అన్వేషించండి

Rajamouli: హాలీవుడ్ ఏజెన్సీతో రాజమౌళి డీల్ - ప్లాన్ ఏంటో?

అమెరికన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఏజెన్సీ అయిన క్రియేటివ్‌ ఆర్టిస్ట్స్‌ ఏజెన్సీ (CAA)తో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారు.

దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతడు పాపులర్ అయ్యారు. సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ.. తెలుగు సినిమా స్టామినా ఏంటో రుజువు చేశారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అతడి లెవెల్ హాలీవుడ్ కి చేరింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు రాజమౌళి ఓ హాలీవుడ్ ఏజెన్సీతో డీల్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

అమెరికన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఏజెన్సీ అయిన క్రియేటివ్‌ ఆర్టిస్ట్స్‌ ఏజెన్సీ (CAA)తో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థ లాస్ ఏంజెల్స్ లో ఉంది. సినిమాలు, యాడ్స్, బ్రాండ్స్ కి మార్కెటింగ్ చేస్తుంటుంది. దర్శకులు, నటీనటులను కూడా మేనేజ్ చేస్తుంది. అలాంటి సంస్థతో రాజమౌళి డీల్ పెట్టుకోవడంతో అతడి తరువాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. 

రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుంది. ప్రస్తుతం రాజమౌళి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఏ జానర్ సినిమా రాబోతుంది? ఎటువంటి సినిమా చేస్తారు? అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా దర్శక ధీరుడు చెప్పిన మాటలు వింటే ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయం. 

మహేష్ బాబుతో తాను తీయబోయే సినిమా యాక్షన్ అడ్వెంచర్ అని రాజమౌళి చెప్పారు. ప్రస్తుతం రాజమౌళి టొరెంటోలో ఉన్నారు. అక్కడ ఫిల్మ్ ఫెస్టివల్‌కి రావాల్సిందిగా ఆహ్వానం అందడంతో వెళ్లారు. ''మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ సినిమా చేయబోతున్నా'' అని రాజమౌళి తెలిపారు. . గ్లోబ్ ట్రాటింగ్ అంటే ఏంటంటే.... మంచి యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ అని! ప్రపంచమంతా రిలేట్ అయ్యే కంటెంట్ అందులో ఉంటుందని! పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్ రిలేట్ అవ్వొచ్చు అన్నమాట.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబుతో బాలీవుడ్ ముద్దుగుమ్మ రొమాన్స్ చేయబోతోందని తెలుస్తోంది. రాజమౌళి ఫస్ట్ ఆప్షన్ అయితే దీపికా పదుకోన్. బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. ఈమెని మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు రాజమౌళి. ప్రస్తుతం దీపికా.. 'ప్రాజెక్ట్ K' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఆమెని మహేష్ సినిమా కోసం ఆన్ బోర్డ్ చేసుకోవాలనుకుంటున్నారు. రాజమౌళి సినిమా అంటే దీపికా నో చెప్పే ఛాన్స్ లేదు కాబట్టి మహేష్-దీపికా కాంబినేషన్ దాదాపు ఫైనల్ అయినట్లే. 

ఈ సినిమాను కె.ఎల్. నారాయణ ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇటు మహేష్, అటు రాజమౌళికి ఆయన ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారు. ఈ సినిమా చేయడం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నరు. ఆయన ఒక్కరే సోలోగా ప్రొడ్యూస్ చేస్తారా? లేదంటే మరొకరితో కలిసి చేస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే... రాజమౌళి సినిమా అంటే ప్రొడ్యూస్ చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు. డీవీవీ దానయ్యకు అటువంటి ప్రపోజల్స్ వచ్చినా ఓకే చేయకుండా సోలోగా ప్రొడ్యూస్ చేశారు. 

Also Read : 'కృష్ణ వ్రింద విహారి' రివ్యూ : నాగశౌర్య నయా సినిమా ఎలా ఉందంటే?

Also Read : హిందీ సినిమా 'చుప్' రివ్యూ : రివ్యూలు రాస్తే చంపేస్తారా భయ్యా?

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 10th: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget