By: ABP Desam | Updated at : 14 Dec 2022 12:54 PM (IST)
Edited By: Mani kumar
Rashmika Mandanna
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్ లలో రష్మిక మందన్న ఒకరు. ‘కిరాక్ పార్టీ’ అనే కన్నడ చిత్రం తో సినిమా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తర్వాత తెలుగులో నాగశౌర్య హీరోగా నటించిన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ‘సుల్తాన్’ సినిమాతో తమిళ్ లోనూ అడుగు పెట్టింది. ఇప్పుడు ఈ మూడు భాషల్లోనే కాదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ. ఇటీవలె హిందీలో అమితాబ్ బచ్చన్ తో కలసి ‘గుడ్ బై’ అనే సినిమా చేసింది. ఈ సినిమా అక్కడ అనుకున్నంత విజయం సాధించలేదు. ఈ సినిమా తర్వాత హిందీలో ‘మిషన్ మజ్ను’ అనే స్పై థ్రిల్లర్ చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. ప్రస్తుతం ఈ మూవీ గురించి ఓ లేటెస్ట్ వార్త వచ్చింది.
ఈ చిత్రాన్ని 1970 దశాబ్దం నాటి ప్రేమకథతో రూపొందిచారు. దేశభక్తి, ప్రేమ వంటి అంశాలతో తెరకెక్కించిన ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా భారత గూఢచారి ఏజెంట్ పాత్ర లో కనిపించనున్నారు. ముందు ఈ సినిమాను థియేటర్ లలో విడుదల చేయాలి అని అనుకున్నారు. అనేక వాయిదాల తర్వాత ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ చిత్రం జనవరి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను శాంతను బాగ్ఛీ దర్శకత్వం వహించగా.. రోనీ స్క్రూవాలా, అమర్ బుటాలా, గరిమా మెహతాతో కలిసి నిర్మించారు.
ఈ సినిమాను థియేటర్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీ కి ఇవ్వడంతో చర్చ మొదలైంది. ఈ మధ్యకాలంలో నార్త్ ఆడియన్స్ లో రెగ్యులర్ కంటెంట్ పట్ల ఏర్పడుతున్న వ్యతిరేకతే దీనికి కారణమని తెలుస్తోంది. నటీనటులు, ట్రైలర్ చూసి ప్రేక్షకులు థియేటర్ లకు రావడం లేదు. అందుకే ‘మిషన్ మజ్ను’ బాగున్నా బాగోకపోయినా సినిమాను థియేటర్ లో చూస్తారో లేదో అనే భయంతో నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన ఆఫర్ కు ఓకే చేశారని విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమా హిందీతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
Ek jaanbaaz agent ki ansuni kahaani.
— Netflix India (@NetflixIndia) December 13, 2022
MISSION MAJNU 🇮🇳
Only on Netflix, 20th January. pic.twitter.com/mFy3YIcDlH
Read Also: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ కు మరో షాక్, పరువు నష్టం కేసు పెట్టిన నోరా ఫతేహి
Nikhil On SPY Movie: నిఖిల్ స్పై థ్రిల్లర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్, రిలీజ్ ఎప్పుడంటే?
Sundeep Kishan: ‘విక్రమ్’ నుంచి అందుకే తప్పుకున్నా, లోకేష్ కనగరాజ్ ప్రపంచం మొదలైందే నాతో: సందీప్ కిషన్
Ileana: ఆస్పత్రి పాలైన నటి ఇలియానా - ఏం అయింది?
Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన ‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?
Pawan Kalyan - Sujeeth: పవర్ స్టార్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్, పవన్ - సుజిత్ కొత్త మూవీ షురూ
MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం
Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !
BJP Govt: మోడీ సర్కార్కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!
Kamareddy Master Plan : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ, ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని ఆదేశాలు