అన్వేషించండి

RGV On Prabhas Fans: దీపావళి కాదు, మ్యాడ్ నెస్! ప్రభాస్ అభిమానులపై రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం

ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ చేసిన రచ్చ తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. తాజాగా ప్రభాస్ అభిమానుల తీరుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా, ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలను పలు థియేటర్లలో రీరిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. థియేటర్ల ముందు బాణాసంచా కాల్చి సందడి చేశారు. ప్రభాస్ బర్త్ డేను కోలాహలంగా జరుపుకున్నారు. కొన్నిచోట్ల ప్రభాస్ అభిమానులు చేసిన పిచ్చి పనులు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇదేం తిక్క పని అంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

ప.గో జిల్లాలో ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం

ప్రభాస్ బర్త్ డే సందర్భంగా  పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్‌లో ప్రభాస్ మూవీ బిల్లాను 4k లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా అభిమానులు థియేటర్ లోపల బాణాసంచా కాల్చారు. అది కాస్తా అగ్ని ప్రమాదానికి కారణం అయ్యింది. థియేటర్ లోని సీట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో ప్రేక్షకులంతా ప్రాణ భయంతో థియేటర్ బయటకు పరిగెత్తారు. థియేటర్ యాజమాన్యం, కొందరు అభిమానులు వెంటనే ఆ మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే పొగ థియేటర్ మొత్తం వ్యాపించింది.

ప్రభాస్ ఫ్యాన్స్ పై ఆర్జీవీ ఆగ్రహం

ఈ ఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రభాస్ అభిమానులపై నిప్పులు చెరిగారు. థియేటర్లో బాణాసంచా కాల్చడానికి సంబంధించిన వీడియోలను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అభిమానులు తీరుపై మండిపడ్డారు “ ఇక్కడ దీపావళి వేడుక జరగడం లేదు. ప్రభాస్ సినిమాను ప్రదర్శిస్తుండగా బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకుంటున్నారు. ఇది ప్రభాస్ అభిమానుల మ్యాడ్ నెస్ కు నిదర్శనం. ఆయన ఫ్యాన్స్ జరుపుకున్న దీపావళి పండుగ స్టైల్ ఇది” అంటూ ట్వీట్ చేశారు.  అయితే, ఈ ఘటనపై ఫ్యాన్స్ వెర్షన్ మరోలా ఉంది.  షో మధ్యలో నిలిపివేసినందుకే ఇలా చేసినట్లు వెల్లడించారు. ఏది ఏమైనా ప్రభాస్ అభిమానుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today June4th:తప్పు ఒప్పుకుని గోపాల్ గుండెలపై వాలిపోయిన సింధూ...భర్తతో కలిసి ఊరికి పయనం
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌:తప్పు ఒప్పుకుని గోపాల్ గుండెలపై వాలిపోయిన సింధూ...భర్తతో కలిసి ఊరికి పయనం
Jagadhatri Serial Today June 4th:నిషిక బండారం బయటపెట్టడానికి జగధాత్రి వేసిన ఎత్తు ఏంటి..? జేడీ వార్నింగ్‌కు వణికిపోయిన డాక్టర్
జగద్ధాత్రి సీరియల్: నిషిక బండారం బయటపెట్టడానికి జగధాత్రి వేసిన ఎత్తు ఏంటి..? జేడీ వార్నింగ్‌కు వణికిపోయిన డాక్టర్
Upasana Peddi Celebrations : మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్
మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్
Sshhh Season 3 OTT : ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్ సీజన్ 3 - సరికొత్తగా ష్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్ సీజన్ 3 - సరికొత్తగా ష్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget