అన్వేషించండి

Swapna Dutt about Jr NTR: నా పెళ్లికి కారణం ఎన్టీఆర్, ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన అశ్వినీదత్ కుమార్తె

జూనియర్ ఎన్టీఆర్ మూలంగానే తన పెళ్లి జరిగిందని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కుమార్తె స్వప్న చెప్పింది.

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడైన నందమూరి తారక రామారావు మనవడిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి.. తక్కువ కాలంలోనే టాప్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. అభినయంలోనే కాదు డ్యాన్సులు, ఫైట్స్‌, డైలాగ్స్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు జూనియర్ ఎన్టీఆర్. పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగినా.. ఎంతో ఒదిగి ఉంటాడు ఎన్టీఆర్. ఆయన వ్యక్తిత్వాన్ని సినిమా పరిశ్రమలోని అందరూ ఎంతో మెచ్చుకుంటారు. అందుకే ఆయనకు జనాల్లోనే కాదు.. సినిమా పరిశ్రమలోని వ్యక్తుల్లోనూ అభిమానులున్నారు.

ఇక ఆయన సినిమాల విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. ఎన్టీఆర్ గురించి ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్‌ బ్యానర్‌ అధినేత అశ్వినీదత్ కుమార్తె స్వప్నాదత్‌ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. తన పెళ్లి జరగడానికి కారణం ఎన్టీఆర్ అని చెప్పింది. ఆయన లేకపోతే తన పెళ్లి జరిగేది కాదని చెప్పింది. తాజాగా తను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి చాలా విషయాలను చెప్పింది. “నా పెళ్లికి కారణం జూనియర్ ఎన్టీఆర్. ప్రసాద్ వర్మతో కొంతకాలంగా ప్రేమలో ఉన్నాను. అయితే ఈ విషయాన్ని మా నాన్నకు చెప్పేంత ధైర్యం నాకు లేదు. ఎందుకంటే మా నాన్న నా ప్రేమను కచ్చితంగా ఒప్పుకోరు అనే అనుమానం ఉంది. అయితే ఈ విషయాన్ని శక్తి మూవీ షూటింగ్‌ సమయంలో ఎన్టీఆర్ తో చెప్పాను. తను వెంటనే ఇంట్లో చెప్పమని సలహా ఇచ్చారు. ఇలాంటి విషయాల్లో ఆలస్యం అస్సలు చేయకూడదని ఎన్టీఆర్ అన్నారు. నేను మీ నాన్న గారితో మాట్లాడుతానని చెప్పాడు.

‘‘సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చారు. నా ప్రేమ విషయాన్ని నాన్నతో చెప్పారు. తొలుత నాన్న అస్సలు ఒప్పుకోలేదు. పైగా చాలా సీరియస్ అయ్యారు. అయినా తారక్ చాలా సేపు ఆయనతో మాట్లాడి, ఒప్పించేందుకు ప్రయత్నించారు. చివరకు తారక్ మాటలకు నాన్న ఓకే చెప్పారు’’ అని తెలిపింది. 2010లో స్వప్న ప్రసాద్ వర్మతో జరిగింది.  తండ్రికి సంబంధించిన వైజయంత్‌ బ్యానర్ వ్యవహారాలు, బాధ్యతలను ప్రస్తుతం స్వప్నాదత్‌, ఆమె సోదరి ప్రియాంక దత్‌ చూసుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్.. తాజాగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా రేంజిలో అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఓ రేంజిలో హిట్ అయ్యింది. అన్ని భాషల్లో అద్భుతంగా వసూళ్లను రాబట్టాయి. ఎన్టీఆర్ తో పాటు ఈ సినిమాలో మెగా హీరో రాంచరణ్ నటించారు. ఎన్టీఆర్ కొమురం భీముడి పాత్రలో నటించగా.. రాంచరణ్ పోలీసు అధికారిగా నటించారు. వీరి నటనకు జనాల నుంచి ప్రశంసల జల్లు కురిసింది. ఈ సినిమాతో అన్ని భాషల్లో ఎన్టీఆర్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి

Also Read : ఎవరు ఆపుతారో చూద్దాం - విజయ్ దేవరకొండ

టాప్ హెడ్ లైన్స్

Swathi Wedding: దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 8th:కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కత్తి పట్టి శకుంతలని చంపడానికి వెళ్లిన లక్ష్మీ! విహారి ఆఫీస్ కాంట్రాక్ట్ బరిలో లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కత్తి పట్టి శకుంతలని చంపడానికి వెళ్లిన లక్ష్మీ! విహారి ఆఫీస్ కాంట్రాక్ట్ బరిలో లక్ష్మీ!
Anasuya: చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
Ravi Mohan: అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?
అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Swathi Wedding: దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
Anasuya: చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
Telangana Man Buys Bike With 10 Rupee Coins: చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
Hybrid SUV Range: 1200 కిలోమీటర్ల రేంజ్, త్వరలో లాంచ్ కానున్న 3 హైబ్రిడ్ SUVలు
1200 కిలోమీటర్ల రేంజ్, త్వరలో లాంచ్ కానున్న 3 హైబ్రిడ్ SUVలు
US Iran News: ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
Embed widget