The Hunter Chapter 1 OTT : సడన్‌గా ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ 'ది హంటర్ చాప్టర్ 1' - నగరంలో వరుస హత్యలు... మాస్క్ మిస్టరీ తెలియాలంటే?
The Hunter Chapter 1 OTT Platform : ఓటీటీ ఆడియన్స్‌కు థ్రిల్ పంచేందుకు మరో హారర్ థ్రిల్లర్ వచ్చేసింది. తమిళ హిట్ మూవీ తెలుగులోనూ రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది.

Vaibhav Reddy's The Hunter Chapter 1 OTT Streaming : క్రైమ్, హారర్, మిస్టరీ థ్రిల్లింగ్ కంటెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. తాజాగా మరో మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేసింది. తమిళ మూవీ 'రణం అవరం తవరేల్' గతేడాది ఫిబ్రవరిలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో తెలుగులో 'ది హంటర్ చాప్టర్ 1' పేరుతో ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ చేశారు. తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ఓటీటీలో థ్రిల్ పంచేందుకు రెడీ అవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'ఆహా'ఎలాంటి ప్రకటన లేకుండానే శుక్రవారం సాయంత్రం నుంచి సడన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ మూవీలో వైభవ్ కీలక పాత్ర పోషించగా నందితా శ్వేత, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. షెరీఫ్ దర్శకత్వం వహించగా... ఆద్యంతం ఆడియన్స్‌కు థ్రిల్ పంచేలా ఉండే మూవీని చూసి ఎంజాయ్ చెయ్యండి.
Also Read : 'అఖండ 2' ప్రీమియర్స్ రద్దు - అఫీషియల్ అనౌన్స్‌మెంట్... బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్ షాక్
స్టోరీ ఏంటంటే?
నగరంలో వరుస హత్యలు పోలీస్ శాఖకు తలనొప్పి తెచ్చిపెడుతుంటాయి. అందరూ ఒకే రీతిలో హత్య చేయబడతారు. కాలిపోయిన శవాల కాళ్లు, చేతులు, మొండెం, తల ఇలా వేర్వేరుగా అట్టపెట్టెల్లో పెట్టి వేర్వేరు చోట్ల పడేస్తుంటాడు హంతకుడు. వాటితో పాటు ఓ మాస్క్‌ను కూడా వదిలేస్తుంటాడు. ఈ కేసును విచారించే క్రమంలో పోలీసులకు ఫోటోలు ఊహించి గీయడంలో ప్రతిభ ఉండే శివ (వైభవ్) హెల్ప్ చేస్తుంటాడు. గుర్తు పట్టలేని స్థితిలో ఉన్న శవాలకు సంబంధించి అసలు ముఖాలను ఊహించి పర్ఫెక్ట్‌గా గీస్తాడు.
అలా శవాలకు సంబంధించి ఫోటోలు గీసి పోలీసులకు సహకరిస్తాడు. వరుస హత్యలు అతన్ని కూడా నిద్ర పట్టకుండా చేస్తుంటాయి. పోలీస్ ఆఫీసర్ ఇందూజ తాన్య (తాన్య హోప్)తో కలిసి శివ ఈ కేసులు ఎలా సాల్వ్ చేశాడు?, అసలు ఈ హత్యలకు కారణం ఏంటి? హంతకుడు దొరికాడా? అసలు శివ గతం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















