అన్వేషించండి

Game Changer Release Date: ‘గేమ్ ఛేంజర్’ మరింత ఆలస్యం? వినాయక చవితికి కూడా విడుదల కానట్టేనా?

Game Changer Release: రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. షూటింగ్ మొదలైన చాలా కాలం అవుతున్నా, విడుదల ఎప్పుడు? అనే విషయంపై ఇప్పటికీ ఓ క్లారిటీ రావడం లేదు.

Game Changer Release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత చెర్రీ చేస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా, రిలీజ్ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రావడం లేదు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వారి ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.

‘గేమ్ ఛేంజర్’ విడుదల మరింత ఆలస్యం!

కొద్ది వారాల క్రితం ‘సలార్’ సినిమా చూసేందుకు వచ్చిన నిర్మాత దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు వెల్లడించారు. సెప్టెంబర్‌ 2024లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. వినాయక చవితి కానుగా విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఆ డేట్ కు విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘OG’ సినిమా సెప్టెంబర్ 27, 2024న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ‘గేమ్ ఛేంజర్’ విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ పై వారి నుంచి ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

తీవ్ర నిరాశలో చెర్రీ అభిమానులు

వాస్తవానికి ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ మొదలై చాలా కాలం అయ్యింది. దర్శకుడు శంకర్ ఈ సినిమాతో పాటు  ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ లోనూ బిజీ అయ్యారు. రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కించడంతో ‘గేమ్ ఛేంజర్’ మరింత ఆలస్యం అవుతూ వచ్చింది. ‘RRR’ విడుదల తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న’దేవర’ మూవీ తొలి భాగం ఏప్రిల్ 5న విడుదలకు రెడీ అవుతున్నా, ‘గేమ్ ఛేంజర్’ విషయంలో ఇప్పటికే ఏ క్లారిటీ రాకపోవడంపై చెర్రీ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.  

‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజు కథను అందించారు. పొలిటికల్‌, యాక్షన్‌ కథతో ‘గేమ్‌ ఛేంజర్‌’ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, సముద్రఖని, ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Read Also: అలిపిరిలో ఆగిపోయిన ధనుష్ మూవీ షూటింగ్, అనుమతులు రద్దు - అసలు ఏం జరిగింది ?

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 30:కేదార్‌ను స్టేషన్‌ బెయిల్‌పై తీసుకెళ్లిన జేడీ...ఇంట్లోకి రావడానికి వీళ్లేదని అడ్డుకున్న కమలాకర్‌,యువరాజు
జగద్ధాత్రి సీరియల్:కేదార్‌ను స్టేషన్‌ బెయిల్‌పై తీసుకెళ్లిన జేడీ...ఇంట్లోకి రావడానికి వీళ్లేదని అడ్డుకున్న కమలాకర్‌,యువరాజు
Bigg Boss Season 10 Today October 30th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అల్టిమేట్ గోట్ త్రిగుణ్.. అదిరిపోయే బెనిఫిట్! సుధీర్ సడెన్‌ ఎలిమినేట్.. ట్విస్ట్ ఇచ్చిన ముకేశ్, ఝాన్సీ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అల్టిమేట్ గోట్ త్రిగుణ్.. అదిరిపోయే బెనిఫిట్! సుధీర్ సడెన్‌ ఎలిమినేట్.. ట్విస్ట్ ఇచ్చిన ముకేశ్, ఝాన్సీ!
Brahmamudi Serial Today October 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ –  నందును ఇంటికి రావొద్దన్న చలపతి
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ –  నందును ఇంటికి రావొద్దన్న చలపతి
Aadarsha Kutumbam First Day Collection : వెంకీ ఆదర్శ కుటుంబం ర్యాంపేజ్ స్టార్ట్ - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
వెంకీ ఆదర్శ కుటుంబం ర్యాంపేజ్ స్టార్ట్ - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
Bigg Boss Season 10 Today October 30th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అల్టిమేట్ గోట్ త్రిగుణ్.. అదిరిపోయే బెనిఫిట్! సుధీర్ సడెన్‌ ఎలిమినేట్.. ట్విస్ట్ ఇచ్చిన ముకేశ్, ఝాన్సీ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అల్టిమేట్ గోట్ త్రిగుణ్.. అదిరిపోయే బెనిఫిట్! సుధీర్ సడెన్‌ ఎలిమినేట్.. ట్విస్ట్ ఇచ్చిన ముకేశ్, ఝాన్సీ!
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
Income Tax Raids: ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. 5 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు
ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. 5 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Embed widget