అన్వేషించండి

Ravi Shankar: కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న డబ్బింగ్ కింగ్, పాన్ ఇండియా రేంజిలో ఫస్ట్ మూవీ

ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు, నటుడు రవి శంకర్ తన కొడుకును హీరోగా పరిచయం చేయబోతున్నారు. పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు.

సౌత్ సినిమా పరిశ్రమలో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు, నటుడిగా గుర్తింపు పొందిన రవి శంకర్ తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. ఆయన కొడుకు అధ్వయ్ హీరోగా ఓ మూవీని ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలంగా అధ్వయ్ ని పరిశ్రమలోకి తీసుకురావాలి అని రవి శంకర్ భావిస్తున్నారు. ఎట్టకేలకు ఆయన డెబ్యూ మూవీ ఖరారు అయ్యింది. ఈ చిత్రానికి రవి శంకర్ స్వయంగా దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. త్వరలోఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ టీజర్ తో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 24న సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి కథ కూడా రవి శంకరే రాశారట. ఈ సినిమా యూత్ ఫుల్ రొమాంటిక్ కాలేజీ లవ్ స్టోరీగా తెరకెక్కనుండగా, మిస్టరీ, దైవత్వంతో కూడిన ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నట్లు రవిశంకర్ తెలిపారు.

నా కొడుకు తొలి సినిమాకు నేనే దర్శకత్వం వహిస్తున్నా- రవిశంకర్

ఇక తన కొడుకు తొలి సినిమాకు దర్శకత్వం వహించడం రవి శంకర్ సంతోషం వ్యక్తం చేశారు. “నేను 20 ఏళ్ల క్రితం మాలాశ్రీ నటించిన ‘దుర్గి’ చిత్రానికి  దర్శకత్వం వహించాను. ఆ తర్వాత నేను నటన వైపు మళ్లాను. కానీ, దర్శకత్వం చేయాలనే కోరిక మాత్రం తీరలేదు. మా అబ్బాయి గురించి అందరి కంటే నాకు బాగా తెలుసు. ఆయనకు ఎలాంటి కథ అయితే సూటవుతుంది అనేది కూడా నాకు తెలుసు. అందుకే, ఆయన తొలి సినిమాకు నేనే దర్శకత్వం వహించాలని నిర్ణయం తీసుకున్నాను” అని రవిశంకర్ తెలిపారు.

ఇక ఈ చిత్రానికి ప్రమఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్‌ను స్వరకర్తగా రవి శంకర్ ఖరారు చేశారు. ఇక హీరోయిన్ సహా నటీనటుల సెలెక్షన్ పై  ఆయన ఫోకస్ పెట్టారు. హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోవాలని రవి శంకర్ భావిస్తున్నారట. ఇక ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు.

అమెరికాలో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసిన అధ్వయ్

అధ్వయ్ న్యూయార్క్‌ లోని ది లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏడాదిపాటు యాక్టింగ్ కోర్సు పూర్తి చేశారు. తాజాగా ఆయన అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. తన తొలి మూవీ కోసం ఆయన సిద్ధం అవుతున్నారు. అటు రవి శంకర్ ప్రస్తుతం ధృవ సర్జా, సంజయ్ దత్, రీష్మా నానయ్య ప్రధాన పాత్రలు పోషించిన ‘కెడి’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం తన కొడుకు చిత్రంపై ఆయన ఫుల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కొంత కాలం పాటు నటనకు విరామం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Read Also: వాత పెట్టిన ఎదపై ఐస్ రాసినట్టు, ఆకట్టుకుంటున్న ‘డీజే పిల్లా’ లిరికల్ సాంగ్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today November 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీని తిట్టిన రాజు – ఇందు, రాజులను చంపేందుకు రేఖ ప్లాన్‌  
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీని తిట్టిన రాజు – ఇందు, రాజులను చంపేందుకు రేఖ ప్లాన్‌  
Karthika Deepam 2 Serial Today November 21st: కార్తీకదీపం 2 సీరియల్: మాలినితో జ్యోత్స్న ఓపెన్ ఛాలెంజ్! జ్యోత్స్నని చంపేయడానికి రేపే ముహూర్తం!
కార్తీకదీపం 2 సీరియల్: మాలినితో జ్యోత్స్న ఓపెన్ ఛాలెంజ్! జ్యోత్స్నని చంపేయడానికి రేపే ముహూర్తం!
Illu Illalu Pillalu Serial Today November 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ఫోన్ పగలగొట్టిన సాగర్! రౌడీలకు కారు ఇచ్చేసిన ప్రేమ.. అంజలితో చందు ముచ్చట్లు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ఫోన్ పగలగొట్టిన సాగర్! రౌడీలకు కారు ఇచ్చేసిన ప్రేమ.. అంజలితో చందు ముచ్చట్లు!
Bigg Boss Season 10 Today November 20th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డైరెక్ట్ 13వ వారంలోకి కెప్టెన్ అమన్ మసూద్! ముకేశ్‌ చేష్టలకు ఫాలోవర్స్ అసహనం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డైరెక్ట్ 13వ వారంలోకి కెప్టెన్ అమన్ మసూద్! ముకేశ్‌ చేష్టలకు ఫాలోవర్స్ అసహనం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget