Prabhas : పెదనాన్న పోయిన బాధలో ప్రభాస్ ఉంటే...
పెదనాన్న పోయిన బాధలో ప్రభాస్ ఉంటే... ఆయన మీద లేనిపోని పుకార్లు ప్రచారంలోకి తీసుకు వస్తున్నారని హిందీ చిత్రసీమ వర్గాలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ (Prabhas) కుటుంబం కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టవచ్చని తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా మరో సందేహం లేకుండా చెబుతారు. ఇంటి పెద్ద కృష్ణంరాజు (Krishnam Raju)ను కోల్పోయిన దుఃఖం ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యుల్లో ఉంది. ఇంకా కృష్ణంరాజు పెద్ద కర్మ కూడా కాలేదు. మరో నెల వరకు ప్రభాస్ షూటింగులకు రాకపోవచ్చని ఆయన సన్నిహితుల నుంచి అందుతోన్న సమాచారం. ఇటువంటి సమయంలో లేనిపోని పుకార్లు హిందీ సినిమా ఇండస్ట్రీలో షికార్లు చేస్తున్నాయి.
Prabhas Dating Kriti Sanon : హిందీ హీరోయిన్ కృతి సనన్‌తో ప్రభాస్ డేటింగ్‌లో ఉన్నారనేది బాలీవుడ్ టాక్. వీళ్ళిద్దరూ కలిసి 'ఆదిపురుష్' (Adipurush Movie) లో జంటగా నటించారు. ఆ సినిమా సెట్స్‌లో ప్రేమలో పడ్డారట. ఒకరిపై మరొకరికి స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయట. హిందీ చిత్రసీమలో సినిమా విడుదలకు ముందు హీరో హీరోయిన్లు డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వినిపించడం సహజమే. ఈ పుకారు కూడా అందులో భాగంగా వచ్చినదే. అయితే, బాలీవుడ్ జనాలు ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళిద్దరూ సీరియస్ రిలేషన్షిప్‌లో ఉన్నారని చెప్పడం మొదలు పెట్టారు.
'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి టైగర్ ష్రాఫ్, కృతి సనన్ వచ్చిన ఎపిసోడ్ ఇటీవల టెలికాస్ట్ అయ్యింది. ఆ ప్రోగ్రామ్‌లో ఒక సెలబ్రిటీకి ఫోన్ చేయమని కరణ్ జోహార్ అడుగుతారు. అప్పుడు ప్రభాస్‌కు కృతి సనన్ ఫోన్ చేశారు. ఫోన్ వెంటనే లిఫ్ట్ చేశారు మన బాహుబలి. రిలేషన్షిప్‌లో ఉన్నారు కాబట్టే అంత త్వరగా ఫోన్ లిఫ్ట్ చేశారని బాలీవుడ్ మీడియా కొత్త థియరీలు వినిపించడం ప్రారంభించింది.
ప్రభాస్ లవ్ లైఫ్, మీద పుకార్లు వినిపించడం ఇదేమీ కొత్త కాదు. గతంలో అనుష్క శెట్టి (Anushka Shetty) తో ఆయన ప్రేమలో ఉన్నారని వినిపించింది. ప్రభాస్ ఫ్యామిలీ, అనుష్క మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా, ఇద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో నటించడంతో పెళ్లి చేసుకుంటారనే వరకూ ఆ వార్తలు వెళ్లాయి. ఆ ప్రచారాన్ని వాళ్ళిద్దరూ ఖండించారనుకోండి.
Also Read : మనల్ని కిందకు లాగడానికి ప్రయత్నించేవాళ్ళు ఉంటారు, నెగిటివిటీని పట్టించుకోను - కృతి శెట్టి ఇంటర్వ్యూ
ఇప్పుడు ప్రభాస్ కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు ఇటువంటి వార్తలు రావడం బాధాకరమని తెలుగు ప్రేక్షకులు, సినిమా జనాలు అభిప్రాయపడుతున్నారు. ఎంత సినిమా పబ్లిసిటీ అయినప్పటికీ... ఏ సమయంలో ఎటువంటి వార్తలు ప్రచారం చేయాలో తెలియదా? అంటూ మండి పడుతున్నారు. అసలు, కృతితో ప్రభాస్ డేటింగ్ అనేది పచ్చి అబద్ధమని ఆయన సన్నిహితులు తెలిపారు.
'ఆదిపురుష్' విషయానికి వస్తే...
హిందీలో 'తానాజీ' వంటి హిట్ సినిమా తీసిన ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా 'ఆదిపురుష్' (Adipurush). సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12న ఇండియాలో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో షోలు వేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఒక్క ఇండియాలో తొలి రోజు సుమారు ఎనిమిది వేల థియేటర్లలో, రోజుకు 40 వేల షోస్ వేయవచ్చని తెలుస్తోంది.
Also Read : సమంతకు జోడీ - దుష్యంత మహారాజు - దేవ్ మోహన్ ఫస్ట్ లుక్