అన్వేషించండి

Partner Trailer: రాత్రికి రాత్రే హన్సికలా మారిపోయిన యోగిబాబు - నవ్వులు పూయిస్తున్న ఆది పినిశెట్టి ‘పార్టనర్’ ట్రైలర్

ఆది పినిశెట్టి, హన్సిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘పార్ట్ నర్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. సైంటిఫిక్‌ కామెడీగా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంచుకుని నటించడంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి. హీరో, విలన్ మాత్రమే కాదు, క్యారెక్టర్ ఏది ఇచ్చినా అందులో లీనమై నటిస్తాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఆయన అద్భుత చిత్రాల్లో నటించాడు. అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తమిళంలో ‘ఈరమ్’, ‘అరవాన్’, ‘యూటర్న్‌’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తెలుగులో ‘సరైనోడు’ సినిమాలో విలన్ గా, ‘రంగస్థలం’ సినిమాలో హీరో అన్న కుమార్ బాబుగా నటించి మెప్పించారు. ఆది నటనలతోని డిఫరెంట్ యాంగిల్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అటు విలన్ పాత్రలు, ఇటు హీరో పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆది పినిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘పార్టనర్’. మనోజ్ దామోదర్ దర్శకత్వంలో ఆర్ ఎఫ్ సి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. హన్సిక మోత్వాని, పల్లక్‌ లల్వాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. సైంటిఫిక్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. ‘మరకతమణి’ లాంటి డిఫరెంట్‌ మూవీ తర్వాత మరోసారి డిఫరెంట్‌ కామెడీ చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు దర్శకుడు మనోజ్ దామోదర్.

ఆకట్టుకుంటున్న ‘పార్టనర్’ ట్రైలర్

‘పార్టనర్’ చిత్రం త్వరలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పని చేసే యోగిబాబు, తన మిత్రుడు ఆదిని కూడా జాబ్ ఇప్పిస్తానని చెప్పి పట్టణానికి తీసుకెళ్తాడు. అక్కడ ఓ ల్యాబ్ లో ఓ ఫార్ములా దొంగతనం చేస్తే రూ.20 లక్షలు ఇస్తామని ఓ పార్టీ ఆఫర్ ఇస్తుంది. ఆ ఫార్ములా కోసం ల్యాబ్ కు వెళ్లిన యోగిబాబు, ల్యాబ్ లోని పరిశోధకుడితో గొడవపడతారు. అప్పుడు యోగిబాబుకు శరీరంలోకి ఓ మిషన్ ఇంజెక్షన్ వేస్తుంది. ఇంటికి వచ్చి పడుకున్నాక యోగిబాబు అమ్మాయి హన్సికగా మారిపోతాడు. ఆ తర్వాత ఆది ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఆయన గర్ల్ ఫ్రెండ్ పల్లక్‌ లల్వాని హన్సికను చూసి ఎలా ఫీలవుతుంది? అనే కొత్త కాన్సెప్ట్ లో రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

కామెడీ, సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా ‘పార్టనర్’ 

ఇక ‘పార్టనర్’ సినిమా గురించి దర్శకుడు మనోజ్ దామోదర్ కీలక విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చెప్పారు. “ ఇది పూర్తిగా వినోదభరితంగా సాగే కథా చిత్రం. సేమ్ టైమ్ సైన్స్‌ ఫిక్షన్‌తో కూడిన ఫాంటసీ పార్టు కూడా చిత్రంలో ఉంటుంది. ఈ పార్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక హన్సిక పాత్రకు ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అబ్బాయిగా ఆమె తన హావభావాలను అద్భుతంగా పలికిస్తుంది. అంతేకాదు, నటుడు ఆది సినీ కెరీర్‌లోనే ముఖ్యమైన చిత్రంగా ‘పార్టనర్‌’ నిలువబోతోంది” అని వివరించారు. ఈ మూవీని తెలుగులోకి కూడా అనువాదం చేయనున్నట్లు సమాచారం.

Read Also: అనూ ఇమ్మాన్యుయేల్‌‌కు, రెబా జాన్‌ ఏమవుతుంది? ‘సామాజవరగమన‘ బ్యూటీ క్లారిటీ

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 4th:విక్కీకి తొలిముద్దు పెట్టిన రాధ...విక్కీ మనసులో చోటు కోసం భార్యగా ప్రయత్నాలు
నువ్వులేక నేను లేను: విక్కీకి తొలిముద్దు పెట్టిన రాధ...విక్కీ మనసులో చోటు కోసం భార్యగా ప్రయత్నాలు
Podarillu Serial Today August 4th:మాధవ్‌కు పెళ్లిచూపులు...ఆడపెళ్లివారి అభ్యంతరాలు ఏంటి..?
పొదరిల్లు: మాధవ్‌కు పెళ్లిచూపులు...ఆడపెళ్లివారి అభ్యంతరాలు ఏంటి..?

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
Embed widget