Bandla Ganesh: తండ్రి మాట వినకపోతే బన్నీలా అవుతారు - అల్లు అర్జున్‌పై బండ్ల గణేష్ సెటైర్లు
బండ్ల గణేష్ అల్లు బ్రదర్స్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తండ్రి మాట వింటే బాబీ, వినకుంటే బన్నీ అవుతారంటూ ఆయన ఫన్నీగా సెటైర్లు విసిరారు.

బండ్ల గణేష్ గురించి తెలుగు సినిమా పరిశ్రమలో పెద్దగా పరిచయం అవసరం లేదు. చిన్న నటుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆయన, ఇప్పుడు బడా నిర్మాతగా మారిపోయారు. పవన్ కల్యాణ్ లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేసే స్థాయికి చేరారు. అటు రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు. బండ్ల గణేష్ ఉన్నత స్థాయికి చేరుకున్నా, ఆయన మాటల కారణంగా చాలా సార్లు విపరీతమైన ట్రోలింగ్‌కు గురయ్యారు. పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
అల్లు బ్రదర్స్‌పై బండ్ల కామెంట్స్
తాజాగా అల్లు ఫ్యామిలీ మీద బండ్ల గణేష్ చేసిన ఫన్నీ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల అల్లు బాబీ ఓ వేడుకలో పాల్గొన్నారు. ఇదే వేడుకకు బండ్ల గణేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ బాబీని ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తండ్రి మాట వింటే బుద్దిగా చదువుకుని బాబీలా మారుతారని, తండ్రి మాట వినకుంటే బన్నీలా పాన్ ఇండియన్ స్టార్ అవుతారన్నారు. అందుకే తండ్రి మాటలు వినకూడదని చెప్పారు. “అందరికీ ఒకటే చెప్తున్న. తండ్రి మాట వినొద్దు. తండ్రిని గౌరవించి ఆయన మాట వింటే బాబీ గారిలా తయారవుతారు. తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తే బన్నీగారిలా అవుతారు. బాబీ గారిలా కావాలా? బన్నీగారిలా మారాలా? అనేది మీరే ఆలోచించుకోండి. బాబీ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుని మామూలుగా ఇలా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు చేసుకుంటూ పోయిన బన్నీ ఇండియా సూపర్ స్టార్ అయ్యారు. దయచేసి తండ్రి మాట వినొద్దు, సొంత నిర్ణయాలు తీసుకోండి. తండ్రి మాట విన్న బాబీని చూడండి, వినని బన్నీని చూడండి” అంటూ పోల్చి చెప్పారు. బండ్ల గణేష్ మాటలను అల్లు బాబీతో పాటు అక్కడున్న వాళ్లంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆయన మాటలకు పగలబడి నవ్వారు. అయితే, బన్నీ ఫ్యాన్స్ ఈ కామెంట్స్‌ను ఎలా తీసుకుంటారో చూడాలి.
View this post on Instagram
Read Also: యూవీ క్రియేషన్స్ గుడ్ న్యూస్ - తెలుగులోకి నయనతార ‘కనెక్ట్‘
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















