అన్వేషించండి

Prabhas Mania : 4 సినిమాలు, 500 కోట్లకు పైగా వసూళ్లు - టాలీవుడ్ రెబల్ స్టార్ సరికొత్త రికార్డు

‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిన ప్రభాస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఆయన నటించిన నాలుగు సినిమాలు రూ. 500 కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటాయి.

Prabhas 500 Crore Record Globally : ప్రభాస్. ఈ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగుతున్నది. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిన ఆయన.. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో మరో లెవల్ కు చేరారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ప్రభాస్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన నటించిన 4 సినిమాలు ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లతో దుమ్మురేపాయి. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు  ఏ హీరోకు సాధ్యంకాని ఫీట్ ను ఆయన చేసి చూపించారు.

రూ. 500 కోట్లు వసూలు చేసిన ప్రభాస్ చిత్రాలు

1.బాహుబలి 2

దర్శకధీరుడు తెరకెక్కించిన విజువల్ వండర్ ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’.  ఈ మూవీలో ప్రభాస్ హీరోగా అనుష్క, రానా ప్రధాన పాత్రల్లో నటించించారు. రమ్యకృష్ణ, సత్యరాజ్, సుదీప్ కీలక పాత్రలు పోషించారు. రూ. 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా  ప్రపంచ వ్యాప్తంగా రూ. 1814 కోట్ల గ్రాస్ వసూళు చేసింది. రూ. 821 కోట్ల షేర్ సాధించింది. విడుదలకు ముందే ‘బాహుబలి 2’ రూ. 350 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

2.బాహుబలి

‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు దర్శకధీరుడు రాజమౌళి. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే గతంలో ఎన్నడూ  చూడనటువంటి అద్భుత సినిమాను తెరపై ఆవిష్కరించారు. ఈ సినిమాను చూసి హాలీవుడ్ ప్రముఖులు సైతం అద్భుతం అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. రూ. 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 632 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 312 కోట్ల షేర్ సాధించింది. ఈ మూవీ విడుదలకు ముందే రూ. 118 కోట్ల బిజినెస్ చేసింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అప్పటి వరకు ఉన్న రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టింది.

3. సలార్

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ ‘సలార్’. శృతిహాసన్ హీరోయిన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో ఈ సినిమా రూపొందింది. ‘కేజీఎఫ్’ తర్వాత ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు అనుగుణంగానే వసూళ్ల పరంగానూ ఈ సినిమా సరికొత్త రికార్డులు నెలకొల్పింది. రూ. 300 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 623.5 కోట్ల గ్రాస్ సాధించింది. రూ. 336.2 కోట్ల షేర్ వసూళు చేసింది. ఈ సినిమా విడుదలకు ముందే రూ. 335 కోట్ల బిజినెస్ సాధించింది.

4.‘కల్కి 2898 ఏడీ’

ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ సృష్టించిన మరో ప్రపంచం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. హాలీవుడ్ ‘అవతార్’ రేంజిలో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల పరంగానూ రికార్డుల మోత మోగిస్తోంది. రూ. 600 బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే రూ. 380 కోట్లు సాధించింది. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 555 కోట్లు సాధించింది.   

Read Also: ‘బాడ్ న్యూస్’ ప్రమోషన్ లో ‘యానిమల్’ బ్యూటీ రియాక్షన్ - ‘నేషనల్ క్రష్’ కామెంట్స్ పై ఏం చెప్పిందో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Devi Sri Prasad: దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
Vijay Varma: తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Soniya Singh: యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు
యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget