LSD Trailer: LSD ట్రైలర్ - ఆ ఓటీటీలోకి వచ్చేస్తున్న అడల్ట్ సీరిస్ - దిల్ రాజు డైలాగ్‌ను ఇలా వాడేశారు!
LSD Trailer: ఓటీటీ వేదికగా మరో మరో సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకులను అలరించబోతోంది. ‘LSD’ పేరుతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2న రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది.

LSD Trailer: రోజు రోజుకు ఓటీటీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను మరింత అలరించే ప్రయత్నం చేస్తున్నాయి డిజిటల్ ఫ్లాట్ ఫారమ్స్. సినిమాల కంటే వెబ్ సిరీస్ లకు బాగా పాపులర్ అవుతుండటంతో వాటినే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. డిఫరెంట్ కథాంశాలతో ఆద్యంతం ఆకట్టుకునేలా వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నాయి. ఓటీటీలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో స్టార్ యాక్టర్లు సైతం డిజిటల్ వేదికలపైకి అడుగు పెడుతున్నారు. వెబ్ సిరీస్ లలో నటిస్తూ అభిమానులకు ఆకట్టుకుంటున్నారు.
విడుదలకు రెడీ అవుతున్న ‘LSD’ వెబ్ సిరీస్
గత కొంత కాలంగా థ్రిల్లింగ్, సస్పెన్స్ కథాంశాలతో వస్తున్న వెబ్ సిరీస్ లు ఓటీటీలలో పెద్ద సంఖ్యలో విడుదల అవుతున్నాయి. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతోంది. ‘LSD’ పేరుతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఈ సీరీస్‌కు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ప్రాచీ టకర్, నేహా దేశ్‌పాండే, ప్రభాకర్ , కునల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. MX ప్లేయర్ లో ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.
A new age of thrilling webseries #LSD trailer out now. 🌶️🌶️🌶️🌶️
— Teju PRO (@Teju_PRO) February 1, 2024
🎧https://t.co/6GhATT3Kqr
Streaming from feb 2nd in #MxPlayer@shivakumarkona@pravinmanimusic @anilmodugafilms@NehaDeshpande00 @ParkyPrabhakar @Thekunalkaushik @i_Prachi_Thaker @bandarioffcl @ramya_pawar pic.twitter.com/8H1T16r6dc
ఆకట్టుకుంటున్న ‘LSD’ ట్రైలర్
ఇప్పటికే ‘LSD’ సిరీస్ కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా అలరిస్తోంది. ట్రైలర్ మొదట్లో బోల్డ్ సీన్స్ చూపించారు. తర్వాత కామెడీ అంశాలను జోడించారు. గతంలో ‘వారిసు’ సినిమా ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడిన, డ్యాన్స్ వేనుమా డ్యాన్స్ ఇరుక్కు, ఫైట్స్ వేనుమా ఫైట్స్ ఇరుక్కు, అనే డైలాగ్ ఈ సిరీస్ లో ఓ రేంజిలో వాడుకున్నారు. మూడు జంటల మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలు ఇందులో చూపించారు. ఫారెస్ట్ ట్రిప్ లో వారికి ఎదురైన అనుభవాలను పరిచయం చేశారు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ అందరిలోనూ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ పై ట్రైలర్ భారీగా అంచనాలు పెంచుతోంది. ఇక ఈ వెబ్ సిరీస్ కు ప్రవీణ్ మణి, శశాంక్ తిరుపతి అదరిపోమే మ్యూజిక్ అందిస్తున్నారు.
Read Also: ప్రతీ విషయంలో తన అభిప్రాయం నాకు అవసరం - విజయ్ గురించి రష్మిక ఆసక్తికర కామెంట్స్
Before You Go
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















