Thriller Movies On OTT: హ్యాకర్‌ను కెలికి మరీ కష్టాలు కొనితెచ్చుకొనే అమ్మాయి - వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీని అస్సలు మిస్ కావద్దు
Movie Suggestions: ఈరోజుల్లో ఒక్క బటన్‌తో పని పూర్తి చేయొచ్చు. అలాంటి వాటివల్లే ఒక స్కామ్‌లో ఇరుక్కుంటే? ఆ స్కామ్ చేసినవాడు సీరియల్ కిల్లర్ అయితే? అలాంటి ఒక నిజమైన ఘటన ఆధారంగా తెరకెక్కిందే ఈ చిత్రం.
Best Thriller Movies On OTT: సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్.. ఇలాంటివాటి వల్ల ఎలాంటి అనార్థాలు జరుగుతున్నాయో రియల్ లైఫ్‌లో మాత్రమే కాకుండా చాలా సినిమాల్లో కూడా చూశాం. అలాంటి సోషల్ మెసేజ్‌లో మంచి థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను కూడా యాడ్ చేస్తే ఆ సినిమా చూడడానికి మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఒకవేళ అలాంటి విషయాలు నిజమయితే నమ్మడం కొంచెం కష్టమే. కానీ సౌత్ కొరియాలో ఇలాంటి ఒక ఘటనే జరిగింది. ఆ నిజమైన ఘటన ఆధారంగా ‘టార్గెట్’ (Target) అనే కథ తెరకెక్కింది. 2023లో విడుదలయిన ఈ చిత్రం చూసినవారంతా నిజమైన ఘటనతో తెరకెక్కింది అని తెలియగానే చాలా డిస్టర్బింగ్‌గా ఉందంటూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు.
కథ..
‘టార్గెట్’ కథ విషయానికొస్తే.. ఒక వ్యక్తి తన మ్యాక్ బుక్‌ను సెకండ్ హ్యాండ్ యాప్‌లో అమ్మకానికి పెడతాడు. దానికోసం తనకు మెసేజ్ చేస్తున్న అబ్బాయిలు అందరినీ పక్కన పెట్టి.. అమ్మాయిలకు మాత్రమే రిప్లై ఇస్తాడు. అలా ఒక అమ్మాయి తన మ్యాక్ బుక్ కొనడానికి ఆసక్తి చూపిస్తుంది. దీంతో ఆ వ్యక్తి.. తనను ఇంటికి రమ్మని పిలుస్తాడు. ఇంటికి రాగానే ఆ వ్యక్తిని చంపేసి తన శవాన్ని ఫ్రిడ్జ్‌లో దాచిపెడుతుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే యాప్‌లో తన ఇంటిలోని వస్తువులు అన్నింటిని అమ్మకానికి పెడుతుంది. కట్ చేస్తే.. సూ హ్యూన్ (షిన్ హై సున్).. ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తుంది. తన వాషింగ్ మిషీన్ పాడవ్వడంతో తన ఫ్రెండ్ సలహాను బట్టి సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే యాప్‌లో మరొక వాషింగ్ మిషీన్ కొంటుంది సూ హ్యూన్. ఆ వాషింగ్ మిషీన్‌ను అమ్మింది ఆ కిల్లర్. తను మర్డర్ చేసిన వ్యక్తి ఐడెంటిటీని అడ్డం పెట్టుకొని వాషింగ్ మిషీన్‌తో పాటు ఇతర వస్తువులను కూడా అమ్ముతాడు.
తాను ఆర్డర్ చేసిన వాషింగ్ మిషీన్ పనిచేయడం లేదనే కోపంతో యాప్‌లో నెగిటివ్ రివ్యూలు ఇస్తుంది సూ హ్యూన్. దీంతో ఆ కిల్లర్.. సూ హ్యూన్‌ను టార్గెట్ చేస్తాడు. దీంతో అతడు ఒక కిల్లర్ అని తెలియక సూ హ్యూన్.. వార్నింగ్ ఇస్తుంది. కానీ ఈ కిల్లర్ పట్టించుకోకుండా తన ఇంటికి ఫుడ్ ఆర్డర్స్ పంపిస్తుంటాడు. తన అమ్మలాగా మట్లాడి డబ్బులు పంపించమని అడుగుతాడు. తన అకౌంట్‌ను హ్యాక్ చేసి బాయ్‌ఫ్రెండ్ కావాలంటూ పోస్ట్ పెడతాడు. దీంతో సూ హ్యూన్ జీవితం కష్టంగా మారుతుంది. అప్పుడు డిటెక్టివ్స్.. తను ఇచ్చిన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుంటారు. అసలు అలా చేస్తుంది ఎవరో తెలుసుకోవడం కోసం డిటెక్టివ్ జూ (కిమ్ సుంగ్ క్యూన్) రంగంలోకి దిగుతాడు. అసలు ఎవరు ఆ కిల్లర్? సూ హ్యూన్ అతడి నుండి తప్పించుకోగలదా? అనేది తెరపై చూడాల్సిన అసలు కథ.
అతడే కిల్లర్..
‘టార్గెట్’ సినిమా చూసిన తర్వాత యాప్స్ వల్ల ఇంత జరుగుతుందా అని ఆడియన్స్ ఆలోచనలో పడతారు. పైగా యాప్స్‌లో స్కామ్ చేసేవారు చాలామంది ఉంటారు. అలాంటి స్కామర్.. ఒక కిల్లర్ అయితే పరిస్థితి ఏంటి అనే ఆలోచన కూడా భయంకరంగా ఉంటుంది. సినిమాలో అసలు కిల్లర్ ఎవరు అని చివరి వరకు గెస్ చేస్తూనే ఉంటారు. ఫైనల్‌గా ప్రేక్షకులు చేసే గెస్ కూడా చాలావరకు తప్పే అవుతుంది. ఇక ఇలాంటి ఒక నిజమైన ఘటన ఆధారంగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీని చూడాలంటే ‘అమెజాన్ ప్రైమ్’లో ఉన్న ‘టార్గెట్’ను చూసేయండి.
Also Read: శవాలను వండి మనుషులకు తినిపించే కిల్లర్ - సూపర్ మార్కెట్‌లోని మరణాలతో సంబంధం ఏమిటీ?