Teja Sajja OTT Debut : ఓటీటీలోకి తేజ సజ్జా ఎంట్రీ - ఫేమస్ రియాలిటీ షో 'ది ట్రైటర్స్' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Teja Sajja The Traitors : ది ఫేమస్ రియాలిటీ షో ది ట్రైటర్స్... తెలుగులోనూ ఓటీటీలోకి రానుంది. యంగ్ హీరో తేజ సజ్జా ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

Teja Sajja's The Traitors OTT Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఫేమస్ రియాలిటీ షో 'ది ట్రైటర్స్' (The Traitors) ఇప్పుడు టాలీవుడ్ ఆడియన్స్‌ను కూడా ఎంటర్టైన్ చేసేందుకు కూడా రెడీ అవుతోంది. దీనికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'ది ట్రైటర్స్' తెలుగు రియాలిటీ షో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'ప్రపంచంలో అందరూ మంచోళ్లే. మోసం చేసే అవకాశం రానంతవరకూ. ప్రేమ కోసం అధికారం కోసం యుద్ధం కోసం. యుగాలు మారినా కారణాలు ఏమైనా మోసం మాత్రం మారలేదు.' అంటూ తేజ సజ్జా చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన ప్రోమో ఆకట్టుకుంటోంది.
దాదాపు 20 మంది సెలబ్రిటీలు ఈ రియాలిటీ షోలో పాల్గొంటారని సమాచారం. ఈ షో కేవలం ఇంటెలిజెన్స్ బేస్డ్‌గా నడుస్తుంది. టాలెంట్‌తో పాటు ఇంటెలిజెన్స్ ఉన్న వారు మాత్రమే సక్సెస్ అవుతారు. హిందీ రియాలిటీ షోను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. తెలుగు షోకు తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తారు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన తేజ సజ్జా... జాంబిరెడ్డి, హనుమాన్ మూవీస్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. 'మిరాయ్' సక్సెస్‌తో పాన్ ఇండియా స్థాయి ఫేమ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు హనుమాన్ సీక్వెల్‌తో పాటు జాంబీ రెడ్డి సీక్వెల్స్ మూవీస్‌తో బిజీగా ఉన్నారు. త్వరలోనే మిరాయ్ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Demon Pawan Rithu : బిగ్ బాస్ జంట బ్రేకప్ - రీతూతో బంధం ముగిసిపోయిందంటూ డీమాన్ పవన్ ఎమోషనల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























