అన్వేషించండి

Lal Salaam Trailer: మొయిద్దీన్ భాయ్‌గా ర‌జనీకాంత్‌, పవర్ ఫుల్ యాక్టింగ్‌తో అదరగొట్టిన సూపర్ స్టార్

Lal Salaam: రజనీకాంత్ అతిథి పాత్రలో ఆయన కూతురు ఐశ్వర్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘లాల్ సలామ్‘. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. మొయిద్దీన్ భాయ్ గా రజనీకాంత్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు.

Lal Salaam Trailer: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన రీసెంట్ గా నటించిన ‘జైలర్‘ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా వసూళు చేసింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘లాల్ సలామ్‘ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే, ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్రలో కాకుండా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘జైలర్‌‘ తర్వాత రజనీకాంత్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆయన ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మొయిద్దీన్ భాయ్ గా ఆకట్టుకున్న రజనీకాంత్

‘లాల్ సలామ్‘ మూవీ ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. కేవలం తమిళంలోనే ఈ ట్రైలర్ విడుదల అయ్యింది. ఇందులో రజనీకాంత్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. మొయిద్దీన్ భాయ్ గా అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో తన మార్కు నటనతో అదుర్స్ అనిపించారు. క్రికెట్ నేపథ్యంలో కొనసాగనున్న ఈ సినిమాలో మత ఘర్షణలకు ముడిపెట్టి తెరకెక్కించారు. వీటిని ఆపేందుకు మొయిద్దీన్ భాయ్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు అనేది ఈ చిత్రంలో చూపించనున్నారు.

33 ఏండ్ల తర్వాత మళ్లీ తెర మీద కనిపించబోతున్న జీవితా రాజశేఖర్

సుమారు ఏడేళ్ల తర్వాత  ఐశ్వర్య రజనీకాంత్​ ‘లాల్ సలామ్‘ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో  సీనియర్‌ నటి జీవితా రాజశేఖర్‌ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ తెర మీద కనిపించబోతోంది. ఈ నేపథ్యంలో తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనే ఈ మూవీపై ఆసక్తి కలుగుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌ ఈ మూవీలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రంలో రెహమాన్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్‌ హమీద్‌ల గాత్రాన్ని AI టెక్నాలజీ ద్వారా పునఃసృష్టించారు.  'తిమిరి ఎళుడా..' అంటూ సాగే ఈ పాట ఇప్పటికే నెట్టింట బాగా వైరల్ అవుతోంది. 

అటు 'జైలర్', 'లాల్ సలాం' తర్వాత రజనీకాంత్ మరో సినిమా చేస్తున్నారు. 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘వెట్టయాన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో కొద్ది రోజుల పాటు కొనసాగింది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. 

Read Also: అచ్చం ‘బేబీ’లా ‘ట్రూ లవర్’ - లవ్, ఎమోషన్‌తో ఆకట్టుకుంటున్న ట్రైలర్

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 16: నిషిక గొంతునులిమి చంపబోయిన యువరాజు..కోడలిని కాపాడిన వైజయంతి
జగద్ధాత్రి సీరియల్: నిషిక గొంతునులిమి చంపబోయిన యువరాజు..కోడలిని కాపాడిన వైజయంతి
Podarillu Serial Today Oct 16: కేశవ్‌ స్థలం కొనడానికి అన్నదమ్ములతోపాటు మహాలక్ష్మీ సాయం..డబ్బు కళ్లకు కనిపించేసరికి జమునకు దుర్భుద్ది
పొదరిల్లు: కేశవ్‌ స్థలం కొనడానికి అన్నదమ్ములతోపాటు మహాలక్ష్మీ సాయం..డబ్బు కళ్లకు కనిపించేసరికి జమునకు దుర్భుద్ది
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: కెప్టెన్సీ పోటీలో ఆ ఏడుగురు! అదిరిపోయే పావులు కదిపిన త్రిగుణ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: కెప్టెన్సీ పోటీలో ఆ ఏడుగురు! అదిరిపోయే పావులు కదిపిన త్రిగుణ్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్లూ ఇచ్చిన సిరి! సిరి మీద పెట్రోల్ పోసి తండ్రిని బెదిరించిన అంబిక! ఆస్తి రాయించుకుంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్లూ ఇచ్చిన సిరి! సిరి మీద పెట్రోల్ పోసి తండ్రిని బెదిరించిన అంబిక! ఆస్తి రాయించుకుంటుందా!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget