Madhavan Rocketry: మాధవన్ 'రాకెట్రీ' ప్రమోషన్స్ - బిగ్గెస్ట్ బిల్ బోర్ట్ పై ట్రైలర్ రిలీజ్!
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' అనే సినిమాను తెరకెక్కించారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆర్.మాధవన్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులు. కోలీవుడ్, బాలీవుడ్ లలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు మాధవన్. 'సవ్యసాచి' సినిమాతో నేరుగా తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చారాయన. ఇప్పటివరకు నటనకు మాత్రమే పరిమితమైన మాధవన్ తొలిసారి మెగాఫోన్ పట్టుకున్నారు. మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ టైటిల్ రోల్ పోషించిన సినిమా 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్'.
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. మొన్నామధ్య సినిమా ట్రైలర్ ను కూడా వదిలారు. ఇప్పుడు జూలై 1న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ దగ్గర ఉన్న నాస్డాక్ అనే బిగ్గెస్ట్ బిల్ బోర్డ్ మీద ట్రైలర్ ను టెలికాస్ట్ చేశారు.
ఈ ట్రైలర్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తోంది. నంబి నారాయణన్ తో కలిసి టైమ్ స్క్వేర్ లో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని ఇప్పటికే పలుసార్లు చెప్పారు మాధవన్. ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశామని.. అన్ని ప్రాంతాల వారిని కదిలించే విధంగా సినిమా ఉంటుందని ఇదివరకే ఆయన చెప్పారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, సూర్య ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: పెన్ను కదలడం లేదు బావా - 'సుడిగాలి' సుధీర్‌ను తలుచుకుని ఏడ్చిన 'ఆటో' రామ్ ప్రసాద్
Also Read: తిరుమలలో చెప్పులతో - క్షమాపణలు కోరిన నయన్ భర్త విఘ్నేష్, వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా?
View this post on Instagram
View this post on Instagram