By: ABP Desam | Updated at : 23 Dec 2022 04:18 PM (IST)
రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన ఒక పార్టీ స్థాపించారు. ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయడానికి రెడీ అయ్యారు. భారీ రాజకీయ సభలు నిర్వహిస్తున్నారు. ఇదంతా రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లో! అసలు వివరాల్లోకి వెళితే...
సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ (shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో చిత్రీకరణ జరుగుతోంది. రాజమండ్రిలో గురువారం షూటింగ్ చేశారు. గోదావరి నది ఒడ్డున కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ రోజు విశాఖలో చిత్రీకరణ చేస్తున్నారు. సముద్ర తీరంలో షూటింగ్ చేస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో షూటింగ్ చేయడం వల్ల ఆన్ లొకేషన్ పిక్స్, వీడియోస్ లీక్ అవుతున్నాయి.
అభ్యుదయం పార్టీ...
రామ్ చరణ్ సీయం అభ్యర్థి!
రామ్ చరణ్‌ను శంకర్ భారీ, శక్తివంతమైన రాజకీయ నేతగా చూపించబోతున్నారు. అభ్యుదయం పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నటిస్తున్న సీన్లను షూటింగ్ చేస్తున్నారు. శంకర్ సినిమాల్లో రాజకీయాల ప్రస్తావన కొత్త ఏమీ కాదు. ఆయన సినిమాల్లో సామాజిక, రాజకీయ అంశాలు ఉంటాయి. ఏదో ఒక సందేశం ఇవ్వడానికి చూస్తారు. 'ఒకే ఒక్కడు'లో అర్జున్ ఒక్క రోజు ముఖ్యమంత్రిగా కనిపించారు. మరి, ఈ సినిమాలో ఏకంగా హీరోని సీయం అభ్యర్థిగా చూపిస్తున్నారు. ఈసారి ఏం చేస్తున్నారో చూడాలి.
రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ కు భారీ స్వాగతం లభించింది. ఆయన్ను చూసేందుకు గోదావరి జిల్లాల నుంచి రామ్ చరణ్, చిరంజీవి అభిమానులు భారీగా తరలివచ్చారు. గోదావరి పాయల్లో ఏర్పాటు చేసిన భారీ రామ్ చరణ్ కటౌట్లు ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. అసలు ఎవరూ ఊహించడానికి వీలు లేని విధంగా రామ్ చరణ్‌ను రాజకీయ నాయకుడిగా శంకర్ చూపిస్తున్నారనే వార్తతో ట్విట్టర్ హోరెత్తుతోంది.
శనివారంతో విశాఖలో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో కూడా షూటింగ్ ప్లాన్ చేశారు. ఒక్క రోజు షూటింగ్ చేశాక... తర్వాత కర్నూల్ వెళ్లనున్నారు. అక్కడ వచ్చే గురువారం వరకు షూటింగ్ ప్లాన్ చేశారని తెలిసింది. దాంతో ఈ నెలలో ప్లాన్ చేసిన షెడ్యూల్స్ కంప్లీట్ అవుతారు. న్యూ ఇయర్ కోసం బ్రేక్ తీసుకుని మళ్ళీ జనవరిలో షూటింగ్ చేయనున్నారు.
Also Read : '18 పేజెస్' రివ్యూ : నిఖిల్, అనుపమ నటించిన సినిమా ఎలా ఉందంటే?
ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే తండ్రి పాత్ర నత్తి నత్తిగా మాట్లాడుతుందని సమాచారం. ఆ క్యారెక్టర్‌ను శంకర్ చాలా అంటే చాలా స్పెషల్‌గా డిజైన్ చేశారట.
రామ్ చరణ్, శంకర్ సినిమాలో కియారా అడ్వాణీ ఓ కథానాయిక. మరో కథానాయికగా తెలుగమ్మాయి అంజలి నటిస్తున్నారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో చరణ్ భార్యగా కనిపించనున్నారు. శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు.
Also Read : ధమాకా రివ్యూ: 2022ని రవితేజ హిట్టుతో ముగించాడా? థియేటర్లో ధమాకా పేలిందా? తుస్సుమందా?
K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
‘ఫరాజ్’ సినిమాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ - స్టే నిరాకరణ, వివాదం ఏమిటీ?
K Viswanath Oscars : ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు విశ్వనాథ్
Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !
YS Sharmila : మళ్లీ కేసీఆర్ ను నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తారు, రైతు బంధు తప్ప అన్ని సబ్సిడీలు బంద్- వైఎస్ షర్మిల