అన్వేషించండి

Movies On OTT: ప్రభుత్వమే ప్రజలను చంపేందుకు మందులిస్తుంది, చనిపోతామని తెలిసి పార్టీ చేసుకునే వింత ఫ్యామిలీ - ఇదొక డార్క్ కామెడీ మూవీ

Movie Suggestions: ఈ దేశంలో ప్రభుత్వమే ప్రజలు చనిపోవడానికి మందులు ఇస్తుంది. చనిపోతామని తెలిసి చివరిసారి తన ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకోవాలని ఆ ఫ్యామిలీ డిసైడ్ అవుతుంది. తర్వాత ఏం జరిగింది?

Dark Comedy Movies On OTT: ఈరోజుల్లో డార్క్ కామెడీ మూవీస్‌కు కూడా విపరీతమైన పాపులారిటీ పెరిగిపోతోంది. ముఖ్యంగా యూత్ ఇలాంటి సినిమాలను తెగ ఇష్టపడుతున్నారు. ప్రతీ భాషలో తెరకెక్కుతున్న డార్క్ కామెడీ చిత్రాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అలా హాలీవుడ్‌లో ఇలాంటి జోనర్‌లో తెరకెక్కిన చిత్రమే ‘సైలెంట్ నైట్’ (Silent Night). ఈ టైటిల్‌తో హాలీవుడ్‌లో పలు చిత్రాలు తెరకెక్కాయి. కానీ 2021లో విడుదలయిన ‘సైలెంట్ నైట్’ మాత్రం ఒక డార్క్ కామెడీ సెటైరికల్ చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమా హాయిగా చూసి నవ్వుకోవడానికి మాత్రమే కాకుండా చూసే ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తుంది.

కథ..

‘సైలెంట్ నైట్’ కథ విషయానికొస్తే.. సైమన్ (మాథ్యు గూడ్), నెల్ (కెయిరా నైట్లే).. తమ ఇంట్లో క్రిస్మస్ పార్టీని ఏర్పాటు చేస్తారు. దానికి తన ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తారు. సైమన్, నెల్‌కు ముగ్గురు పిల్లలు. ఆర్ట్ (రోమన్ గ్రిఫిన్ డేవిస్), హార్డీ (హార్డీ), థామస్ (గిల్బీ గ్రిఫిన్ డేవిస్). వారు ఏర్పాటు చేసిన క్రిస్మస్ పార్టీకి ముగ్గురు కపుల్స్ వస్తారు. అందులో ఒకరికి కిట్టీ (డేవిడ మ్యాక్‌కెన్జీ) అనే కూతురు కూడా ఉంటుంది. క్రిస్మస్ డిన్నర్ ప్రారంభమయిన తర్వాత ఒక్కరి మొహంలో కూడా సంతోషం కనిపించదు. ఆర్ట్, కిట్టీ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నా కూడా ఎవ్వరూ వారిని ఆపరు. ఆ డిన్నర్ టేబుల్‌పై చూస్తే సరిపడా ఆహారం ఉండదు. అందరి ప్లేట్‌లో కొంచెం ఫుడ్ మాత్రమే ఉంటుంది.

కట్ చేస్తే.. ఆ దేశంలో ఒక విషపూరిత గ్యాస్ విడుదల అవుతూ ఉంటుంది. దాని వల్ల అందరూ చనిపోతూ ఉంటారు. ఆ గ్యాస్‌ను కంట్రోల్ చేసి, ప్రజలను కాపాడాలని ప్రభుత్వం ప్రయత్నించినా కూడా అది జరగదు. దీంతో గ్యాస్ వల్ల ఘోరమైన చావును ఎదుర్కోవడం కంటే నొప్పి లేకుండా చనిపోతే బాగుంటుందని అనుకునేవారి కోసం ప్రభుత్వం.. ఒక ఎగ్జిట్ పిల్‌ను ఇస్తుంది. ఆ ఎగ్జిట్ పిల్‌ను వేసుకోవడం కోసమే సైమస్, నెల్.. ఈ క్రిస్మస్ పార్టీని ఏర్పాటు చేసుంటారు. వారి కొడుకు ఆర్ట్.. చిన్నవాడే అయినా తనకు ఈ విషపూరిత గ్యాస్ మీద నమ్మకం ఉండదు. అందుకే ఎగ్జిట్ పిల్ వేసుకోను అని మారాం చేస్తాడు. కానీ తన తల్లిదండ్రులు తనను ఒప్పిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారందరినీ ఆ గ్యాస్ చంపేసిందా? లేదా ఎగ్జిట్ పిల్ వేసుకొని వారే చనిపోయారా? అనేది తెరపై చూడాల్సిన కథ.

తక్కువ ట్విస్టులు..

‘సైలెంట్ నైట్’లో చెప్పుకోవడానికి పెద్దగా ట్విస్టులు ఏమీ లేకపోవచ్చు. కానీ తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తిని క్రియేట్ చేయడంలో మాత్రం దర్శకురాలు క్యామిలీ గ్రిఫిన్ సక్సెస్ అయ్యారు. ఎగ్జిట్ పిల్ వేసుకొని చనిపోవడం కోసమే వారంతా క్రిస్మస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు అనే ట్విస్ట్ మాత్రం ప్రేక్షకులు ఊహించలేరు. చనిపోయే ముందు మనుషులు ఎలా ఉంటారు అనే అంశాన్ని ‘సైలెంట్ నైట్’లో బాగా చూపించారు. టైమ్ పాస్ కోసం ఒక డార్క్ కామెడీ చిత్రాన్ని చూడాలనుకుంటే ‘నెట్‌ఫ్లిక్స్’లో ఉన్న ‘సైలెంట్ నైట్’ను ట్రై చేయండి.

Also Read: మనుషుల్లా రూపం మార్చుకునే వింత జీవులు, ఆ క్యాబిన్‌లో ఉండేవారు తప్పించుకోవడం ఎలా? హోం థియేటర్లో చూడాల్సిన ఓటీటీ మూవీ ఇది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget