అన్వేషించండి

HanuMan OTT Release: హిందీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన ‘హనుమాన్' - మరి తెలుగులో?

HanuMan OTT Release: ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. కానీ ఓటీటీ రిలీజ్‌కు మాత్రం లైన్ క్లియర్ అవ్వడం లేదు.

HanuMan OTT Release Date: ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’.. థియేటర్లలో ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా ఈరోజుల్లో థియేటర్లలో ఎంత బ్లాక్‌బస్టర్ అందుకున్న సినిమా అయినా.. నెలరోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తోంది. కానీ ‘హనుమాన్’ మాత్రం థియేటర్లలో విడుదలయ్యి దాదాపు రెండు నెలలు కావస్తోంది. అయినా ఇంకా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం కాలేదు. మార్చి 8న జీ5లో ‘హనుమాన్’ వచ్చేస్తుందని వార్తలు వినిపించాయి. దీంతో ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూశారు. జీ5లో ఈ సినిమా కనిపించకపోవడంతో ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. వాటికి జీ5 స్పందించింది.

ఓటీటీలో కనిపించలేదు..

జనవరి 12న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలయ్యింది ‘హనుమాన్’. చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాను విజువల్ వండర్ అంటూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చి.. మళ్లీ మళ్లీ దీనిని చూడడానికి థియేటర్లకు వెళ్లారు. ఇక థియేటర్లలో చూడడం కుదరని ప్రేక్షకులు.. ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటికే దీని ఓటీటీ రిలీజ్‌పై ఓ క్లారిటీ లేదు. ముందుగా మార్చి 2న ‘హనుమాన్’ జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వచ్చాయి. అంతలోనే పోస్ట్‌పోన్ అయ్యిందని మార్చి 8న కచ్చితంగా స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ప్రేక్షకులంతా మార్చి 8న జీ5లో సెర్చింగ్ మొదలుపెట్టారు. కానీ సినిమా మాత్రం కనిపించలేదు. దీంతో సబ్‌స్క్రైబర్స్ జీ5కు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు.

జీ5 స్పందన..

ప్రేక్షకుల ఫిర్యాదులకు జీ5 స్పందించింది. ‘‘హాయ్.. మాకు దీనిపై ఎలాంటి అప్డేట్ రాలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్, సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఉండండి’’ అని ప్రకటించింది. దీంతో ఆడియన్స్ మరింత కన్ఫ్యూజన్‌లో పడిపోయారు. ‘హనుమాన్’ ఓటీటీలోకి వచ్చేస్తుంది అనుకుంటే దీనికి ఎలాంటి అప్డేట్ లేదని జీ5 చెప్తోంది. అంటే ఈ మూవీని ఓటీటీలో చూడడానికి ఇంకా చాలాకాలం ఎదురుచూడక తప్పదా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ‘హనుమాన్’ తెలుగు ఓటీటీ రిలీజ్‌పై పెద్దగా అప్డేట్ లేకపోయినా.. హిందీ రిలీజ్ డేట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హిందీ వెర్షన్‌కు లైన్ క్లియర్..

తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషల్లో ‘హనుమాన్’ను స్ట్రీమ్ చేయడం కోసం జీ5 ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. కానీ హిందీ వర్షన్ మాత్రం ప్రత్యేకంగా జియో సినిమా చేతుల్లోకి వెళ్లింది. ఇక మరీ ఆలస్యం చేయకుండా ‘హనుమాన్’ హిందీ వర్షన్‌ను మార్చి 16న ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేలా చేయాలని జియో సినిమా నిర్ణయించుకుంది. దీంతో హిందీ ఫ్యాన్స్ మాత్రం ఈ అప్డేట్‌పై సంతోషిస్తున్నారు. కానీ తెలుగులో ఈ సినిమాను ఓటీటీలో చూడాలనుకుంటున్న ప్రేక్షకులు మాత్రం మరికొంతకాలం ఆగాల్సిందే. హిందీలాగానే తెలుగు కూడా కనీసం మార్చి 16 వరకు స్ట్రీమ్ అయిన బాగుంటుందని భావిస్తున్నారు. తెలుగులో మాత్రమే కాదు.. హిందీలో కూడా ‘హనుమాన్’ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. కేవలం హిందీ వర్షన్‌లోనే ఈ మూవీ రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Also Read: ‘పుష్ప 2’ తర్వాత మరో క్రేజీ ఆఫర్‌‌ను వదులుకున్న శ్రీలీల, కారణం ఇదేనా?

టాప్ హెడ్ లైన్స్

Romantic Drama OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి A రేటెడ్ రొమాంటిక్ మూవీ - తెలుగులోనూ చూడొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి A రేటెడ్ రొమాంటిక్ మూవీ - తెలుగులోనూ చూడొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Action Thriller OTT : ఓటీటీలోకి మలయాళ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ - అడవి మృగాలు Vs మనుషుల మధ్య వార్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి మలయాళ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ - అడవి మృగాలు Vs మనుషుల మధ్య వార్... ఎందులో చూడొచ్చంటే?
Crime Thriller OTT : సూసైడ్ వెనుక సైకో కిల్లర్ - లేటెస్ట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
సూసైడ్ వెనుక సైకో కిల్లర్ - లేటెస్ట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
Nara Lokesh: మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Embed widget