Raj Kundra Movie Debut: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న శిల్పాశెట్టి భర్త- మూవీ స్టోరీ అదిరిందిగా!
శిల్పా శెట్టి భర్త హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు. తన జైలు జీవితమే కథాశంగా కొత్త సినిమా చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా ఆయన భార్య శిల్పాశెట్టి నటించనున్నారు.
బాలీవుడ్ లో సుమారు రెండు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన నటి శిల్పాశెట్టి, నవంబర్ 2009లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది. అప్పటికే వీరిద్దరు రాజస్థాన్ రాయల్స్(ఐపీఎల్ టీమ్)కు యజమానులుగా కొనసాగుతున్నారు. పెళ్లి తర్వాత శిల్పా నెమ్మదిగా సినిమాలకు దూరం అయ్యింది. వీరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో అరెస్ట్ అయ్యారు. కొంతకాలం పాటు జైలు జీవితం గడిపిన ఆయన, ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు. అనంతరం మీడియాకు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు.
జైలు జీవితం ఆధారంగా సినిమా తీస్తున్న రాజ్ కుంద్రా
తాజాగా ఆయనకు సంబంధించి ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజ్ కుంద్రా హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వ్యాపారవేత్తగా రాణించిన ఆయన సినిమా పరిశ్రమలోనూ రాణించాలని ప్రయత్నిస్తున్నారట. తన డెబ్యూ సినిమాకు సంబంధించిన కథ కూడా రెడీ చేసుకున్నారట. పోర్న్ వీడియోల కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో, తన జైలు అనుభవాలు ఆధారంగా ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. "ఈ సినిమా రాజ్ కుంద్రాకు పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన తర్వాత అన్ని విషయాను టచ్ చేయనుంది. ఆరోపణలకు సంబంధించిన అంశాలతో పాటు అరెస్టు, మీడియా రిపోర్టింగ్, జైలు జీవితం ఇందులో చూపించనున్నారు. అయితే, ఈ సినిమా కథ కుంద్రా, అతడి కుటుంబ సభ్యుల వెర్షన్ లో ఉండబోతోంది” అని పలు కథనాలు వెలువడుతున్నాయి. తన జైలు జీవితం గురించి ఆయన తెరపై ఏం షేర్ చేసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు రాజ్ కుంద్రా నిర్మాతగా వ్యవహరిస్తుండగా, దర్శకుడు ఎవరు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
పోర్నోగ్రఫీ కేసులో 2021లో రాజ్ కుంద్రా అరెస్ట్
పోర్న్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారన్న ఆరోపణలపై 2021లో రాజ్ కుంద్రా అరెస్టయ్యారు. పోలీసులు ఆయనను ఆర్థర్ రోడ్ జైల్లో కొంతకాలం ఉంచారు. ప్రముఖ వ్యాపారి అయిన రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో తనకు ఏ పాత్ర లేదని నిరూపించుకునే చాలా ప్రయత్నం చేశారు. నటన కోసం వచ్చే యువతులతో ఆయన పోర్న్ వీడియోలు చిత్రీకరించి, వాటి ద్వారా వ్యాపరం చేస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఆయన కోర్టుకు తెలిపారు. తాను ఎలాంటి నేరపూరిత కార్యక్రమాల్లో పాల్గొనలేదన్నారు. దర్యాప్తులో తనకు వ్యతిరేకంగా ఏ ఒక్క మహిళ కూడా సాక్ష్యం చెప్పలేదన్నారు. రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ వీడియోలను ప్రచారం చేసేందుకు ‘హాట్ షాట్స్’ అనే ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే, అదంతా అవాస్తవం అని రాజ్ కొట్టిపారేశారు. కొద్ది రోజుల జైలు జీవితం తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు.
Read Also: ‘బేబీ’ సక్సెస్ మీట్ లో షాకింగ్ సంఘటన, భయపడిన విజయ్ దేవరకొండ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial