Sammathame Telugu Movie OTT Release: ఆహాలో 'సమ్మతమే' - కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
Sammathame OTT Release date Locked: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన 'సమ్మతమే' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు అయ్యింది.
కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సమ్మతమే'. జూన్ 24న థియేటర్లలో విడుదల అయ్యింది. థియేటర్లలోకి వచ్చిన మూడు వారాలకు ఓటీటీలోకి రానుంది.
'సమ్మతమే' డిజిటల్ రిలీజ్ రైట్స్‌ను 'ఆహా' ఓటీటీ దక్కించుకుంది. జూలై 15న ఈ సినిమా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌కు ఏర్పాట్లు చేస్తోంది. అంటే... ఆ రోజు నుంచి సినిమా వీక్షకులకు అందుబాటులోకి రానుందన్నమాట.
పెళ్లి తర్వాత కట్టుకున్న భార్యను ప్రేమించాలని వెయిట్ చేస్తున్న, తనకు కాబోయే భార్య తనతో పెళ్ళికి ముందు ఎవరితోనూ ప్రేమలో పడకూడదని ఆశిస్తున్నా ఓ యువకుడికి... గతంలో ఒకరిని ప్రేమించిన అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఏమైందనేది సినిమా.
Also Read : విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర
గోపీనాథ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమైన 'సమ్మతమే' సినిమాను ఆయన తల్లి ప్రవీణా రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం బలంగా నిలిచింది. ఆయన పాటలు, నేపథ్య సంగీతానికి మంచి పేరు వచ్చింది.
Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన 'దిల్' రాజు భార్య తేజస్విని వ్యాఘా రెడ్డి
View this post on Instagram
View this post on Instagram