Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?
నటుడు ఆర్ మాధవన్ నటించిన ‘3 ఇడియట్స్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినమాకు సంబంధించిన ఆడిషన్స్ వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది.
సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఆర్ మాధవన్ ఒకరు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'రెహనా హై తేరే దిల్ మే', 'రంగ్ దే బసంతి', '3 ఇడియట్స్' వంటి సినిమాలతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. అయితే ఇటీవల ఆర్ మాధవన్ గురించి ఓ ఇంట్రస్టింగ్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. మాధవన్ నటించిన ‘3 ఇడియట్స్’ సినిమా బాలీవుడ్ లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఈ సినిమాలో మాధవన్ తో పాటు అమీర్ ఖాన్, శర్మన్ జోష్ కూడా నటించారు. ఈ సినిమాలో మాధవన్ ఫర్హాన్ ఖురేషి పాత్రలో నటించారు. అయితే ఈ మూవీ లో నటిచండానికి కూడా ఆడిషన్స్ నిర్వహించారట. అందులో మాధవన్‌కు కూడా ఆడిషన్స్ చేశారు. అయితే ఇప్పటి వరకూ ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇటీవల మాధవన్ అప్పట్లో ఆడిషన్స్ ఇచ్చిన వీడియో ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
అయితే మాధవన్ ఆడిషన్స్ వీడియో క్లిప్ చూసి తెగ మురిసిపోతున్నారట ఆయన అభిమానులు. కొంత మంది అభిమానులు మాత్రం మాధవన్ లాంటి నటుడిని కూడా ఆడిషన్స్ చేయించారా అని ఆశ్చర్యపోతుంటే ఇంకొంత మంది మాత్రం ఆయన నటన చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోలో మాధవన్ సినిమాలో తాను ఫోటోగ్రఫీని కెరీర్ గా ఎంచుకోవడానికి తన తండ్రిని ఒప్పించడానికి చేప్పే డైలాగ్ సన్నివేశంలా ఉంది. ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే మాధవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. వరుసగా కామెంట్లు చేస్తూ తన అభిమాన నటుడ్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మాధవన్ సినిమా ఇండస్ట్రీకి రత్నం లాంటి నటుడని కొంతమంది అభిమానులు కామెంట్ చేస్తుంటే.. ఇంకొంత మంది ఇలాంటి టాలెంటెడ్ హీరోలకు కూడా ఆడిషన్స్ పెడతారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మాధవన్ ఆడిషన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
‘3 ఇడియట్స్’ సినిమా డిసెంబర్ 25, 2009 న విడుదల అయింది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సెస్ ను అందుకుంది. దాదాపు 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను సాధించి రికార్డు సృష్టించింది. ఈ సినిమా భారీ సక్సెస్ కావడంతో ఈ మూవీను దర్శకుడు శంకర్ రిమేక్ చేశారు. తెలుగులో ఈ మూవీను ‘స్నేహితుడు’ పేరుతో విడుదల చేశారు. విడుదల చేసిన అన్ని భాషల్లోనూ ఈ సినిమా విజయం సాధించింది. ఇక మాధవన్ రీసెంట్ సినిమాల విషయానికి వస్తే.. మాధవన్ ఇటీవలె ‘రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్’ సినిమాలో నటించారు. ఈ సినిమా భారీ విజయం సాధిచింది. ఈ సినిమా తర్వాత ‘ధోఖా రౌండ్ ది కార్నర్’ సినిమాలో కూడా నటిచారు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. అలాగే ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్ లో కూడా మాధవన్ నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో కె.కె.మీనన్, దివ్యేందు శర్మ, బాబిల్ ఖాన్ తో పాటు తదితరులు నటిస్తున్నారు.
View this post on Instagram