయం నిండిపోయింది. అకిరాను ఆశీర్వదించిన మోదీ గారికి ధన్యవాదాలు. అలాగే, అకిరా మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు” అని రాసుకొచ్చింది.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

అకిరా ఫోన్ చేసి ఏం చెప్పాడంటే? - రేణూ దేశాయ్

ఇప్పటికే రేణూ దేశాయ్ తన కొడుకు ప్రధాని మోదీ కలవడంపై సంతోషం వ్యక్తం చేసింది. మోదీతో అకిరా ఫోటో చూస్తే ఆనందంగా, ఎమోషనల్ గా ఉందని వెల్లడించింది. ఈ సంతోష సమయంలో ఏం రాయాలో తెలియడం లేదని చెప్పింది.    ప్రధాని మోదీని కలిశాక అకిరా తనకు ఫోన్ చేసి ఎన్నో విషయాలు చెప్పినట్లు వివరించింది. మోదీతో ఉన్నంత సేపు తను ఎలా ఫీలయ్యాడో చెప్పుకొచ్చింది. “ప్రధాని మోదీ గారిని కలిసిన తర్వాత అకిరా నాకు ఫోన్ చేశాడు. ప్రధాని చుట్టూ ఓ తెలియని శక్తి ఉన్నట్లు చెప్పాడు. ఆ రూమ్ లో ఉన్నంత సేపు చాలా గొప్పగా, స్ట్రాంగ్ గా ఫీలయ్యాను అన్నాడు. ప్రధాని మోదీ దగ్గర ఏదో తెలియని పవర్ ఉన్నట్లు చెప్పాడు” అని రేణూ దేశాయ్ వివరించింది.

Read Also: ‘క‌ల్కి‘ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ - 24 గంటల్లో అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయా?

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget