అన్వేషించండి

Ram Charan: రామ్ చరణ్-శంకర్ మూవీకి మరో అడ్డంకి.. ‘భారతీయుడు-2’ నిర్మాతలు కోర్టుకు!

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం రెండు వివాదాలతో సతమతం అవుతోంది.

ప్రముఖ దర్శకుడు శంకర్, రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే.. భారీ అంచనాలే ఉంటాయి. అయితే, ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఈ సినిమా ఇంకా మొదలు కాకుండానే వివాదాలతో సావాసం చేస్తోంది. ‘RC 15’గా తెరకెక్కనున్న ఈ చిత్రం కథపై ఇప్పటికే వివాదం నెలకొంది. ఆ కథ తనదేనంటూ సెల్లముత్తు అనే రచయిత భారత సినీ రచయితల సంఘాన్ని ఆశ్రయించాడు. అతను మరెవ్వరో కాదు.. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దగ్గర సహాయకుడిగా పనిచేసిన వ్యకే. అయితే, దర్శకుడు శంకర్ ఈ కథను కార్తీక్ సుబ్బరాజు నుంచే తీసుకున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలో సెల్లముత్తు ఆరోపనలు నిజమేననే సందేహాలు నెలకొన్నాయి. అయితే, ఈ వివాదం ఇంకా చల్లారకుండానే.. మరొకటి రాజుకుంది. 

తెలుగులో రాజమౌళి తరహాలోనే శంకర్ కూడా ఒక సినిమాను ఏళ్ల తరబడి చిత్రీకరిస్తాడు. అది విడుదల కావడానికి కూడా చాలా సమయం పడుతుంది. భారీ చిత్రాలు కావడం, వీఎఫ్ఎక్స్ వర్క్ తదితర కారణాల వల్ల వీరి సినిమాలు చాలా ఆలస్యంగా విడుదలవుతాయి. తాజా శంకర్ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ కూడా మందకొడిగా సాగుతోంది. అది ఇంకా పూర్తి కాకుండానే శంకర్.. రామ్ చరణ్‌తో సినిమాకు అంగీకరించడంతో ‘భారతీయుడు 2’ చిత్ర నిర్మాతలకు ఇబ్బందికరంగా మారింది. ముందుగా తమ చిత్రాన్ని పూర్తి చేయాలని శంకర్ మీద ఒత్తిడి తెస్తున్నారు. చివరికి న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయించారని తెలిసింది. 

ఇన్ని వివాదాలు వెంటాడుతున్న తరుణంలో ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చేందుకు ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి వరకు రామ్ చరణ్ కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఈ సినిమా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ప్రస్తుతం చరణ్ డేట్స్ ఖాళీ ఉన్న నేపథ్యంలో వెంటనే షూటింగ్ వెంటనే మొదలు పెట్టాలని ‘RC 15’ నిర్మాతలు కూడా శంకర్ మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పుడే షూటింగ్ పూర్తి చేసుకోవాలని కంగారు పడుతున్నారు. దీంతో శంకర్ పరిస్థితి అటుఇటూ కాకుండా ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియరా అద్వానీ మరోసారి చరణ్‌తో జతకట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో అంజలీ కూడా కీలక పాత్ర పోషించనుంది. 

Also Read: పవర్ స్టార్ @ 50: బాల్యం నుంచి నేటి వరకు.. పవన్ కళ్యాణ్ అరుదైన చిత్రాలు

Also Read: పవన్ కళ్యాణ్ బర్త్‌ డే స్పెషల్.. జనంలో ఉంటాడు.. జనంలా ఉంటాడు, ఇదీ పవర్ స్టారంటే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dhurandhar 2 Trailer : ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్ - నో కన్ఫ్యూజన్... ఫుల్ క్లారిటీ
ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్ - నో కన్ఫ్యూజన్... ఫుల్ క్లారిటీ
Vijay Deverakonda Rashmika : రణబాలి కొత్త షెడ్యూల్‌కు కొత్త జంట - విజయ్ దేవరకొండ, రష్మిక కపుల్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే?
రణబాలి కొత్త షెడ్యూల్‌కు కొత్త జంట - విజయ్ దేవరకొండ, రష్మిక కపుల్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే?
Sampradayini Suppini Suddapoosani Review - 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ: శివాజీ, లయ లేటెస్ట్ సినిమా - క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ: శివాజీ, లయ లేటెస్ట్ సినిమా - క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
Priyamani : ద్రోణ సినిమా సాంగ్ - బికినీ ధరించడంపై ప్రియమణి క్లారిటీ
ద్రోణ సినిమా సాంగ్ - బికినీ ధరించడంపై ప్రియమణి క్లారిటీ

వీడియోలు

Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Rampachodavaram Agency: రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
Tamil Nadu Assembly Elections 2026 : ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Dhurandhar 2 Trailer : ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్ - నో కన్ఫ్యూజన్... ఫుల్ క్లారిటీ
ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్ - నో కన్ఫ్యూజన్... ఫుల్ క్లారిటీ
Sampradayini Suppini Suddapoosani Review - 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ: శివాజీ, లయ లేటెస్ట్ సినిమా - క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ: శివాజీ, లయ లేటెస్ట్ సినిమా - క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
TTD News: ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం చుట్టూ పచ్చదనం, రామతీర్థం గుట్టల్లో 3 వేల చెట్లు నాటేందుకు ప్రణాళిక!
ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం చుట్టూ పచ్చదనం, రామతీర్థం గుట్టల్లో 3 వేల చెట్లు నాటేందుకు ప్రణాళిక!
ఒక్క చార్జ్‌తో వందల కిలోమీటర్ల ప్రయాణం - రూ.15 లక్షల లోపే బ్రహ్మాండమైన ఎలక్ట్రిక్‌ కార్లు
పెట్రోల్‌ కోసం రూపాయి కూడా ఖర్చు కాదు - రూ.15 లక్షల లోపే బెస్ట్‌ ఎలక్ట్రిక్‌ కార్లు
Embed widget