అన్వేషించండి

ఆయన కష్టం చూడలేక నేనే చేస్తా అని అన్నాను: రమ్యకృష్ణ

సినీ నటి రమ్యకృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి, అలాగే దర్శకుడు కృష్ణవంశీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సినిమా ‘రంగమార్తాండ’. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు.  ఈ మూవీ ఉగాది సందర్భంగా విడుదల అయి సక్సెస్ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతుంది. ఈ సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత మంచి విజయాన్ని అందుకున్నారు వంశీ. ఈ మూవీలో నటించిన రమ్యకృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి, అలాగే దర్శకుడు కృష్ణవంశీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఆయన కష్టం చూసి నేనే చేస్తా అన్నాను : రమ్యకృష్ణ

‘రంగమార్తాండ’ సినిమాను మరాఠీలో వచ్చిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు కృష్ణవంశీ మార్పులు చేర్పులు చేశారు. తెలుగులో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో కనిపించారు. అయితే ప్రకాష్ రాజ్ భార్య పాత్ర కోసం రమ్యకృష్ణ కంటే ముందు వేరే యాక్టర్ కోసం ప్రయత్నించారట కృష్ణ వంశీ. ఈ విషయాన్ని రమ్యకృష్ణ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ఆ పాత్ర కోసం ఎవర్నీ తీసుకుందామా అని వంశీ చాలా మందిని వెతికారని, కానీ ఎవరూ సెట్ అవ్వలేదని అన్నారు. ఆయన కష్టం చూసి తానే చేస్తానని అన్నానని, అలా ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని చెప్పారు. 

భర్తగా కంటే దర్శకుడిగానే ఇష్టం..

‘రంగమార్తాండ’ సినిమా ఓ కొత్త ఒరవడి తీసుకొచ్చిందని అన్నారు రమ్యకృష్ణ. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటవిశ్వరూపం చూపించారని అన్నారు. ఆయనలోని నటడుని కృష్ణవంశీ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. అలాగే బ్రహ్మానందం కూడా తన రెగ్యులర్ ఫార్మాట్ పాత్రలు కాకుండా విలక్షణ నటనను కనబర్చారని అన్నారు. ఈ మూవీతో ఆయనలోని మరోనటుడు తెరపైన కనిపించారని అన్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్రకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు.

ఇక కృష్ణవంశీ దర్శకత్వం గురించి మాట్లాడుతూ.. భర్తగా కంటే దర్శకుడిగానే ఆయన్ను ఎక్కువ ఇష్టపడతానని అన్నారు. ఆయన సినిమాను తెరకెక్కించే తీరు ఎంతో బాగుంటుందని తెలిపారు. ఈ మూవీలో కూడా ఆయన మార్క్ దర్శకత్వం కనిపిస్తుందని పేర్కొన్నారు. యాక్టర్స్ ఎంతబాగా నటించినా దాన్ని స్క్రీన్ మీద చూపించేది దర్శకుడేనని, ఆ క్రెడిట్ అంతా ఆయనదేనన్నారు. అయితే షూటింగ్ సమయంలో ఆయన చాలా కఠినంగా ఉంటారని.. సీన్ సరిగ్గా రాకపోతే పదే పదే చేయిస్తారని కొంతమంది అటుంటారనీ.. నిజానికి మన నటనలో సత్తా ఉంటే అలాంటి దర్శకుల డైరెక్షన్ మజా వస్తుందని అన్నారు.

రాజమౌళి దర్శకత్వం కూడా అలాగే ఉంటుందని, వాళ్లు సీన్ వివరిస్తుంటే సన్నివేశం అంతా కళ్లముందు కనబడుతుందని అన్నారు. అంతగొప్పగా సీన్ నరేట్ చేస్తారని చెప్పుకొచ్చారు. అందుకే తనకు చాలా సంవత్సరాల తర్వాత కృష్ణవంశీతో కలసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే అవార్డుల గురించి మాట్లాడుతూ.. తాను అవార్డుల గురించి అంతగా పట్టించుకోనని అన్నారు. పాత్ర నచ్చితే చేస్తానని, తర్వాత దాని గురించి ఆలోచించనని, తన పని తాను చేసుకుంటూ పోతానని పేర్కొన్నారు రమ్యకృష్ణ. 

Also Read: వేసవిలో వినోదం - సమ్మర్‌లో సందడి చేయనున్న సినిమాలివే, మీ ఫస్ట్ ప్రయారిటీ దేనికీ?

టాప్ హెడ్ లైన్స్

Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి ఆదర్శ కుటుంబం - వెంకీ త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ఆదర్శ కుటుంబం - వెంకీ త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Godavari Serial Today October 30th: 'గోదావరి' సీరియల్: ఆకర్ష్‌ ప్రవర్తన తేడాగా ఉందే! మురళీ మీద ఫైర్ అయిన నందు! జాను కవరింగ్!
'గోదావరి' సీరియల్: ఆకర్ష్‌ ప్రవర్తన తేడాగా ఉందే! మురళీ మీద ఫైర్ అయిన నందు! జాను కవరింగ్!
Nindu Manasulu Serial Today October 30th: నిండు మనసులు: తల్లీ, చెల్లెళ్లతో కలిసిపోయిన గణ! ఇది కదా నిజమైన సంతోషం! పుల్లల మాస్టర్ రెడీ!
నిండు మనసులు: తల్లీ, చెల్లెళ్లతో కలిసిపోయిన గణ! ఇది కదా నిజమైన సంతోషం! పుల్లల మాస్టర్ రెడీ!
Gundeninda Gudigantalu Oct 30: గుడిలో బాలుపై గుణ హత్యాయత్నం..అడ్డుకుని బాగా బుద్ధి చెప్పిన కుటుంబం
గుండెనిండా గుడిగంటలు: గుడిలో బాలుపై గుణ హత్యాయత్నం..అడ్డుకుని బాగా బుద్ధి చెప్పిన కుటుంబం

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao On Mallanna Sagar: మల్లన్న సాగర్ కట్ట దగ్గరలో అక్రమ బ్లాస్టింగ్‌లు.. కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందా? - హరీష్ రావు
మల్లన్న సాగర్ కట్ట దగ్గరలో అక్రమ బ్లాస్టింగ్‌లు.. కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందా? - హరీష్ రావు
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Ram Charan : రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' స్టోరీ అది కాదు - అసలు స్టోరీ ఏంటో చెప్పిన కార్తీక్ సుబ్బరాజు
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' స్టోరీ అది కాదు - అసలు స్టోరీ ఏంటో చెప్పిన కార్తీక్ సుబ్బరాజు
Traffic E-Challans: ఈ-చలాన్లతో ఇబ్బంది పడుతున్నారా? నేషనల్‌ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు.. ఇలా చేయండి
ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా? లోక్‌ అదాలత్‌ ద్వారా జరిమానా తగ్గించుకునే ఛాన్స్‌!
AP El Nino Drought Ground Reality: ఎల్‌నినో పొలిటికల్ గేమ్ - ఆంధ్రాలో కరువు లేదంటున్న కేటీఆర్ - రేవంత్‌ను ఇరికించడానికేనా?
ఎల్‌నినో పొలిటికల్ గేమ్ - ఆంధ్రాలో కరువు లేదంటున్న కేటీఆర్ - రేవంత్‌ను ఇరికించడానికేనా?
కార్తీక మాసం 2026: శాశ్వత పుణ్యం కోసం ఈ 7 నియమాలు పాటించండి!
కార్తీక మాసం 2026: శాశ్వత పుణ్యం కోసం ఈ 7 నియమాలు పాటించండి!
Embed widget