BRO Movie: అదరగొట్టిన తమన్ - థీమ్ ఆఫ్ ‘బ్రో’ లిరికల్ వీడియో సాంగ్ కు విశేష స్పందన
Bro Pre Release Event Live : పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్. ‘బ్రో’ మూవీ నుంచి థీమ్ ఆఫ్ బ్రో లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ కు నెట్టింట విపరీతమైన స్పందన వస్తోంది.

BRO Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో’. ఈ మూవీకు సముద్రఖని దర్శకత్వం వహించారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్ గా ఈ మూవీను తెరకెక్కించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల మందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు, పాటలు ఆకట్టుకోగా తాజాగా మూవీ నుంచి థీమ్ ఆఫ్ బ్రో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. పవన్ పాత్రను ప్రధానంగా చేసుకుని ఈ థీమ్ సాంగ్ రూపొందించారు. కాలం నేపథ్యంలో నడిచే కాన్సెప్ట్ కి తగినట్టుగా, పవన్ పాత్రను హైలైట్ చేస్తూ ఈ పాట కొనసాగింది. పాటలో మ్యూజిక్ కూడా బాగుండటంతో మూవీపై పాజిటివ్ హైప్ క్రియేట్ అవుతోంది.
థీమ్ ఆఫ్ బ్రో సాంగ్ తో ఆకట్టుకున్న తమన్..
‘బ్రో’ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి విడుదల చేసిన పాటలు అంతగా ఆకట్టుకునేలా లేకపోవడంతో మూవీ సంగీత దర్శకుడు తమన్ పై కొంత విమర్శలు వచ్చాయి. అయితే తనపై వచ్చే విమర్శలను అంతగా పట్టించుకోకుండా సినిమాపై దృష్టి పెట్టాడు తమన్. అయితే ఇప్పుడు థీమ్ ఆఫ్ బ్రో పాటతో తనపై వస్తోన్న విమర్శలకు తమన్ చెక్ పెట్టాడనే తెలుస్తోంది. ఈ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కళ్యాణ్ చక్రవర్తి అందించిన సాహిత్యానికి తనదైన శైలిలో మ్యూజిక్ అందించి పాటను అద్భుతంగా తీర్చిదిద్దారు. మూవీలో ఈ పాటకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పాటను చూస్తుంటే తెలుస్తోంది. ఈ పాట విన్న పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జులై 25 న ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇక ‘బ్రో’ మూవీ రిలీజ్ దగ్గర పడుతోన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడప్ చేశారు మేకర్స్. అందులో భాగంగానే ఈ నెల 25 న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ‘బ్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు సిద్దం చేశారు. ఈ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా చేయాలని చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని సమాచారం. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడిగా కేతిక శర్మ నటిస్తుండగా ప్రియా ప్రకాష్ వారియర్ తేజ్ కి చెల్లెలి పాత్రలో కనిపించబోతుందట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మూవీ జులై 28 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమాని లిమిటెడ్ బడ్జెట్ లోనే పూర్తి చేయడంతో టికెట్ రేట్ల విషయంలో మార్పులేమీ ఉండవని నిర్మాత ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అటు పవన్ కళ్యాణ్ కు ఇటు సాయి ధరమ్ తేజ్ కు ఎలాంటి హిట్ నున అందిస్తుందో చూడాలి.
Also Read: ఆ విషయంలో ‘పుష్ప 2’ తర్వాత ‘కంగువ’నే ఇండియాలో టాప్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















