By: ABP Desam | Updated at : 05 Dec 2022 11:55 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@UV_Creations/twitter
సౌత్ సినిమా పరిశ్రమలో ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన హీరోయిన్ నయనతార. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఆమె పెట్టింది పేరుగా చెప్పుగా చెప్పుకోవచ్చు. అయితే, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ తో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల విషయాలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటోంది. కథ నచ్చితేనే సినిమా చేసేందుకు ఓకే చెప్తోంది. కొద్ది రోజుల కిందటే సరోగసీ ద్వారా ఇద్దరు కవలను పొందారు. అటు రౌడీ పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సొంత బ్యానర్ లో నయనతార మెయిన్ లీడ్ లో ఓ సినిమా చేస్తోంది. హార్రర్ కథాంశంతో ‘కనెక్ట్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఈ నెల 22న థియేటర్లలో విడుదల కాబోతోంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో విడుదల అవుతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు సినిమాకు సంబంధించిన టీజర్ ను షేర్ చేసింది.
.@UV_Creations is proud to present Lady Superstar #Nayanthara’s Breathtaking Horror-Thriller #Connect in Telugu.
Directed by @Ashwin_saravana , Produced by @Rowdy_Pictures @VigneshShivN
Chills down your spine from 22nd December ! 👻 🔥@AnupamPKher #Sathyaraj #VinayRai pic.twitter.com/OCj4zDSfjg — UV Creations (@UV_Creations) December 5, 2022
ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ఇప్పటికే పూర్తయ్యింది. U/A సర్టిఫికేట్ పొందింది. హార్రర్ సీన్లు సీట్ ఎడ్జ్‌లో కూర్చొబెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ ఆసక్తికర విషయం ఉంది. అదేంటంటే, మొత్తం సినిమా రన్ టైమ్ 99 నిమిషాలు. అయితే, ఇందులో బ్రేక్ ఉండదట. తొలిసారి ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా ఓ ప్రయోగం చేయబోతున్నట్లు విఘ్నేష్ శివన్ వెల్లడించారు.
అటు అశ్విన్ తో కలిసి నయనతార రెండోసారి సినిమా చేస్తోంది. 2015లో అతడితో కలిసి ‘మాయ’ అనే సినిమా చేసింది. మళ్లీ ఇప్పుడు ‘కనెక్ట్’ సినిమాతో కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాలో సత్యరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్, హనియా నఫీస్ కీ రోల్స్ చేస్తున్నారు. బాలీవుడ్ టాప్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ‘కనెక్ట్’ సినిమా ద్వారా కోలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు.
Read Also: అట్టహాసంగా హన్సిక వివాహ వేడుక, సోహెల్‌తో ఏడడుగులు
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్లో సంజయ్ దత్, హీరోయిన్గా త్రిష
Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్
Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్
Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం