Rajeshwari Priya: హీరో విజయ్ నన్ను బెదిరిస్తున్నాడు, అతన్ని అరెస్ట్ చేయండి: రాజేశ్వరి ప్రియ
తమిళ స్టార్ నటుడు విజయ్ ను అరెస్ట్ చేయాలంటూ రాజకీయ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ డిమాండ్ చేశారు. ఈ మేరకు చెన్నై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే..
Rajeshwari Priya: స్టార్ హీరోల సనిమాలు విడుదల అవుతున్నాయి అంటే ఏదొక వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి. కొంత మంది సినిమాలో సన్నివేశాలు తొలగించాలనో లేదా సినిమాను బ్యాన్ చేయాలనో నిరసలను చేస్తారు ఇంకొంత మంది సినిమాకు వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కుతారు. తాజాగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘లియో’ సినిమాకు కూడా ఇలాంటి చిక్కులే ఎదురవుతున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో మత్తు పదార్థాల వినియోగం, అలాగే రౌడీయిజాన్ని ప్రోత్సహించేలా సమాజాన్ని పక్కదోవ పట్టించేలా ఉన్నాయంటూ దీన్ని సవాల్ చేస్తూ కొంత మంది మూవీను బ్యాన్ చేయాలని కోర్టులో పిటిషన్లు కూడా వేశారు. అలాంటి వారిలో తమిళ ఆల్ పీపుల్స్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ కూడా ఉన్నారు. తాజాగా ఆమె తమిళ నటుడు విజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయ్ బెదిరిస్తున్నాడు, అతన్ని అరెస్ట్ చేయండి: రాజేశ్వరి ప్రియ
రాజేశ్వరి ప్రియ ‘లియో’ సినిమాపై వేసిన పిటిషన్ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచీ ఆమె విజయ్ పై ఆరోపణలు చేస్తూ వచ్చారు. తాజాగా ఆమె చెన్నై లోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో విజయ్ అభిమానులు తనను టార్గెట్ చేశారని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విజయ్ కూడా తనను బెదిరించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపింది. ఒక మహిళను అసభ్యకరంగా మాట్లాడేలా తన అభిమానుల్ని ప్రేరేపించిన విజయ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే సాధారణంగా సినిమాల్లో చాలా మంది సిగిరెట్లు తాగుతూ కనిపిస్తారు మరి విజయ్ ఒక్కరిపైనే ఎందుకు అని ప్రశ్నించగా గతంలో రజనీకాంత్ పై కూడా ఇలాగే కేసు వేశామని చెప్పుకొచ్చారు రాజేశ్వరి ప్రియ.
వివాదం అక్కడ నుంచే మొదలు..
తమిళ స్టార్ నటుడు విజయ్ పుట్టనరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘లియో’ సినిమా నుంచి ‘నా రెడీ’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకు విపరీతమైన స్పందన వచ్చింది. అయితే ఈ పాటలో మత్తు పదార్థాల వినియోగం, రౌడీయిజాన్ని ప్రోత్సహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, దీని వల్ల సమాజం పక్కదోవ పట్టే అవకాశాలు ఉన్నాయంటూ కొంత మంది కోర్టులో పిటిషన్ లు వేశారు. అలా పిటిషన్లు వేసిన వారిలో తమిళ రాజకీయ నాయకురాలు రాజేశ్వరి ప్రియ కూడా ఒకరు. అయితే ఈ వ్యవహారం బయటకు వచ్చిన దగ్గర నుంచీ రాజేశ్వరి విజయ్ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన అభిమానులు తనను సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని, వాళ్లని ప్రేరేపించిన విజయ్ ను అరెస్ట్ చేయాలని డిజీపీ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మరి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు విజయ్ ను అరెస్ట్ చేస్తారా లేదా, అసలు విజయ్ దీనిపై స్పందిస్తారా లేదా అనేదే ప్రశ్న. ఈ వివాదం ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
Also Read: ‘గుంటూరు కారం’ కొత్త షెడ్యూల్ ఖరారు - త్రివిక్రమ్ ఫేవరేట్ ప్లేస్‌లో షూటింగ్ షురూ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial