అన్వేషించండి

Kanguva: ఆ విషయంలో ‘పుష్ప 2’ తర్వాత ‘కంగువ’నే ఇండియాలో టాప్!

హీరో సూర్య నటిస్తోన్న సినిమా ‘కంగువ’. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదల అయింది. అయితే ఈ మూవీ తాజాగా ఓ రికార్డును సాధించిందట. ఆ విషయాన్ని మూవీ మేకర్స్ స్వయంగా ప్రకటించారు.

Kanguva: స్టార్ హీరో సూర్య చివరిగా ‘విక్రమ్’ సినిమా క్లైమాక్స్ లో కనిపించారు. తాజాగా ఆయన ‘కంగువ’ అనే భారీ పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హీరో సూర్య యుద్ద వీరుడుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోగా ఇటీవల విడుదల అయిన గ్లింప్స్ వీడియో మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ వీడియో మరో అరుదైన రికార్డును సృష్టించింది. ఈ సినిమా గ్లింప్స్ వీడియోను సూర్య పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ వీడియో విడుదల అయిన 24 గంట్లో రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాదించుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

‘పుష్ప 2’ తర్వాత ‘కంగువ’ సినిమానే

ఇప్పటి వరకూ ఇండియాలో విడుదల అయిన టీజర్లలో మొదటి 24 గంటల్లో 22 మిలియన్లు పైగా వ్యూస్ సాధించిన సినిమాల్లో మొదటి సినిమాగా ‘పుష్ఫ 2’ టీజర్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు తాజాగా హీరో సూర్య నటించిన ‘కంగువ’ సినిమా టీజర్ వీడియో విడుదల అయిన 24 గంట్లో 22 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల్లో రెండో సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఇప్పటికీ ఈ సినిమా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇప్పటికీ మిలియన్స్ వ్యూస్ తో దూసుకెళ్తోంది ‘కంగువ’. ఇది చూసిన సూర్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీజర్ లోనే ఇలా ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఊహించుకుంటూ టీజర్ ను షేర్ చేస్తున్నారట ఫ్యాన్స్. 

ఇక గ్లింప్స్ వీడియోలో సూర్య నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. టీజర్ లో విజువల్స్, మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉన్నాయని టాక్. ఇక ఈ సినిమా పిరియాడికల్ తో పాటు ప్రస్తుత కాలంలో కూడా జరుగుతున్నట్టు చూపిస్తారని అంటున్నారు. ఇందులో సూర్య అరణ్యయోధుడిలా కనిపిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సూర్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మూవీ ఇదే. మొత్తం పది భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారట మేకర్స్. ఇక ఈ సినిమాలో దిశా పటాని, DOP నటరాజ్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, ఆనందరాజ్, రవి రాఘవేంద్ర, KS రవికుమార్, BS అవినాష్, కోవై సరళ కూడా కనిపించనున్నారు.

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న మూవీ టీమ్ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌తో మిగిలిన భాగాలను చిత్రీకరించడానికి వచ్చే నెలలో బ్యాంకాక్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అలాగే ఈ సినిమాను 3డి లో విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాదే మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Studio Green (@studiogreen_official)

Also Read: ‘కల్కి 2898 ఏడీ’లో నటిస్తున్నానంటే ప్రభాస్ నమ్మలేదు: కమల్ హాసన్ 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today July 27th: కార్తీకదీపం 2 సీరియల్: దీప దశరథ్ కూతురని శ్రీధర్‌కి తెలిసిపోయిందా! సూరజ్ చేతిలో అదిరిపోయే స్వీట్ మెమోరీస్!
కార్తీకదీపం 2 సీరియల్: దీప దశరథ్ కూతురని శ్రీధర్‌కి తెలిసిపోయిందా! సూరజ్ చేతిలో అదిరిపోయే స్వీట్ మెమోరీస్!
Nuvvu leka Neanu Lenu Serial Today July 27th:విక్కీని బ్రతిమాలించుకున్న రాధ....చిట్టి దగ్గర దొరికిపోకుండా విక్కీ నానా కష్టాలు
నువ్వులేక నేను లేను: విక్కీని బ్రతిమాలించుకున్న రాధ....చిట్టి దగ్గర దొరికిపోకుండా విక్కీ నానా కష్టాలు
Podarillu Serial Today July 27th: మాధవ్‌ కుటుంబంపై తప్పుడు కేసు పెట్టించే ప్రయత్నం చేసిన వరాలు...తల్లికి బుద్ధి చెప్పిన శైలు
పొదరిల్లు: మాధవ్‌ కుటుంబంపై తప్పుడు కేసు పెట్టించే ప్రయత్నం చేసిన వరాలు...తల్లికి బుద్ధి చెప్పిన శైలు
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్... ఈ 6 సినిమాలు డోంట్ మిస్ - ఏయే తేదీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అంటే?
ఈ వారం ఓటీటీ మూవీస్... ఈ 6 సినిమాలు డోంట్ మిస్ - ఏయే తేదీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget