అన్వేషించండి

Prabhas Maruthi Movie: ప్రభాస్, మారుతీ మూవీ నుంచి అదిరిపోయే అప్ డేట్, ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడంటే?

Prabhas Maruthi Movie: ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు.

Prabhas Maruthi Movie Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా ‘సలార్‘ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. హాలీవుడ్ మూవీస్ కు సైతం షాక్ ఇస్తూ, గ్లోబల్ మార్కెట్ లోనూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ‘సలార్’ సక్సెస్ జోష్ లో ఉన్న ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయ్యింది. టైం వచ్చినప్పుడు మూవీ గురించి ప్రకటిస్తామని వెల్లడించిన మేకర్స్, తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

సంక్రాంతి కానుకగా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రభాస్, మారుతి మూవీ ఇప్పటికే మొదలయ్యింది. చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కానీ, ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క అప్ డేట్ కూడా రివీల్ చేయలేదు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. సంక్రాంతికి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రీసెంట్ గా డైనోసార్ గా చూసిన ప్రభాస్ ని మళ్ళీ డార్లింగ్ లుక్ లో చూడబోతున్నారని చెప్పుకొచ్చారు. ప్ర‌భాస్ లుక్‌ ను షాడోలో చూపిస్తూ మ‌ల్టీ క‌ల‌ర్ పోస్ట‌ర్‌ ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ కథాశంతో దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి లీక్ అయిన ప్రభాస్ లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

'రాజా డీలక్స్' ఊహాగానాలు నిజమేనా?

ఈ సినిమాకు సంబంధించి టైటిల్ విషయంలో ఇప్పటికే పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ప్రభాస్ తప్ప, హీరోయిన్లు, ఇతర నటీనటులు ఎవరు అనే విషయం బయటకు రాకుండా మేకర్స్  తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంక్రాంతి రోజున టైటిల్ ఫస్ట్, లుక్ తో పాటు నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తుంది. అటు మాళ‌వికా మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్ హీరోయిన్లుగా యాక్ట్  చేస్తున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా ప్ర‌భాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ‘సలార్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వారం రోజుల్లోనే రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రభాస్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. అటు నాగ్ అశ్విన్ తో కలిసి ప్రస్తుతం ‘క‌ల్కి 2989 ఏడీ’ మూవీలో నటిస్తున్నాడు ప్రభాస్.

Read Also: ఓవర్ యాక్షన్ ఉండదు, రామ్ చరణ్‌పై ఆలియా కామెంట్స్ - ఆ రోజులను తలచుకుంటూ..

టాప్ హెడ్ లైన్స్

Ramayana Review : సిల్వర్ స్క్రీన్‌పై ఓ అద్భుతం - 'రామాయణ'పై వారణాసి రాముడి రివ్యూ
సిల్వర్ స్క్రీన్‌పై ఓ అద్భుతం - 'రామాయణ'పై వారణాసి రాముడి రివ్యూ
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వన్ లాస్ట్ ఛాన్స్! వర్షిణిపై ముకేశ్ సీరియస్‌! గెలిచిందెవరు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వన్ లాస్ట్ ఛాన్స్! వర్షిణిపై ముకేశ్ సీరియస్‌! గెలిచిందెవరు?
Godavari Serial Today November 6th: 'గోదావరి' సీరియల్: జాను వదిలేసినా సూర్య వదల్దేదుగా! మురళీకి సాయం! సంజయ్‌తో రొమాన్స్‌లో మునిగిపోయిన జాను!
'గోదావరి' సీరియల్: జాను వదిలేసినా సూర్య వదల్దేదుగా! మురళీకి సాయం! సంజయ్‌తో రొమాన్స్‌లో మునిగిపోయిన జాను!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: షాకింగ్ నిజం తెలుసుకున్న పద్మాక్షి! సిరి లక్ష్మీ కూతురని.. వారసుడున్నాడని విహారికి తెలుస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: షాకింగ్ నిజం తెలుసుకున్న పద్మాక్షి! సిరి లక్ష్మీ కూతురని.. వారసుడున్నాడని విహారికి తెలుస్తుందా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Metro Combined Pass: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
Kandula Durgesh: మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Vantara: మెరుగైన వైద్యం కోసం ఏనుగు పిల్ల మాయను కేరళ నుంచి వంతారాకు ఎయిర్‌లిఫ్ట్
మెరుగైన వైద్యం కోసం ఏనుగు పిల్ల మాయను కేరళ నుంచి వంతారాకు ఎయిర్‌లిఫ్ట్
KA Paul: రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Embed widget