అన్వేషించండి
Advertisement
Dhahanam Official Trailer Telugu: అసలైన వేట ఎలా ఉంటుందో చూపిస్తా! - ఇది రామ్ గోపాల్ వర్మ 'దహనం'
Ram Gopal Varma: పగ, ప్రతీకారం నేపథ్యంలో కథలు తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ప్రత్యేక శైలి. ఆయన నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న 'దహనం' వెబ్ సిరీస్ ఆ కోవలోకి వస్తుంది.
పగ, ప్రతీకారం నేపథ్యంలో కథల్ని తెరకెక్కించడంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మది ప్రత్యేక శైలి. ఉదాహరణకు... 'రక్త చరిత్ర', 'రౌడీ' వంటి సినిమాలను గతంలో ఆయన తీశారు. మావోయిస్టు నేపథ్యానికి పగ, ప్రతీకారం జోడించి 'దహనం' (Ram Gopal Varma's Dahanam) తీశారు. ఇదొక వెబ్ సిరీస్. దీనికి రామ్ గోపాల్ వర్మ షో రన్నర్. ఆయన శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఈ నెల 14న విడుదల కానుంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
'దహనం' ట్రైలర్ (Dhahanam Trailer) చూస్తే... తండ్రి మరణానికి కారణమైన వ్యక్తులను చంపి పగ తీర్చుకోవాలని తపిస్తున్న ఓ కుమారుడి కథ అనే సంగతి తెలుస్తోంది. కమ్యూనిస్ట్ నేత శ్రీరాములును ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? శ్రీరాములు మరణంతో ఆయన పెద్ద కుమారుడు, నక్సలైట్ అయిన హరి ప్రతీకారంతో ఏం చేశారు? అనేది కథగా తెలుస్తోంది. ఇందులో 'అసలైన వేట ఎలా ఉంటుందో నేను వాడికి చూపిస్తా', 'ఒక్కొక్కడిని చంపుతుంటే మిగిలిన వాళ్ళు భయంతో చచ్చిపోయావాల!', ' నాయనా చావుకు కారణమైన అందర్నీ చంపనిదే మాములు మనిషిని కాలేను' వంటి డైలాగులు ఉన్నాయి. 'దహన దహన దహనం' అంటూ వర్మ పాడిన గీతం నేపథ్యంలో వినిపించడం ప్రత్యేక ఆకర్షణ.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ "నా తొలి వెబ్ సిరీస్ ఇది. ఇందులో ప్రతీకారం, దాని పర్యవసానాలను చూపించాం. ఇది క్రైమ్ థ్రిల్లర్ కాదు. కానీ, థ్రిల్లింగ్ క్రైమ్స్‌తో కూడినది. ప్రేక్షకుల స్పందన తెలుసుకోవడానికి మేం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం" అని అన్నారు.
'దహనం' వెబ్ సిరీస్ (Dhahanam Web Series) లో ఇషా కొప్పికర్ (Isha Koppikar), అభిషేక్ దుహన్, నైనా గంగూలీ (Naina Ganguly), అశ్వత్ కాంత్ శర్మ, అభిలాష్ చౌదరి, పార్వతి అరుణ్, సయాజీ షిండే, ప్రదీప్ రావత్ ప్రధాన తారాగణం. తెలుగులో తెరకెక్కించిన ఈ సిరీస్‌ను హిందీ, తమిళంలో అనువదిస్తున్నారు. మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉంటాయి. అన్నిటినీ ఈ నెల 14న విడుదల (Dhahanam Release On April 14th) చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఎంఎక్స్ ప్లేయర్‌లో 'దహనం' వెబ్ సిరీస్‌ను ఫ్రీగా చూడొచ్చు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion