By: ABP Desam | Updated at : 02 Feb 2023 12:22 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@VyjayanthiFilms/twitter
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ప్రాజెక్ట్-K’. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్నది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ, ఏప్రిల్ 2024లో విడుదలయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్ డేట్ వైరల్ అవుతోంది. ‘ప్రాజెక్ట్-K’ మూవీని నాగ్ అశ్విన్ రెండు పార్టులు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
‘ప్రాజెక్ట్-K’ మూవీ విజన్ తో పాటు ప్లాట్ పాయింట్ చాలా పెద్దదిగా ఉండబోతోందట. ఈ నేపథ్యంలో ఒక్క పార్టులో ఈ సినిమా మొత్తాన్ని చెప్పలేమని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అచ్చం ‘బాహుబలి’ మాదిరిగానే ఈ సినిమా సస్సెన్స్ ను క్రియేట్ చేసేలా తొలి పార్టును ప్లాన్ చేస్తున్నారట. అసలు కథ రెండో పార్టులో చెప్పబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమా రెండు పార్టులుగా తీసుకురావాలని దర్శక నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.
ఇక ‘ప్రాజెక్ట్-K’ సినిమాకు సంబంధించి తొలి పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం చిత్ర బృందం ‘ప్రాజెక్ట్-K’ రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ కొనసాగిస్తోంది. రెండు పార్టులను వెంట వెటంనే షూట్ చేయడంతో పాటు విడుదల కూడా రెండు పార్టుల మధ్య తక్కువ సమయం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ‘ప్రాజెక్ట్-K’ పార్ట్ 1 విడుదలైన ఏడాదికి లోపూ ‘ప్రాజెక్ట్-K’ పార్ట్ 2 విడుదల చేయాలనుకుంటున్నారట. అందుకే రెండు భాగాలను ఓకేసారి షూట్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి తొలి భాగం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వీఎఫ్‌ఎక్స్ ఆర్టిస్టులతో మెరుగులు దిద్దుతున్నారు. ప్రొడక్షన్ టీం పార్ట్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
‘ప్రాజెక్ట్-K’ సినిమాను ఏప్రిల్ 2024లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీ, ఫ్రాంచైజీ ఎలిమెంట్స్ పై టీమ్ అధికారిక ప్రకటన చేయనుంది. అయితే, ఈ సినిమాలో దీపికా పదుకొనే పాత్రకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, వెండి తెరపై గతంలో ఏ హీరోయిన్ పోషించని పాత్ర ఈ సినిమాలో దీపికా పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ప్రాజెక్ట్ K’ కంటే ముందు, ప్రభాస్ ‘ఆది పురుష్’, ‘సలార్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ‘ఆది పురుష్’ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అటు ‘కెజిఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ‘సలార్’ మూవీ చేస్తున్నాడు. మారుతీ డైరెక్షన్ లోనూ ‘రాజా డీలక్స్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
Read Also: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ప్రభాస్-హృతిక్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ?
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్
Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్
BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?
Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !