అన్వేషించండి

Reba Monica John: అనూ ఇమ్మాన్యుయేల్‌‌కు, రెబా జాన్‌ ఏమవుతుంది? ‘సామాజవరగమన‘ బ్యూటీ క్లారిటీ

‘సామజవరగమన‘ చిత్రంతో తెలుగులోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది తమిళ బ్యూటీ రెబా మోనికా జాన్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, ఇమ్మాన్యుయేల్‌ తో ఉన్న సంబంధంపై క్లారిటీ ఇచ్చింది.

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ‘బిగిల్‘ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నది మలయాళీ బ్యూటీ రెబా మోనికా జాన్. తాజాగా మంచి హిట్‌ మూవీతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కిన ‘సామజవరగమన‘తో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రెబా లుక్స్, పెర్ఫార్మెన్స్ పట్ల అన్ని వర్గాల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఆమె చేసిన తొలి తెలుగు సినిమా మంచి హిట్ సాధించడంతో టాలీవుడ్‌లో మరింత బిజీ అయ్యేలా కనిపిస్తోంది.  

అనుతో నాకు ఎలాంటి సంబంధం లేదు- రెబా  

ఇక తాజాగా ‘సామజవరగమన’ సినిమా ప్రమోషన్ లో భాగంగా రెబా, ఎంతో కాలంగా వినిపిస్తున్న ఓ రూమర్ పై క్లారిటీ ఇచ్చింది. మలయాళ నటి అను ఇమ్మాన్యుయేల్‌ తనకు కజిన్ సిస్టర్ అవుతుందని ఊహాగానాలు వినిపించాయి.  అయితే, అను ఇమ్మాన్యుయేల్‌ తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది రెబా. వికీపీడియా కూడా తమను చాలా కాలంగా కజిన్స్‌ గా చూపుతోందని స్పష్టం చేసింది. “నేను, అను ఇమ్మాన్యుయేల్ 2016 సంవత్సరంలో మలయాళ చిత్ర పరిశ్రమలో ఒకే సమయంలో నటించాం. అప్పుడే మేమిద్దరం కజిన్ సిస్టర్స్ అని ఒక వ్యక్తి రూమర్ క్రియేట్ చేశాడు. అయితే, నాకు, అనుకు ఎక్కడా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను” అని రెబా తెలిపింది. రెబా జాన్‌కు సంబంధించిన వీకీపీడియాలో అనూ ఆమె కజిన్ అని ఉండటం వల్లే ఈ రూమర్‌ క్రియేట్ అయ్యింది.

2016లో మలయాళీ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ

ఇక 2016లో వచ్చిన ‘జాకోబింటే స్వర్గరాజ్యం’ అనే మలయాళ సినిమాతో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది రెబా మోనికా. తమిళ్, మళయాల సినిమాల్లో ఎక్కువగా నటించింది. తాజాగా ‘సామజవరగమన’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ఇందులో ప్రధాన పాత్ర పోషించారు.  రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, 'వెన్నెల' కిశోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు నటించారు.  హాస్య మూవీస్ బ్యానర్‌ పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరించారు.

‘సామజవరగమన’ ఓటీటీ పార్ట్ నర్ గా ‘ఆహా’

ఈ మధ్య కాలంలో సినిమా విడుదలకు ముందే ప్రీమియర్ షోలు వేయడం ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘సామజవరగమన’ సినిమాకు కూడా విడుదలకు మూడు రోజుల ముందే ప్రీమియర్ షో లను వేశారు. తెలుగు మీడియా కోసం హైదరాబాద్ లో ఏఎంబీ సినిమాస్ లో మూవీను స్క్రీనింగ్ చేశారు. అయితే, ఈ మూవీకు ఓటీటీ పార్ట్ నర్ గా ఆహా ను అఫీషియల్ గా ప్రకటించారట. దీంతో ఈ మూవీ ఆహా లోనే స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు. ఆయన గతంలో నటించిన ‘అల్లూరి’ సినిమా కూడా ఆహాలోనే స్ట్రీమింగ్ అయ్యింది.    

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Reba Monica John (@reba_john)

Read Also: పవర్ స్టార్ ‘తొలి ప్రేమ’ చూసి కారు కీస్ టీవీ స్క్రీన్‌పై విసిరిన అమితాబ్, బిగ్‌బీ ఎందుకంత ఇరిటేట్ అయ్యారు?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Ichi Padeddam Song Lyrics: 'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Mrunal Thakur: లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget