అన్వేషించండి

Kalki 2898 AD: పురాణ ఆయుధాలే గన్స్‌లా మారితే? ‘కల్కి’ నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్

Kalki 2898 AD: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న 'కల్కి 2898 AD'కి సంబంధించి మేకర్స్ ఆసక్తికర వీడియో రిలీజ్ చేశారు. పురాణ ఆయుధాలకు లేటెస్ట్ టెక్నాలజీ తోడైతే ఎలా ఉంటుందో చూపించారు.

Kalki 2898 AD Movie Update: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కల్కి 2898 AD'. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో సుమారు రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ అశ్వినీ దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 80 శానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ప్రభాస్‌ ‘సలార్‌’ సూపర్ హిట్‌ కావడంతో సినీ ప్రియులంతా ఆయన తర్వాతి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఆసక్తికర వీడియోను రిలీజ్ చేశారు. 

పురాణ ఆయుధాలకు టేలెస్ట్ టెక్నాలజీ తోడైతే?

'కల్కి 2898 AD' సినిమాకు సంబంధించి ఇప్పటికే మేకర్స్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో ప్రభాస్  మోడ్రన్ మహావిష్ణువులా కనిపించబోతున్నట్లు నిర్మాత అశ్వినిదత్ ఇప్పటికే చెప్పారు. అటు పురాణాలను సైన్స్ తో కలిపి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. పురాణాల్లో ఎన్నో పవర్ ఫుల్ ఆయుధాలు ఉన్నాయని, వాటికి టెక్నాలజీ కలిస్తే ఎలా ఉంటుందో ఇందులో చూడవచ్చన్నారు. ఆయన చెప్పినట్లుగానే చిత్రబృందం కీలక అప్ డేట్ ఇచ్చింది.

ఈ సినిమాలో వాడే ఆయుధాలకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. పురాణాలలో ఉపయోగించిన ఆయుధాలను ఆధునిక కాలానికి సరిపడేలా తయారు చేశారు. శ్రీమహా విష్ణువు వాడే పవర్ ఫుల్ ఆయుధాలను ఆధునిక హంగులతో మార్పులు చేసినట్లు కనిపిస్తోంది. ఆయుధాల తయారీలో పెద్ద సంఖ్యలో నిపుణులు పని చేసినట్లు ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది. పెద్ద ప్రదేశంలో ఎంతో మంది కార్మికులు, టెక్నీషియన్లు కష్టపడి వీటిని రూపొందిస్తున్నారు. అంతేకాదు, వీటి తయారీ కోసం విదేశీ నిపుణులు కూడా భాగస్వామ్యం అయ్యారు. ప్రస్తుతం 'కల్కి 2898 AD' నుంచి విడుదలైన ఆయుధాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

వచ్చే ఏడాది 'కల్కి 2898 AD' విడుదల

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా 'కల్కి 2898 AD' తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. కమల్ హాసన్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, పశుపతి, దిశా పటానీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన దీని గ్లింప్స్‌ వీడియో అభిమానులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. ఇందులో వాడిన ఆయుధాలు, వీఎఫ్ఎక్స్‌ షాట్స్‌ కు మంచి స్పందన రావడం సంతోషం కలిగించిందన్నారు నాగ్ అశ్విన్. ‘కల్కి’ ట్రైలర్‌ మరో మూడు నెలల తర్వాత విడుదల చేస్తామన్నారు. త్వరలో మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.

Read Also: అసలే నెగెటివిటీ, ఇప్పుడో బూతు పాట - ఇప్పుడు చీప్‌గా అనిపించడం లేదా త్రివిక్రమ్? అప్పటి కామెంట్స్ మరిచారా?

టాప్ హెడ్ లైన్స్

Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
Illu Illalu Pillalu Serial Today August 8th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ప్లాన్ చాటుగా వినేసిన వల్లీ! గుడిలో అలా జరగకుండా అడ్డుకుంటుందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ప్లాన్ చాటుగా వినేసిన వల్లీ! గుడిలో అలా జరగకుండా అడ్డుకుంటుందా!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget