Special Ops Series Season 2 OTT Release Date: సైబర్ వార్.. స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'స్పెషల్ ఓపీఎస్ 2' - తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఆసక్తికరంగా ట్రైలర్
Special Ops 2 OTT Platform: స్పై యాక్షన్ థ్రిల్లర్స్‌లో బెస్ట్ వెబ్ సిరీస్ 'స్పెషల్ ఓపీఎస్' ఒకటి. ఈ సిరీస్ కొత్త సీజన్ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

Special Ops 2 Web Series OTT Release On Jio Hotstar: క్రైమ్, హారర్, థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ అంటేనే మూవీ లవర్స్‌కు ఓ స్పెషల్ క్రేజ్. అలాంటిది సైబర్ క్రైమ్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓటీటీ లవర్స్‌కు ఎంతగానో థ్రిల్ పంచిన వెబ్ సిరీస్‌ల్లో ఒకటి 'స్పెషల్ ఓపీఎస్'. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ కొత్త సీజన్ త్వరలోనే రాబోతోంది. దీనికి సంబంధించి కొత్త ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఫస్ట్ రెండు పార్టులను మించి..
ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ల్లో 'స్పెషల్ ఓపీఎస్' ఒకటి. ఈ సిరీస్‌కు నీరజ్ పాండే, శివమ్ నాయర్ దర్శకత్వం వహించగా.. కేకే మేనన్, కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే వచ్చిన తొలి రెండు సీజన్స్ ఆడియన్స్‌కు మంచి థ్రిల్ పంచాయి. ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో ఫస్ట్ సీజన్.. 'స్పెషల్ ఓపీఎస్ 1.5: ది హిమ్మత్ స్టోరీ' పేరుతో తీసుకొచ్చిన 4 ఎపిసోడ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
This time, everyone is a Target!
— JioHotstar (@JioHotstar) June 16, 2025
Cyber-Terrorism vs. Himmat Singh and his squad.#HotstarSpecials #SpecialOps2, streaming from July 11, only on #JioHotstar@neerajpofficial @kaykaymenon02 @prakashraaj @pathakvinay @karantacker #TahirRajBhasin @SaiyamiKher #MuzamilIbrahim… pic.twitter.com/QpM4WLtWfJ
స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ఇప్పుడు కొత్త సీజన్ 'స్పెషల్ ఓపీఎస్ 2' కూడా 'జియో హాట్ స్టార్'లో జులై 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది. తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉండనుంది. 'ఈసారి అందరూ టార్గెట్. సైబర్ టెర్రరిజం Vs హిమ్మత్ సింగ్ అండ్ టీం.' అని క్యాప్షన్ ఇచ్చింది. సైబర్ క్రైమ్, ఏఐ ఆధారిత టెక్నాలజీ నుంచి దేశానికి ఎదురయ్యే సవాళ్లతో వీరు పోరాడనున్నట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ బ్యూటిఫుల్ బట్ వెరీ డేంజరస్.' అంటూ స్టార్టింగ్ డైలాగ్‌తోనే హైప్ క్రియేట్ చేసింది.
దేశంలోనే టాప్ సైంటిస్ట్ కిడ్నాప్ కాగా.. అతన్ని కాపాడేందుకు హిమ్మత్ సింగ్ అండ్ టీమ్ రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో వారికి ఎదురైన సవాళ్లు ఈ సీజన్‌లో చూపించనున్నారు. కొత్త సీజన్‌లో పాత నటీనటులతో పాటు తాహిర్ రాజ్ బాసిన్, సయామీ శేఖర్, ముజామిల్ ఇబ్రహీం, టోటా రాయ్ చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
స్టోరీ ఏంటంటే?
ఉగ్రవాదులను మట్టు బెట్టేందుకు.. రా (RAW), ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహించాయనేది 'స్పెషల్ ఓపీఎస్'లో చూపించారు. 2001లో పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడి కోసం ఎలా వేట సాగించారో ఫస్ట్ సీజన్‌లో చూడొచ్చు. 'రా' ఉన్నతాధికారి హిమ్మత్ సింగ్ తొలి రోజుల్లో ఎదుర్కొన్న సవాళ్లను 'స్పెషల్ ఓపీఎస్ 1.5'లో చూపించారు. తాజా సీజన్‌లో ఏఐ, సైబర్ క్రైమ్ సవాళ్లు.. వాటి వల్ల ప్రమాదాలను ఎలా ఎదుర్కొన్నారనేది చూపించనున్నారు.





















