Janhvi - Rana Naidu: జాన్వీపై డ్రైవర్ భార్య ఆగ్రహం - ఫొటోగ్రాఫర్స్‌కు రానా స్ట్రాంగ్ వార్నింగ్
విక్టరి వెంకటేష్, రానా కలసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ ను వినూత్న రీతిలో చేస్తున్నారు మేకర్స్. తాజాగా నటి జాన్వీ కపూర్ రానా కలసి చేసిన వీడియో వైరల్ అవుతోంది.
విక్టరీ వెంకటేష్, రానా కలసి నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. దీని కోసం వెంకీ, రానా మొదటిసారి వెబ్ సిరీస్ లో నటించారు. ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ విడుదల అయింది. ఇందులో వెంకీ, రానా తండ్రీ కొడులుగా కనిపిస్తున్నారు. అంతే కాకుండా హై అండ్ యాక్షన్ గ్రిప్పింగ్ కథాంశంతో ఈ వెబ్ సిరీస్ రూపొందించినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో బోల్డ్ డైలాగ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయ్. ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈ వెబ్ సిరీస్ పై ఉత్కంఠ నెలకొంది. అయితే ట్రైలర్ తర్వాత ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ ను చాలా వెరైటీగా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ప్రమోషన్స్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా కీ రోల్ చేస్తోంది. ఇటీవలే జాన్వీతో కలసి ఓ ఇంట్రస్టింగ్ వీడియోను ప్రమోట్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా జాన్వీ తో కలసి రానా మరో వీడియో చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జాన్వీ తో డ్రైవర్ భార్య గొడవ, సెటిల్ చేసిన రానా..
‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కు సంబంధించి వినూత్న ప్రచారం చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా మరో కొత్త వీడియోతో ముందుకొచ్చారు రానా. అయితే ఇందులో జాన్వీ కపూర్ ఒక న్యూస్ పేపర్ తీసుకొచ్చి రానా తో ‘‘నువ్వు అందరి సెలబ్రెటీల సమస్యలు పరిష్కరిస్తావ్ కదా. నా చిన్న సమస్య కూడా పరిష్కరించు’’ అని అడుగుతుంది. దానికి రానా ‘‘ఏంటీ నీ సమస్య’’ అని అడిగితే.. ‘‘నేను కార్ ముందు సీటులో కూర్చుంటే.. నా పక్క సీటులో ఎవరు ఉంటే వాళ్లు నా బాయ్ ఫ్రెండ్’’ అని పేపర్ లో ఫోటోలు వేస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త చూసి మా డ్రైవర్ భార్య కోపంతో ఉంది’’ అని న్యూస్ పేపర్ లో తన ఫోటోను చూపించి చెబుతుంది. దీంతో రానా ’’ఇదేనా నీ సమస్య, దీన్ని పరిష్కరించడం చాలా ఈజీ’’ అని చెప్తూ ఓ కాస్ట్లీ కార్ లో ఆమెను ముందు సీట్ లో కూర్చొబెట్టుకొని తీసుకెళ్తాడు. తర్వాత ఫోటోగ్రాఫర్ లు వచ్చి వరుసగా ఫోటోలు తీస్తుంటే.. ఇంతలో రానా రక్తపు మరకలతో నిండి ఉన్న క్రికెట్ బ్యాట్ ను చూపిస్తూ.. ’’ఈ ఫోటో పేజ్ త్రిలో వస్తే..’’ అని అంటుండగానే ఫోటోగ్రాఫర్స్ భయంతో ‘‘ఈ వార్త పేజ్ త్రీలో వస్తే మా వార్త ఫ్రంట్ పేజీలో వస్తుంది, వద్దులే సార్. ఈ ఫోటోలు డిలీట్ చేస్తాం’’ అని అంటారు. దీంతో జాన్వీ మీకేమైనా ఇంకా వార్తలు కావాలంటే మార్చి 10న ‘రానా నాయుడు’ ను నెట్ ఫ్లిక్స్ లో చూడండి అని చెప్పడంతో వీడియో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
‘రే డోనోవర్’ వెబ్‌సీరిస్ కు రీమేక్..
ఈ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ పాపులర్ అమెరికన్ సిరీస్ 'రే డోనోవర్' కు రిమేక్. అయితే తెలుగు నేటివిటీకు తగ్గట్టు కథను మార్చి రూపొందించారు మేకర్స్. ఈ వెబ్ సీరిస్ ను క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా ఈ సిరీస్ విడుదల కానుంది. ఇక వెంకీ, రానా కలసి ఒకే స్క్రీన్ మీద కనిపించనుండటంతో ఆసక్తి నెలకొంది. ఈ వెబ్ సిరీస్ కు సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించారు. మార్చి 10 న ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.